Karthika Deepam 2 Serial February 12: వాటే సీన్.. సవతి కావేరి ఇంటికి కాంచన.. తాత మాటలకు అవాక్కైన జ్యోత్స్న

Best Web Hosting Provider In India 2024

Karthika Deepam 2 Serial February 12: వాటే సీన్.. సవతి కావేరి ఇంటికి కాంచన.. తాత మాటలకు అవాక్కైన జ్యోత్స్న

Karthika Deepam 2 Serial Today Episode February 12: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. కావేరి డబ్బు ఇచ్చిన విషయం ఎందుకు దాచాల్సి వచ్చిందో కార్తీక్‍కు దీప వివరిస్తుంది. తాత ప్రవర్తనకు జ్యోత్స్న షాక్ అవుతుంది. సవతి కావేరి ఇంటికి కాంచన వెళుతుంది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.

 
Karthika Deepam 2 Serial February 12: వాటే సీన్.. సవతి కావేరి ఇంటికి కాంచన.. తాత మాటలకు అవాక్కైన జ్యోత్స్న
Karthika Deepam 2 Serial February 12: వాటే సీన్.. సవతి కావేరి ఇంటికి కాంచన.. తాత మాటలకు అవాక్కైన జ్యోత్స్న
 

కార్తీక దీపం 2 నేటి (ఫిబ్రవరి 12) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. శౌర్య ఆపరేషన్‍కు కావేరి డబ్బు ఇచ్చిందనే విషయాన్ని దాచడంపై దీపను కార్తీక్ నిలదీస్తాడు. ఈ వారం రోజుల్లో ఈ విషయం గురించి వందసార్లు మాట్లాడుకున్నా.. నిజం చెప్పలేదని దీపతో అంటాడు. మోసం చేశావన్నట్టుగా మాట్లాడతాడు. చెప్పొద్దని కావేరి మాట తీసుకుందని కన్నీళ్లతో చెబుతుంది దీప. మోసం చేశానని అనుకుంటున్నారా అని అడుగుతుంది. “నిజం చెప్పకపోవడాన్ని ఏమంటారు దీప.. నాన్న మోసం అన్నాడు. నేను దానికి ఏ పేరు పెట్టాలి” అని కార్తీక్ ప్రశ్నిస్తాడు.

మాటలతోనే తల నరికేశాడు

తండ్రి శ్రీధర్ అన్న మాటలకు తాను ఎంత బాధపడ్డానో దీపకు కార్తీక్ చెబుతాడు. “నా కూతురు ప్రాణాన్ని నాకు భిక్షగా పెట్టానని అన్నాడు.. మా ముఖాల మీద చిరునవ్వు తన దయ అన్నాడు. ఆ మాటలు వింటుంటే చెవి నరాలు పగిలి నెత్తురు బయటికి వస్తుందేమో అనిపించింది” అని కార్తీక్ అంటాడు. అతడి ఎగతాళి, నవ్వు చూస్తుంటే నిలువులోతులో నన్ను నేను పాతేసుకున్నట్టు అనిపించింది. “రెండో పెళ్లి చేసుకొని తనను మోసం చేశాడని, మా అమ్మ మా నాన్నను వద్దనుకుంది. ఆ రోజు నన్ను గెంటేశారు. ఈ రోడు నేను లేకపోతే గతి లేదని మా నాన్న మా అమ్మ ముందు నిన్ను అడ్డుపెట్టుకొని నాకు నిరూపించి వెళ్లాడు. ఆ మనిషి మాటలతోనే నా తల నరికేశాడు దీప” అని కార్తీక్ కోపంగా మాట్లాడతాడు. నా ఆత్మ గౌరవరాన్ని నేను నమ్మిన మనుషులతోనే సజీవ దహనం చేశాడని చెబుతాడు.

పాపానికి పశ్చాత్తాపపడుతోంది

దీప వివరణ ఇవ్వబోతే.. నాతో ఏం మాట్లాడొద్దంటాడు కార్తీక్. అయితే, తాను చెప్పేది వినాలని దీప అంటుంది. “కావేరిని మీరు ఇంత కాలం మీ అమ్మను మోసం చేసిన మనిషిగానే చూశారు. చేసిన పాపానికి పశ్చాత్తాపడుతున్న మనిషిని నేను చూశాను. తన కారణంగా ముక్కలైన మనసుతో కన్నీళ్లు పెట్టుకున్న మనిషిని చూశాను. వేరొకరి సౌభాగ్యాన్ని దోచుకున్నానని ఆ మనిషి మానసికంగా నలిగిపోతోంది” అని కావేరి గురించి దీప చెబుతుంది. ఈ మాటలను కాంచన వెనక నుంచి వింటుంటుంది.

 

అందుకే చెప్పలేకపోయా

శౌర్య ఆసుపత్రిలో ఉన్నప్పుడు కావేరి వచ్చి ఓదార్చిందని, మీతో చెప్పొద్దని అనిందని వివరిస్తుంది. తనకు కూడా చెప్పకుండా ఆపరేషన్‍కు డబ్బు కట్టిందని, తనకు ఆ తర్వాత తెలిసిందని దీప అంటుంది. అప్పుడు బయట ఉన్న కావేరి దగ్గరికి వెళ్లానని చెబుతుంది. తానే డబ్బు కట్టానని, కానీ ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని కావేరి మాట తీసుకుందని దీప వివరిస్తుంది. అడగకుండా ఇంత సాయం ఎందుకు చేశారని తాను కావేరిని అడిగానని అంటుంది. “ఇది సాయం కాదు. మా అక్క కుటుంబానికి నేను చేసిన ద్రోహానికి చేసుకున్న ప్రాయశ్చిత్తం అని చెప్పింది. చిన్నదాన్ని కాపాడితే అయినా మా అక్కకు చేసిన పాపం కొంతైనా తగ్గుతుంది అంది” అని దీప చెబుతుంది. దీంతో ఏమీ అనలేక చేతులెత్తి నమస్కారం పెట్టి మీలాగే మౌనంగా చూస్తూ ఉండిపోయానని అంటుంది. “నిజం ఎవరికీ చెప్పొద్దని మాట తీసుకున్నారు. కూతురు ప్రాణాలు కాపాడిన మనిషి అడిగిన మాటను కూడా కాపాడకపోతే పొందిన సాయానికి కృతజ్ఞత ఏముంటుంది కార్తీక్ బాబు” అని దీప వివరిస్తుంది.

కారణం మీరే

ఏ సాయం చేయకుండా మీ నాన్న అన్ని మాటలు అన్నారని, సాయం చేసి కూడా ఆ విషయం చెప్పొద్దని అన్నారని దీప అంటుంది. కావేరి ఈ సాయం చేసి కూడా నిజం చెప్పొద్దనేందుకు మీరు, మీ అమ్మ అని దీప అంటుంది. “నాలాంటి మనిషి దగ్గర సాయం పొందడం మా అక్కకు, కార్తీక్‍కు ఇష్టం ఉండదు. చెప్పి వాళ్లను బాధ పెట్టొద్దని మోనంగా వెళ్లిపోాయారు” అని కావేరి చెప్పారని వివరిస్తుంది. దీంట్లో నేను చేసిన మోసం ఏముందని అడుగుతుంది.

 

ఇందులో దీప తప్పులేదు

కత్తి అంచున నిలబెట్టావని, ఏ సమాధానం చెప్పమంటావ్ అని కార్తీక్ అంటాడు. ఆ రోజు దీప కూడా ఇదే పరిస్థితిలో ఉందని రా అని కాంచన అంటుంది. మీ నాన్న చెప్పింది విన్నాం.. దీప చెప్పింది విన్నాం.. యథార్థం ఏంటో అర్థమవుతోంది కదా అని కాంచన అంటుంది. చంటిది కళ్ల ముందు నవ్వుతూ తిరుగుతున్నాం కాబట్టి ఇప్పుడు ఇలా ఉన్నామని, ఆ రోజు పరిస్థితి ఏంటి అని గుర్తు చేస్తుంది. ఇందులో దీప తప్పు లేదు అని కాంచన అంటుంది. తప్పు తనదే అని, తానే సరిదుద్దుకుంటానని కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది దీప. కార్తీక్ మనసు బాధపెట్టి తప్పు చేశానని దీప అంటే.. తెలియకుండా పొందిన సాయానికి నువ్వైనా ఏం చేస్తావు దీప అని సర్దిచెబుతుంది కాంచన. ఇప్పుడు చేయాల్సింది మనలో మనం నిందించుకోవడం కాదు.. మనం చేయాల్సింది పొందిన సాయానికి కృతజ్ఞతలు చెప్పుకోవడం అని అంటుంది.

జ్యోత్స్న ప్లాన్ ఫెయిల్.. తాత మాటలకు అవాక్కు

దశరథ్, సుమిత్ర ఇంట్లో లేకపోయే సరికి మమ్మీ డాడీ ఏరి అని పారిజాతాన్ని జ్యోత్స్న అడుగుతుంది. గుడికి వెళ్లారని అనుకుంటానని పారు అంటుంది. బావ ఇంట్లో హోమం ఉంది కదా.. అక్కడికే వెళ్లి ఉంటారని జ్యోత్స్న అంటుంది. తాత శివన్నారాయణ వద్ద ఈ విషయం చెప్పి రచ్చ చేయాలని ప్లాన్ చేస్తుంది జ్యోత్స్న.

 

ఇంతలో దశరథ్, సుమిత్ర వస్తారు. ఎక్కడికి వెళ్లారని గుచ్చిగుచ్చి అడుగుతుంది జ్యోత్స్న. కావాల్సిన వారి ఇంట్లో పూజకు వెళ్లామని దశరథ్ చెబుతాడు. ఎవరు డాడీ అంటే.. కావాల్సిన వాళ్లంటే.. కావాల్సిన వాళ్లు.. చిన్నపిల్లవి అన్నీ నీకు చెప్పాలా అని కోప్పడుతుంది సుమిత్ర. ఆరా తీయొద్దంటూ అక్కడి నుంచి వెళుతుంది. అవసరానికి మించి మాట్లాడితే ఇలాగే ఉంటుందని జ్యోత్స్నకు గట్టిగా చెబుతాడు దశరథ్.

కావాల్సిన వాళ్లు అంటే.. ఎవరు దీపే కదా.. వీళ్లు ఆ హోమం దగ్గరికే వెళ్లి వస్తున్నారని తాత శివన్నారాయణతో జ్యోత్స్న అంటుంది. “అంటే నాకు ఇంకా అర్థం కావడం లేదని అనుకుంటున్నావా” అని శివన్నారాయణ అంటాడు. ఏమీ మాట్లాడలేదని జ్యోత్స్న అంటే.. మాట వినే స్థాయిని మనుషులు దాటిపోయినప్పుడు మాట్లాడే అవకాశం వచ్చే వరకు వేచిచూడడమే మేధావి చేయాల్సిన పని అని శివన్నారాయణ అంటాడు. వాళ్లింటికి వెళ్లారంటే.. మిమ్మల్ని అవమానించడమే కదండీ అంటూ రెచ్చగొట్టేందుకు పారిజాతం ప్రయత్నిస్తుంది. దీన్ని నువ్వు వదిలేయడమే మంచిది అని శివన్నారాయణ కోప్పడతాడు.

ఏంటి గ్రానీ ఇది.. నేను చూస్తున్నది తాతనేనా అని జ్యోత్స్న అవాక్కవుతుంది. నిజం తెలిస్తే.. చిందులేస్తాడని అనుకుంటే.. సైలెంట్‍గా లోపలికి వెళ్లాడేంటి అని ఆశ్చర్యపోతుంది. ఇది వింత అనేలా పారు మాట్లాడుతుంది. తాత కూడా మారిపోతాడా అని జ్యోత్స్న అంటుంది. అలాగే అనిపిస్తోందని పారు చెబుతుంది. తాత మారడు.. ఇప్పుడు మనం దీపకు సాయం చేసింది ఎవరో ఆలోచించాలని జ్యోత్స్న అంటుంది. ఈ సీక్రెట్ ప్రొటెక్టర్ ఎవరు అంటుంది.

 

కావేరి ఇంటికి కాంచన

డబ్బు ఎందుకు ఇచ్చావని కావేరిని శ్రీధర్ నిలదీస్తుంటాడు. అది నా డబ్బు, ఏమీ అడగకండని కావేరి వాదిస్తుంది. కాంచన నన్ను హీనంగా చూసిందని, కనీసం థ్యాంక్స్ అయినా చెప్పారా అని శ్రీధర్ అంటాడు. మనసులో తిట్టుకొని ఉంటుందని చెబుతుంది. కనీసం కావేరి అని పేరుతో అయినా కాంచన పిలిచిందా అని శ్రీధర్ అంటాడు. ఇంతలో దీపతో కలిసి కావేరి ఇంటికి వస్తుంది కాంచన. కావేరి అని కాంచన నోరారా పిలుస్తుంది. తన ఇంటికి కాంచన రావడంతో కావేరి సంతోషిస్తుంది.

రావొద్దన్న శ్రీధర్.. పట్టించుకోని కావేరి

ఇంట్లో రావొచ్చా అని కాంచన అడిగితే.. రావొద్దని శ్రీధర్ అంటాడు. రావొచ్చక్కా.. ఇది మన ఇళ్లు.. అనుమతి అవసరం లేదని కావేరి అంటుంది. ముందు ఎందుకు వచ్చిందో అడుగు అని శ్రీధర్ అంటాడు. ఒక్కప్పుడు వ్రతానికి పిలిచేందుకు వచ్చి.. గడప దాటనంటూ దానికే బొట్టు పెట్టిన అవమానించిన విషయాన్ని గుర్తు చేస్తాడు. ఈయనకు ఈ మధ్య మతి సరిగా పని చేయడం లేదని, అలా వాగుతూనే ఉంటారని కావేరి అంటుంది. నువ్వు రా అక్కా అని కాంచనను ఆప్యాయంగా పిలుస్తుంది కావేరి.

 

కావేరి చేయి పట్టుకొని థ్యాంక్స్ చెప్పిన కాంచన

దీంతో కావేరి ఇంట్లోకి కాంచన వస్తుంది. దీప కూర్చో అని కావేరి అంటే.. అంత మర్యాద అవసరం లేదంటూ శ్రీధర్. దీప నా కోడలు అని కావేరి చెబుతుంది. దీంతో శ్రీధర్ ఆశ్చర్యపోతాడు. కాఫీ తెస్తానని కావేరి అంటే.. ముందు అలా కూర్చో అని కాంచన అంటుంది. కావేరి చేతులు పట్టుకుంటుంది కాంచన. ఎంత అదృష్టమంటూ కావేరి ఎమోషనల్ అవుతుంది. “నా ఇంటికి రావడం ఏంటి.. నన్ను పిలువడం ఏంటి.. నా చేతులు పట్టుకోవడం ఏంటి” అని పొంగిపోతుంది. నాకు అర్థం కాక చూస్తున్నానని శ్రీధర్.. అంటే మీకు అన్నీ అర్థమవుతాయని కౌంటర్ ఇస్తుంది దీప.

అప్పుడే నీ మంచితనం అర్థమైంది

“చేయి పట్టుకొని రోడ్డు దాటించిన వారికి థ్యాంక్స్ చెబుతాం. దీవిస్తాం. నువ్వు నా మనవరాలిని పెద్ద గండం దాటించావ్. ఇప్పుడు నేను ఏమంటే నేను కృతజ్ఞత చెప్పుకున్నట్టు ఉంటుంది” అని కావేరిని కాంచన అడుగుతుంది. నువ్వు మాట్లాడడమే నాకు సంబరంగా ఉందక్కా అని కావేరి మురిసిపోతుంది. స్వప్నను నువ్వు కూతురుగా అనుకొని మంచి.. చెడు చూశావో.. అప్పుడే నీ మంచి తనం అర్థమైంది అక్కా.. నేను ఎంత పెద్ద తప్పు చేశానో తెలిసి వచ్చిందని కావేరి అంటుంది. సరిదిద్దుకునే అవకాశం కోసం ఇన్నాళ్లు ఎదురుచూశానని, నేను చేసిన పాపం ముందు చేసిన సాయం చాలా చిన్నదక్కా అని చెబుతుంది. దీంతో కార్తీక దీపం 2 నేటి (ఫిబ్రవరి 12) ఎపిసోడ్ ముగిసింది.

 
 
Whats_app_banner
 

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024