![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/Ap_Govt_1739291035061_1739291042061.png)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497842_358_newTwitterIcon.png)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497843_996_facebook1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497844_122_wapp1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/Ap_Govt_1739291035061_1739291042061.png)
CM Chandrababu : మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం, ప్రతి మండలంలో ఐటీ కార్యాలయాలు- సీఎం చంద్రబాబు
CM Chandrababu : ఏపీ ప్రభుత్వం మహిళల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు చేస్తుంది. ఈ విషయంగా సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా ప్రకటించారు. ప్రతి నగరం, పట్టణం, మండలంలో ఐటీ కార్యాలయాల ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నామన్నారు.
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ విధానాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు చేస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. స్టెమ్ కోర్సు మహిళలకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. సైన్స్ రంగంలో విజయాలు సాధిస్తున్న మహిళలకు అభినందనలు చెప్పారు. స్టెమ్ కోర్సు రంగాల్లో వృద్ధి అవకాశాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కొవిడ్ తర్వాత పరిణామాలు, అందుబాటులో ఉన్న సాంకేతికత ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ప్రాముఖ్యతను పెంచాయని గుర్తు చేశారు.
![yearly horoscope entry point](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
ఐటీ, జీసీసీ పాలసీ గేమ్ ఛేంజర్
రిమోట్ వర్క్, కోవర్కింగ్ స్పేస్, నైబర్‌హుడ్ వర్క్ స్పేస్ వంటి కాన్సెప్ట్‌లు అనువైన ఉత్పాదక వాతావరణాన్ని సృష్టిస్తాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇవి వ్యాపారులు, ఉద్యోగులకు సమర్థవంతమైన ఫలితాలు అందిస్తాయన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మెరుగైన పని, జీవిత సమతుల్యతను సాధించడంలో సహాయపడతాయన్నారు.
“ఆంధ్రప్రదేశ్ ఐటీ, జీసీసీ పాలసీ 4.0 గేమ్ ఛేంజర్ కానుంది. ప్రతి నగరం, పట్టణం, మండలంలో ఐటీ కార్యాలయాల ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నాం. అందుకు తగిన ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. అట్టడుగు స్థాయిలో ఉపాధిని సృష్టించేందుకు ఐటీ, జీసీసీ సంస్థలకు మద్దతు ఇస్తాము. ఈ కార్యక్రమాలు ఎక్కువ శ్రామికశక్తి భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తాయని విశ్వసిస్తున్నాం” – సీఎం చంద్రబాబు
వాట్సాప్ గవర్నెన్స్ లో అన్ని సర్వీసులు
సీఎం చంద్రబాబు ఆర్థిక శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫైళ్ల క్లియరెన్స్ స్పీడ్ పెంచాలని అధికారులకు సూచించారు. జీఎస్డీపీ గ్రోత్ బాగా పెరగాలన్నారు. ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలని సూచించారు. వాట్సాప్ గవర్నెన్స్ లో అన్ని సర్వీసులు ఉండాలన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్థిక సంబంధం లేని సమస్యలు పరిష్కరించాలన్నారు. డబ్బులు లేవని ఎట్టిపరిస్థితులలో పనులు ఆపొద్దన్నారు. కార్యదర్శులు అప్పుడప్పుడు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని సూచించారు. అధికారులు అందరూ గ్రామాల్లో పర్యటించాలన్నారు. ఉగాది రోజు పీ4 ప్రారంభిస్తామన్నారు. హ్యాపీ సండే ప్రోగ్రామ్ కూడా త్వరలో ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
డీఎస్సీ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని తేల్చిచెప్పారు. రూ.22 వేల కోట్ల పాత బకాయిలు చెల్లిస్తున్నామని చెప్పారు. ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోయినా ముందుకు వెళ్తున్నాం.. బకాయిలు చెల్లిస్తున్నామని అన్నారు. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వాల్సిందేనని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో రోడ్లపై గుంతలు కనిపించకూడదని సూచనలు చేశారు. నాలుగేళ్లలో రహదారులు మొత్తం బాగుచేయాలన్నారు. గత ప్రభుత్వంలో రోడ్లపై వెళ్లాలంటే భయం వేసేదన్నారు. త్వరలో గుంతలు లేని రోడ్లు చూడాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశించారు.
సంబంధిత కథనం
టాపిక్