




Best Web Hosting Provider In India 2024

Hug Day Wishes: నా ప్రేమకు గుర్తుగా ఒక కౌగిలింతను పంపిస్తున్నా, హగ్ డే కు అందమైన శుభాకాంక్షలు ఇవిగో
Hug Day Wishes: ప్రేమలో కౌగిలింతకు ఎంతో విలువ ఉంటుంది. దానితో ఎంతో మాయా ఉంటుంది. ఒక్క కౌగిలింత ఎంతో ఆనందాన్ని అందిస్తుంది. హగ్ డే శుభాకాంక్షలు ఇక్కడ తెలుగులో ఇచ్చాము. ఇవి మీ ప్రేమికులకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి.
హ్యాపీ హగ్ డే (Pixabay)
ప్రేమతో నిండిన హృదయానికి వాలెంటైన్ వీక్లో ప్రతి రోజు చాలా ప్రత్యేకం. ప్రతి సంవత్సరం ఈ ప్రేమ నెలలో ఫిబ్రవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు ‘హగ్ డే’గా జరుపుకుంటారు. మీరు మీ భాగస్వామికి మాటలతోనే హత్తుకోవాలనుకుంటే, ఈ హగ్ డే కోట్స్, సందేశాలు, కవితలు మీ ప్రేయసి లేదా ప్రియులకు పంపండి. ఈ అందమైన హగ్ డే సందేశాలను చదివిన తర్వాత మీ భాగస్వామి ముఖంపై చిరునవ్వు వచ్చేస్తుంది.

హగ్ డే శుభాకాంక్షలు తెలుగులో
- మన చేతుల మధ్య ఇక దూరం ఉండకూడదు,
నా గుండెకు నీ గుండె అతుక్కుపోవాలి
మనిద్దరి మొదటి కౌగిలింత ఎంతో ప్రత్యేకం
హ్యాపీ హగ్ డే మై లవ్!
2. ఒకే కోరిక, ఒకే ఆశ
నీ కౌగిలింతలో
నా జీవితమంతా గడపాలి!
హ్యాపీ హగ్ డే
3. మాటలతోనే నా గుండెను దోచుకున్నావు
అలా చూస్తూ నా ప్రాణాలను తీసేస్తున్నావు
నీ అందంతో నా గుండె వేగాన్ని పెంచేస్తున్నావు
నిన్ను నా చేతుల్లోకి తీసుకున్న క్షణం లోకమంతా మరచిపోతాను.
హ్యాపీ హగ్ డే
4. మొదటి కౌగిలింత ఒక మాయాలాంటిది
అది జీవితాంతం గుర్తుండి పోతుంది
నువ్వు నన్ను ప్రేమతో కౌగిలించుకునే రోజు కోసం ఎదురుచూస్తున్నాను.
హ్యాపీ హగ్ డే
5. మీ ప్రేమ కోసం ఎదురుచూస్తున్నాను
నీ కోసం చేతులు చాచి ఎదురు చూస్తున్నాను
నా జీవితం నీకోసమే
హ్యాపీ హగ్ డే డియర్!
6. ఒక్కసారి నన్ను హత్తుకుని,
నా గుండె కొట్టుకునే శబ్దం వినండి
నా ప్రేమ మీకు అర్థమవుతుంది
హ్యాపీ హగ్ డే జాన్!
7. మీ చేతుల్లో నన్ను కరిగిపోనివ్వండి,
మీ శ్వాసలో నన్ను లీనమైపోనివ్వండి,
నీ ప్రేమ కోసం నా గుండె ఎంతోకాలం ఎదురుచూస్తోంది,
హ్యాపీ హగ్ డే.
8. కొన్నిసార్లు ప్రేమను మాటలతో చెప్పలేము
నన్ను హత్తకుని నా గుండె చప్పుడు వినండి
మీకు అర్థమవుతుంది ప్రేమ
హ్యాపీ హగ్ డే డియర్!
9. నా కౌగిలిలోని వచ్చేయి ప్రియతమా,
నా చేతులతోనే నిన్ను దాచేస్తాను
జీవితమంతా నిన్ను కాపాడుకుంటాను
హ్యాపీ హగ్ డే
10. రోమియో జూలియెట్ను ఎలా హత్తుకున్నాడో,
లైలా మజ్నూనును ఎలా హత్తుకుందో,
హీర్ రాంజాను ఎలా హత్తుకుందో,
ప్రియతమా నువ్వు కూడా నన్ను అలాగే హత్తుకోవాలని కోరుకుంటున్నా
హ్యాపీ హగ్ డే…
11. నీ కౌగిలంతే నాకు పెద్ద స్ట్రెస్ బస్టర్
ఓదార్పునిచ్చే సూర్యకిరణం
ప్రతి ఉదయం నాకు నీ కౌగిలింత కావాలి
హ్యాపీ హగ్ డే
12. కష్టసమయాల్లో నువ్వు నా పక్కన ఉన్నందుకు ధన్యవాదాలు
నా నవ్వుకు కారణం అయినందుకు ధన్యవాదాలు
అందుకే నా ప్రేమంతా నీదే
నువ్పెప్పుడు నా కౌగలిలోనే ఉండాలి
హ్యాపీ హగ్ డే
13. మీ కౌగిలే నా ప్రపంచం
నిన్ను కౌగిలించుకున్నప్పుడు నా ప్రపంచం ఆగిపోయినట్టు అనిపిస్తుంది
హ్యాపీ హగ్ డే
14. నీ కౌగిలి నాకు దేవుడు ఇచ్చిన వరం
నేను ఎల్లప్పుడు నీ కౌగిలిలోనే ఉండిపోవాలని కోరుకుంటున్నాను
హ్యాపీ హగ్ డే
సంబంధిత కథనం