Mirror: పదే పదే అద్దంలో ముఖం చూసుకునే అలవాటు ఉందా? అయితే ఇది ఆ వ్యాధి లక్షణమే కావచ్చు

Best Web Hosting Provider In India 2024

Mirror: పదే పదే అద్దంలో ముఖం చూసుకునే అలవాటు ఉందా? అయితే ఇది ఆ వ్యాధి లక్షణమే కావచ్చు

Haritha Chappa HT Telugu
Feb 12, 2025 10:39 AM IST

Mirror: కొంతమంది ఉదయం నుంచి రాత్రి వరకు పదే పదే తమ ముఖాన్ని అద్దంలో చూసుకుంటూ ఉంటారు. ఇది సాధారణమైన విషయం మాత్రం కాదు. ఒక వ్యాధి లక్షణంగా దీన్ని చెప్పుకుంటారు. ఆ వ్యాధి గురించి తెలుసుకుందాం.

ముఖాన్ని అద్దంలో చూసుకోవడం మంచిది కాదా
ముఖాన్ని అద్దంలో చూసుకోవడం మంచిది కాదా (Pixabay)

అందంపై అందరికీ దృష్టి ఉంటుంది. రోజులో మూడు నాలుగు సార్లు అద్దంలో చూసుకునేవారు ఉన్నారు. కానీ కొంతమంది రోజులో చాలాసార్లు అద్దంలో చూసుకుంటూనే ఉంటారు. ప్రతి గంటకి అద్దంలో చూసుకుని మురిసిపోతూ ఉంటారు. తమ ముఖం ఎలా ఉందో అని చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇది సాధారణ అలవాటుగా భావిస్తారు.. కానీ నిజానికి ఇది ఒక అసాధారణ ప్రవర్తనగానే చెప్పుకోవచ్చు.

yearly horoscope entry point

ఏమిటీ రోగం?

ఇలా పదేపదే అర్థం చూసుకోవడం అనేది మీ ప్రవర్తనలో వచ్చిన పెద్ద మార్పు. దీన్ని శరీర డిస్ఫోర్మిక్ డిజార్డర్ కు సంబంధించినదిగా చెప్పుకుంటారు. ఇది ఒక రకమైన మానసిక ఆరోగ్య సమస్య. అద్దంలో చూసుకోవడం ద్వారా మీ లోపాలను కనిపెట్టాలని అనుకుంటారు. మీరు ఎలా ఉన్నారో పదేపదే చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇది ఒక రకమైన మానసిక రుగ్మతగా కూడా చెప్పుకోవాలి.

అద్దంలో పదేపదే చూసుకోవడం అనేది ఖచ్చితంగా ఒక రుగ్మతకు సంబంధించినదేనని వైద్యులు కూడా చెబుతున్నారు. అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలోని సైకాలజీ విభాగాధిపతి మాట్లాడుతూ ఇది మెదడుకు సంబంధించిన మానసిక అనారోగ్యం కావచ్చు అని చెప్పారు. ఈ వ్యాధిని ‘ఓసిడి స్పెక్ట్రమ్ డిసార్డర్’ అని పిలుస్తారని చెప్పారు. కొంతమంది పదే పదే ముఖాన్ని అద్దంలో చూసుకుంటూ, అక్కడున్న చర్మాన్ని లాగడం వంటివి చేస్తూ ఉంటారు. మరికొందరు జుట్టును పదేపదే రుద్దడం, గోకడం వంటివి చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆ రుగ్మత లక్షణాలు గానే భావించాలి.

అద్దంలో చూడడం వల్ల నష్టాలు

పదే పదే అద్దంలో చూసుకోవడం వల్ల ఎన్నో చెడు ప్రభావాలు ఉన్నాయి. అద్దంలో మిమ్మల్ని మీరు తరచుగా చూసుకోవడం వల్ల మీలో ప్రతికూల ఆలోచనలు పుట్టడం ప్రారంభమవుతాయి. ఇది మానసిక అనారోగ్యంగా మారిపోతుంది. అలా అద్దంలో చూసుకునే వ్యక్తులు సమాజం నుండి దూరంగా మారుతారు. ఒంటరిగా మిగిలిపోతారు. స్కూళ్లకు కూడా తక్కువగా వెళ్లాలనిపిస్తుంది. పార్టీలు, వేడుకల్లో పాల్గొనాలని అనిపించదు. క్రమంగా వారు కుటుంబానికి, స్నేహితులకు దూరం అవుతూ ఉంటారు. తమలో ఎన్నో శారీరక లోపాలు ఉన్నాయని బాధపడుతూ ఉంటారు. ఇది ఇలాగే వదిలేస్తే తీవ్రమైన రుగ్మతగా మారిపోతుంది. తమ ముఖంలో ఎలాంటి లోపాలు లేకపోయినా ఏదో ఒక ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునేందుకు సిద్ధమైపోతారు.

అధికారిక లెక్కల ప్రకారం భారతదేశంలో ప్రతి ఏడాది 10 లక్షల మంది ఈ ఆదివారం పడుతున్నట్టు లెక్క. కాబట్టి మీకు కూడా ఇలాంటి అలవాటు ఉంటే వెంటనే వదిలేయండి. లేదా ఒక మానసిక వైద్య నిపుణుడిని కలిసి మీ గురించి చెప్పండి. అంతేకానీ అద్దంలో చూసుకోవడం అనేది ఒక సాధారణ లక్షణంగా భావించి అదే పనిని కంటిన్యూ చేస్తే భవిష్యత్తులో మీరు తీవ్ర మానసిక రోగిగా మారిపోవచ్చు. అద్దంలో రోజులో మూడు నుంచి నాలుగు సార్లు మాత్రమే ఒక సాధారణ వ్యక్తి చూస్తాడు. అంతకుమించి ఎక్కువగా చూస్తున్నారంటే ఏదో ఒక మానసిక రోగం దాగి ఉందని అర్థం చేసుకోవాలి.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024