![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/Chiranjeevi_Tongue_slip_1739328471274_1739328476973.jpg)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497842_358_newTwitterIcon.png)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497843_996_facebook1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497844_122_wapp1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/Chiranjeevi_Tongue_slip_1739328471274_1739328476973.jpg)
Chiranjeevi: నోరు జారిన చిరంజీవి.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
Chiranjeevi: బ్రహ్మా ఆనందం సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. బ్రహ్మానందంపై వచ్చిన మీమ్స్ గురించి మాట్లాడుతూ ఓ దశలో నోరు జారారు చిరూ. దీంతో ఆయనపై ట్రోలింగ్ జరుగుతోంది.
కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం ప్రధాన పాత్రలో ‘బ్రహ్మా ఆనందం’ సినిమా వస్తోంది. ఈ మూవీలో ఆయన కుమారుడు రాజా గౌతమ్ కూడా లీడ్ రోల్ చేస్తున్నారు. తండ్రీకొడుకులు ఈ మూవీలో తాతమనవళ్లుగా నటించారు. ఫిబ్రవరి 14వ తేదీన తేదీన థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. బ్రహ్మా ఆనందం మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు మెగాస్టార్ చిరంజీవి, దర్శకులు నాగ్‍అశ్విన్, అనిల్ రావిపూడి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
![yearly horoscope entry point](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
నోరు జారి బూతు మాట్లాడిన చిరంజీవి
ఈ ఈవెంట్‍లో మెగాస్టార్ చిరంజీవి హుషారుగా మాట్లాడారు. బ్రహ్మానందం గురించి గొప్పగా ప్రశంసించారు. అయితే, బ్రహ్మానందం మీమ్స్ గురించి సరదాగా మాట్లాడుతుండగా నోరు జారారు చిరంజీవి. రెడ్ ఫేస్.. ఎర్రముఖం పెడతాడు కదా ఎర్రి.. అంటూ ఓ బూతు మాట అన్నారు చిరంజీవి. దీంతో ఆ వెనుకాలే ఉన్న బ్రహ్మానందం, నాగ్‍అశ్విన్, రాజా గౌతమ్ ఆశ్చర్యపోయారు. అవాక్కై నోటిపై చేయి వేసుకున్నారు బ్రహ్మానందం.
చిరంజీవిపై ట్రోల్స్
బ్రహ్మానందం మీమ్స్ గురించి సరాదాగా మాట్లాడే క్రమంలో చిరూ నోటి నుంచి ఓ బూతుపదం దొర్లింది. అయితే, దీనిపై కొందరు నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి అంతటి వ్యక్తి వేదికపై అలాంటి పదం వాడడం ఏంటి అని కొందరు ట్రోల్ చేస్తున్నారు. బ్రహ్మానందం గురించి మాట్లాడుతూ అలాంటి పదం సరికాదని అంటున్నారు. ఎప్పుడూ ఎంతో ఉన్నతంగా మాట్లాడే చిరూ.. ఇలా నోరుజారడం ఆశ్చర్యంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా దీనివల్ల చిరూ కూడా ట్రోలింగ్‍కు గురవుతున్నారు. అయితే, సరదాగా మాట్లాడే క్రమంలో ఒక్కోసారి ఇలా జరుగుతుందని కొందరు సపోర్ట్ చేస్తున్నారు.
డౌట్లు వద్దు.. రాజకీయాలకు దూరమే
తాను జీవితాంతం రాజకీయాలకు దూరంగానే ఉంటానని ఈ ఈవెంట్‍లో చిరంజీవి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి డౌట్లు లేవని అన్నారు. రాజకీయాలకు దూరంగా.. సినిమాలకు దగ్గరగానే ఉంటానని చెప్పారు. “పెద్ద వాళ్లకు దగ్గర అవుతున్నారని కొందరికి డౌట్లు ఉన్నాయి. మరో రకంగా సేవలు అందించడం కోసం చేస్తున్నానే తప్ప.. పొలిటికల్‍గా వెళ్లడం లేదు. అలాంటి డౌట్లు పెట్టుకోవద్దు” అని చిరంజీవి అన్నారు.
తన రాజకీయ లక్ష్యాలను నెరవేర్చేందుకు తన తమ్ముడు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉన్నారని చిరంజీవి చెప్పారు. “నేను అనుకున్న లక్ష్యాన్ని, సేవాభావాలను చేయడం కోసం పవన్ కల్యాణ్ ఉన్నాడు. ముందుకు వెళుతున్నాడు” అని చిరంజీవి చెప్పారు.
బ్రహ్మా ఆనందం సినిమాకు ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో బ్రహ్మానందం, రాజా గౌతమ్‍తో పాటు వెన్నెల కిశోర్, ప్రియ వడ్లమణి, ఐశ్వర్య హోలక్కల్, రాజీవ్ కనకాల, సంపత్ రాజ్ కీలకపాత్రలు పోషించారు.
సంబంధిత కథనం