Raghavendra Rao Son: డైరెక్ట‌ర్ కే రాఘ‌వేంద్ర‌రావు కొడుకు హీరోగా న‌టించిన సినిమాలు ఇవే – అన్ని డిజాస్ట‌ర్లే!

Best Web Hosting Provider In India 2024

Raghavendra Rao Son: డైరెక్ట‌ర్ కే రాఘ‌వేంద్ర‌రావు కొడుకు హీరోగా న‌టించిన సినిమాలు ఇవే – అన్ని డిజాస్ట‌ర్లే!

Nelki Naresh HT Telugu
Feb 12, 2025 10:04 AM IST

Raghavendra Rao Son: దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు కే రాఘ‌వేంద్ర‌రావు త‌న‌యుడు ప్ర‌కాష్ హీరోగా, డైరెక్ట‌ర్‌గా తెలుగులో కొన్ని సినిమాలు చేశాడు. నీతో మూవీతో ప్ర‌కాష్ కోవెల‌మూడి టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తెలుగులో డిజాస్ట‌ర్ అయిన ఈ మూవీని త‌మిళంలో ద‌ళ‌ప‌తి విజ‌య్ స‌చిన్ పేరుతో రీమేక్ చేయ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌కాష్ కోవెల‌మూడి
ప్ర‌కాష్ కోవెల‌మూడి

టాలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కుల్లో ఒక‌రిగా పేరు తెచ్చుకున్నాడు కే రాఘ‌వేంద్ర‌రావు. ఎన్టీఆర్, కృష్ణ వంటి అల‌నాటి స్టార్లు మొద‌లుకొని… చిరంజీవి, వెంక‌టేష్, నాగార్జున నుంచి నేటి త‌ర‌ హీరోలు మ‌హేష్‌బాబు, అల్లు అర్జున్ వ‌ర‌కు మూడు త‌రాల హీరోల‌తో ఎన్నో విజ‌య‌వంత‌మైన సినిమాలు చేశారు. ఫాంట‌సీ, రొమాన్స్‌, డివోష‌న‌ల్ ఇలా..ఆయ‌న ట‌చ్ చేయ‌ని జాన‌ర్ లేదు.

yearly horoscope entry point

ప్ర‌కాష్ కోవెల‌మూడి…

రాఘ‌వేంద్ర‌రావు వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తూ ఆయ‌న త‌న‌యుడు ప్ర‌కాష్ కోవెల‌మూడి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. హీరోగానే కాకుండా ద‌ర్శ‌కుడిగా సినిమాలు చేశాడు. కానీ అవేవి ఆయ‌న‌కు విజ‌యాల‌ను తెచ్చిపెట్ట‌లేక‌పోయాయి. కొన్నాళ్లుగా సినిమాల‌కు దూరంగా ఉంటోన్నాడు.

నీతో మూవీ…

నీతో మూవీతో ప్ర‌కాష్ కోవెల‌మూడి హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.ఈ సినిమాకు జాన్ మ‌హేంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది. నీతో మూవీని స‌చిన్ పేరుతో ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌మిళంలోకి రీమేక్ చేశాడు. తెలుగులో డిజాస్ట‌ర్ అయిన ఈ మూవీ త‌మిళంలో మాత్రం 200 రోజుల‌కుపైగా ఆడింది. ద‌ళ‌ప‌తి విజ‌య్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒక‌టిగా నిలిచింది.

మార్నింగ్ రాగా…

ఆ త‌ర్వాత యాక్టింగ్ కెరీర్‌కు రెండేళ్లు గ్యాప్ ఇచ్చిన ప్ర‌కాష్ మార్నింగ్ రాగా పేరుతో మ‌రో మ్యూజిక‌ల్‌ డ్రామా మూవీ చేశాడు. ఇంగ్లీష్‌, తెలుగు భాష‌ల్లో రిలీజైన ఈ మూవీ కూడా క‌మ‌ర్షియ‌ల్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. రాఘ‌వేంద్ర‌రావు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు.

నేష‌న‌ల్ అవార్డులు…

మార్నింగ్ రాగా త‌ర్వాత యాక్టింగ్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన ప్ర‌కాష్ కోవెల‌మూడి బొమ్మ‌లాట్టం అనే చిల్డ్ర‌న్ మూవీతో డైరెక్ట‌ర్‌గా మారాడు. ఈ మూవీ రెండు నేష‌న‌ల్ అవార్డుల‌ను అందుకున్న‌ది.

అన‌గ‌న‌గా ఓ ధీరుడు…

బొమ్మ‌లాట్టం త‌ర్వాత సిద్ధార్థ్‌, శృతిహాస‌న్ హీరోహీరోయిన్లుగా అన‌గ‌న‌గా ఒక ధీరుడు పేరుతో క‌మ‌ర్షియ‌ల్ మూవీ చేశాడు. వాల్ట్ డిస్నీ స‌హ‌కారంతో నిర్మించిన ఈ మూవీ తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది. అనుష్క హీరోయిన్‌గా ప్ర‌యోగాత్మ‌క క‌థాంశంతో ప్ర‌కాష్ కోవెల‌మూడి చేసిన సైజ్ జీరో మూవీ కూడా డిజాస్ట‌ర్‌గానే నిలిచింది. కంగ‌నా ర‌నౌత్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన జ‌డ్జిమెంట్ హై క్యాతో డైరెక్ట‌ర్‌గా బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేశాడు. కంగ‌నా యాక్టింగ్‌తో పాటు ప్ర‌కాష్ డైరెక్ష‌న్‌కు మంచి పేరొచ్చిన క‌మ‌ర్షియ‌ల్‌గా మాత్రం సినిమా స‌రిగ్గా ఆడ‌లేదు.

బాలీవుడ్ స్క్రీన్ రైట‌ర్‌…

ప్ర‌కాష్ కోవెల‌మూడి బాలీవుడ్ స్క్రీన్‌రైట‌ర్ క‌నికా థిల్లాన్‌ను 2014లో పెళ్లిచేసుకున్నాడు. మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా మూడేళ్ల‌కే ఈ జంట విడాకులు తీసుకున్నారు. ఎక్ విల‌న్ రిట‌ర్న్స్‌, డంకీతో పాటు ప‌లు బాలీవుడ్ సినిమాల‌కు స్టోరీ, స్క్రీన్‌ప్లే రైట‌ర్‌గా క‌నికా థిల్లాన్ ప‌నిచేసింది.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024