![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/BRAHMAMUDI_1739325412973_1739325416443.jpg)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497842_358_newTwitterIcon.png)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497843_996_facebook1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497844_122_wapp1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/BRAHMAMUDI_1739325412973_1739325416443.jpg)
Brahmamudi Today Episode: కావ్యను చూసి గర్వపడ్డ అపర్ణ -ధాన్యలక్ష్మి రూట్‌లోకి ప్రకాశం -కొత్త విలన్ ఎంట్రీ!
Brahmamudi: బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 12 ఎపిసోడ్‌లో గడువులోపు అప్పు చెల్లించకపోవడంతో ఆస్తులను జప్తు చేయడానికి దుగ్గిరాల ఇంటికొస్తారు బ్యాంకు అధికారులు. అప్పు చేసిన వంద కోట్లు ఏం చేశారో ఇప్పుడే చెప్పాలని రాజ్‌ను నిలదీస్తారు రుద్రాణి, ధాన్యలక్ష్మి. అసలు నిజం సుభాష్ బయటపెడతాడు.
Brahmamudi February 12th Episode: రాజ్, కావ్య వంద కోట్లు అప్పు చేశారని చెప్పి ఇద్దరిని దుగ్గిరాల కుటుంబసభ్యుల ముందు ఇరికిస్తుంది అనామిక. ఆమె మాటలు నిజమని నమ్మిన రుద్రాణి, ధాన్యలక్ష్మి రచ్చ చేస్తారు. ఆస్తుల్లో వాటాలు పంచకుండా అడ్డుకోవడానికే అప్పుల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని గొడవకు దిగుతారు.
![yearly horoscope entry point](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
డబ్బు మాత్రమే పనికొస్తుంది…
ధాన్యలక్ష్మి ఎంత చెప్పిన కళ్యాణ్ మాత్రం రాజ్, కావ్యలనే సమర్థిస్తాడు. ఆస్తిలో మన వాటా మనం తీసుకొని వెంటనే ఇక్కడి నుంచి బయటపడదామని కళ్యాణ్, ప్రకాశంలతో చెబుతుంది ధాన్యలక్ష్మి.
బంధాలు, బంధుత్వాలు మాట్లాడుకోవడానికే పనికొస్తాయని, జీవితంలో గెలవాలంటే డబ్బు మాత్రం పనికొస్తుందని అంటుంది. ఇన్ని రోజుల్లో అన్నయ్య దారిలో నడిచి తప్పు చేశాను, ఇప్పుడు నువ్వే అదే పని చేస్తున్నావు…అమ్మ చెప్పింది కూడా ఒక్కసారి ఆలోచించు అని కొడుకుతో అంటాడు ప్రకాశం.
రుద్రాణి ప్లాన్…
కావ్యను సపోర్ట్ చేస్తోన్న స్వప్నను తమ వైపుకు తిప్పుకోవాలని రుద్రాణి, రాహుల్ అనుకుంటారు. రాజ్, కావ్య చేసిన వంద కోట్ల అప్పు తీర్చడానికి మన దగ్గర ఉన్న ఆస్తులు సరిపోవని, తాతగారు నీకు ఇచ్చిన ఆస్తి కూడా అమ్మేయాల్సివస్తుందని స్వప్న మనసును డైవర్ట్ చేస్తారు.
అదే జరిగితే నీ కూతురు భవిష్యత్తు ఏమైపోతుందో ఆలోచించు అని ఆమెను భయపెడతారు. అప్పుల పేరుతో కావ్య ఆస్తులు అమ్మేస్తే …నువ్వు బయటకు వెళ్లి రెంట్ కట్టుకుంటూ ఉండాల్సిన పరిస్థితి వస్తుందని స్వప్న మనసులో కావ్య పట్ల ద్వేషాన్ని నింపుతారు. నువ్వు నమ్ముకున్న కావ్యనే.. నిన్ను, నీ బిడ్డను రోడ్డున పడేయటం ఖాయమని చెబుతారు.
నిజం చెప్పిన ఇందిరాదేవి…
హాస్పిటల్‌లో సీతారామయ్య కోలుకుంటాడు. ఇందిరాదేవి బాధపడుతూ కనిపించడంతో ఏమైందని భార్యను అడుగుతాడు. అసలు విషయం భర్త దగ్గర దాచే ప్రయత్నం చేస్తుంది. తాను చావును జయించి వచ్చిన వాడినని, తనకు ఏం కాదని సీతారామయ్య అంటాడు. ఇంట్లో జరుగుతోన్న గొడవల గురించి భర్తకు చెబుతుంది ఇందిరాదేవి.
రాజ్ వంద కోట్లు అప్పు చేసిన సంగతి భర్తకు వివరిస్తుంది. ఆస్తిలో వాటాల కోసం ఎదురుచూస్తున్న రుద్రాణి, ధాన్యలక్ష్మి…ఈ వంద కోట్లు అప్పును అడ్డం పెట్టుకొని ఎలాంటి గొడవలు చేస్తారో తెలియడం లేదని ఇందిరాదేవి భయపడుతుంది. రాజ్ వంద కోట్లు ఎందుకు అప్పు చేశాడో, ఆ డబ్బు ఏం చేశాడో అర్థం కావడం లేదని భర్తతో అంటుంది.
అప్పు తెలివితేటలు…
గుడిలో దొంగతనం చేశారనే ఆరోపణలతో ఇద్దరిని పోలీసులు ఇంటరాగేషన్ చేస్తుంటారు. ఎంత కొట్టిన నిజం చెప్పరు. డ్యూటీలో జాయిన్ అయిన అప్పు ఆ అనుమానితుల దగ్గరకు వస్తుంది. తన తెలివితేటలతో ఈజీగా దొంగను పట్టుకుంటుంది.
ఇల్లు జప్తు…
బ్యాంకు ఆఫీసర్లు దుగ్గిరాల ఇంటికొస్తారు. మీరు చెల్లిస్తానన్న వంద కోట్లు గడువు లోపు చెల్లించలేదని, అందుకే జప్తు నోటీసు ఇవ్వడానికి వచ్చామని బ్యాంకు అధికారులు చెబుతారు. మేము ఇప్పటికే 25 కోట్లు కట్టామని, మిగిలినవి చెల్లిస్తామని చెప్పిన రాజ్ చెప్పిన వాళ్లు వినరు. నోటీసులు ఇస్తారు.
అప్పుతో సంబంధం లేదు…
బ్యాంకు ఆఫీసర్ల మాటలు వినగానే రుద్రాణి, ధాన్యలక్ష్మి గొడవకు దిగుతారు. రాజ్, కావ్య వల్ల కట్టుబట్టలతో రోడ్డు మీద పడాల్సివస్తుందని అంటుంది. ఈ కుటుంబాన్ని నమ్ముకున్నందుకు తనకు ఏం మిగలలేదని రుద్రాణి అంటుంది. రాజ్, కావ్య చేసిన అప్పుతో మాకు ఎలాంటి సంబంధం లేదని బ్యాంకు అధికారులతో రుద్రాణి చెబుతుంది.
ఎక్కడ దాచారు…
ఆస్తి కావ్య పేరు మీద ఉందని, వంద కోట్ల అప్పు కడతానని కావ్యనే సంతకం చేసిందని బ్యాంకు ఆఫీసర్లు చెబుతారు. మీకు సంబంధం ఉందా? లేదా? అన్నది మాకు అనవసరం అని చెబుతారు. అసలు ఎందుకు మీరు వంద కోట్ల అప్పు చేశారో చెప్పాలని ధాన్యలక్ష్మి నిలదీస్తుంది. ఆ వంద కోట్ల డబ్బును ఎక్కడ దాచారు? కనకం, కృష్ణమూర్తి పేరిట ఎన్ని కోట్లు బ్యాంకులో డిపాజిట్ చేశారో అవన్నీ బయటకు తీయాలని అంటుంది రుద్రాణి.
నిజం బయటపెట్టిన సుభాష్…
తన కొడుకు, కోడలు ఒక్క రూపాయి కూడా బ్యాంకు నుంచి అప్పు తీసుకోలేదని అంటాడు సుభాష్. సీతారామయ్య వంద కోట్ల ష్యూరిటీ సంగతి బయటపెడతాడు. మీరు అనుకుంటున్నట్లు వారు డబ్బు కూడ బెట్టలేదు. బినామీ పేర్లతో ఆస్తులు దాచలేదని అంటాడు.
సీతారామయ్య ఇచ్చిన మాటను నిలబెట్టడం కోసం రాజ్, కావ్య పడిన కష్టాన్ని అందరికి వివరిస్తాడు సుభాష్. భర్త మాటలతో అపర్ణ గర్వపడుతుంది. వ్యక్తిత్వంలో రాజ్, కావ్య కాలిగోటికి కూడా ఎవరు సరితూగరని అంటుంది.
వాటా ఇచ్చిన తర్వాతే…
నాన్నకు తెలివిలేక వంద కోట్లకు ష్యూరిటీ పెట్టి మోసం చేస్తే…ఈ ఆదర్శ జంట కుటుంబాన్ని రోడ్డు పాలు చేసి పెద్దాయన మాట నిలబెట్టాలరి అనుకున్నారని అవమానిస్తూ మాట్లాడుతుంది రుద్రాణి. మాకు రావాల్సిన వాటా మాకు ఇచ్చి ఆస్తులు జప్తు చేసుకుంటారో, దానాలు చేస్తారో మీ ఇష్టం అని ధాన్యలక్ష్మి అంటుంది. ఆస్తులు లేకపోయినా తలో ఉద్యోగం చేసుకొని బతుకుదామని, కానీ నాన్న మాట నిలబడాల్సిందేనని సుభాష్ అంటాడు. అందుకు చచ్చిన ఒప్పుకోనని ధాన్యలక్ష్మి అంటుంది.
ప్లాన్ ప్రకారమే…
సీతారామయ్యను తీసుకొని ఇందిరాదేవి ఇంటికొస్తుంది. ఆస్తుల కోసం కుటుంబసభ్యులు మధ్య జరుగుతోన్న గొడవను చూసి బాధపడతారు.
నందగోపాల్ బతికే ఉన్న సంగతి బయటపడుతుంది. ఇదంతా ప్లాన్ ప్రకారమే తమను ఇరికించడానికి ఎవరో చేసిన కుట్ర అని రాజ్ అనుమానపడతాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం