Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/Thandel_Day_5_1739336963490_1739336971651.jpg)
Thandel Box office: బాక్సాఫీస్ వద్ద స్టడీగా తండేల్.. వీక్‍డేస్‍లోనూ జోష్ చూపిస్తున్న చైతూ, సాయిపల్లవి మూవీ
తండేల్ చిత్రం అంచనాలను అందుకొని బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. సూపర్ ఓపెనింగ్ అందుకున్న ఈ చిత్రం.. వీక్‍డేస్‍లోనూ పట్టు నిలుపుకుంది. స్టడీగా కలెక్షన్లను రాబడుతోంది. నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం గత వారం ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజైంది. రియల్ స్టోరీ స్ఫూర్తిగా డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహించిన తండేల్ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది.
వీక్‍డేస్‍లోనూ మంచి వసూళ్లు
తండేల్ చిత్రం ఫస్ట్ వీకెండ్ దుమ్మురేపింది. భారీ కలెక్షన్లు సాధించింది. అయితే, వీకెండ్ తర్వాత కూడా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద స్టడీగా నిలిచింది. తండేల్ చిత్రం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.73.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిందని మూవీ టీమ్ వెల్లడించింది. ఐదో రోజైన మంగళవారం కూడా ఈ చిత్రానికి కలెక్షన్లు నిలకడగా వచ్చాయని తెలుస్తోంది.
తండేల్ మూవీకి ఐదో రోజు రూ.7కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయని అంచనా. అంటే ఈ చిత్రం ఐదు రోజుల్లో రూ.80కోట్ల మార్క్ క్రాస్ చేసినట్టే. సోమవారంతో పోలిస్తే.. మంగళవారం కూడా వసూళ్లు స్టడీగా ఉన్నట్టు అర్థమవుతోంది. ఈ చిత్రం మంచి ఆక్యుపెన్సీ సాధిస్తోంది.
ఈవారంలోనే రూ.100కోట్లు!
తండేల్ చిత్రం మరో మూడు, నాలుగు రోజుల్లో రూ.100కోట్ల మార్క్ దాటుతుందని నిర్మాత బన్నీ వాసు.. ఇటీవల సక్సెస్ ఈవెంట్‍లో చెప్పారు. ఇదే జరిగితే.. నాగచైతన్యకు ఇదే తొలి రూ.100కోట్ల మూవీ అవుతుంది. ప్రస్తుతం కలెక్షన్ల తీరు చూస్తే ఈవారంలో తండేల్ ఆ మార్క్ దాడడం పెద్ద కష్టంగా కనిపించడం లేదు. మరో రెండు రోజులు థియేటర్లలో ఈ మూవీకి పెద్దగా పోటీ లేదు. ఫిబ్రవరి 14న లైలా, బ్రహ్మా ఆనందం వచ్చినా తండేల్‍కు మంచి రన్ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ మూవీకి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఆదరణ ఎక్కువగా కనిపిస్తోంది.
తండేల్ మూవీ సక్సెస్ ఈవెంట్ మంగళవారం (ఫిబ్రవరి 11) జరిగింది. ఈ ఈవెంట్‍కు కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తన కొడుకు చైతూకు బిగ్ సక్సెస్ వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు. తన భార్య, నటి శోభితా ధూళిపాళ్లతో కలిసి ఈవెంట్‍కు వచ్చారు నాగచైతన్య. అతడితో ఓ హిస్టారికల్ చిత్రం చేస్తానని డైరెక్టర్ చందూ మొండేటి ప్రకటించారు.
తండేల్ చిత్రంలో నాగచైతన్య, సాయి పల్లవి నటనకు ప్రశంసలు భారీగా వస్తున్నాయి. పాకిస్థాన్ జైలులో కొన్ని నెలలు ఉన్న శ్రీకాకుళం మత్య్సకారుల నిజజీవిత ఘటనలను స్ఫూర్తిగా తీసుకొని ఎమోషనల్ లవ్ మూవీగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ చందూ రూపొందించారు. ఈ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
తండేల్ సినిమాలో చైతూ, పల్లవితో పాటు ఆడుకాలం నరేన్, ప్రకాశ్ బెలవాది, కరుణాకరన్, చరణ్‍దీప్, బబ్లూ పృథ్విరాజ్, కల్పలత కీరోల్స్ చేశారు. ఈ మూవీని గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు ప్రొడ్యూజ్ చేయగా.. అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ముందు నుంచి ఈ చిత్రం విజయంపై మేకర్స్ పూర్తి నమ్మకంతో ఉండగా.. అదే జరిగింది.
సంబంధిత కథనం
టాపిక్