




Best Web Hosting Provider In India 2024

Chiranjeevi : ఈ జన్మంతా రాజకీయాలకు దూరం, చిరంజీవి సంచలన ప్రకటన
Chiranjeevi : తన రాజకీయ జీవితంపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన చేశారు. తన జన్మంతా రాజకీయాలకు దూరంగా, సినిమాలకు అతి దగ్గరగా ఉంటానని స్పష్టంచేశారు. తన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి పవన్ కల్యాణ్ ఉన్నారన్నారు.
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన చేశారు. ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. సినిమాలకు అతి దగ్గరగా ఉంటానన్నారు. హైదరాబాద్ లో జరిగిన ‘బ్రహ్మా ఆనందం’ ప్రీరిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి…రాజకీయ జీవితంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై తాను కళామతల్లి సేవలోనే గడిపేస్తానన్నారు. రాజకీయ పెద్దలను కలిసేది పాలిటిక్స్ కోసమేనంటూ కొందరు ప్రచారం చేస్తున్నారని, కానీ తాను సినీ రంగానికి అవసరమైన సహకారం కోసమే కలుస్తున్నానని స్పష్టం చేశారు. తన ఆశయాలు, లక్ష్యాలు, సేవాభావాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి పవన్ కల్యాణ్ ఉన్నారని చిరంజీని వెల్లడించారు.

“నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను. నేను పూర్తి చేయలేనిది నా స్థానంలో పవన్ కల్యాణ్ చేస్తున్నాడు. ఈ మధ్య నేను వాళ్లకి వీళ్ళకి దగ్గరయ్యాను ఫలానా పార్టీలో చేరుతానని అనుకుంటున్నారు కానీ అలాంటిది ఏమీ లేదు. రాజకీయాల పరంగా నేను అనుకున్న లక్ష్యాలను, సేవా భావాలను పూర్తి చేయడానికి పవన్ కల్యాణ్ ఉన్నాడు”- చిరంజీవి
సంబంధిత కథనం
టాపిక్