Malayalam OTT:ఓటీటీలోకి అల వైకుంఠ‌పుర‌ములో విల‌న్‌ మ‌ల‌యాళం బోల్డ్ మూవీ – ఐఎమ్‌డీబీలో 9.1 రేటింగ్

Best Web Hosting Provider In India 2024

Malayalam OTT:ఓటీటీలోకి అల వైకుంఠ‌పుర‌ములో విల‌న్‌ మ‌ల‌యాళం బోల్డ్ మూవీ – ఐఎమ్‌డీబీలో 9.1 రేటింగ్

Nelki Naresh HT Telugu
Feb 12, 2025 11:15 AM IST

Malayalam OTT: అల వైకుంఠ‌పుర‌ములో ఫేమ్ గోవింద్ ప‌ద్మ‌సూర్య హీరోగా న‌టించిన మ‌ల‌యాళం మూవీ మ‌నోరాజ్యం ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ఈ రొమాంటిక్ డ్రామా మూవీ ఫిబ్ర‌వ‌రి 14 నుంచి మ‌నోర‌మా మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఐఎమ్‌డీబీలో ఈ మూవీ 9.1 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది.

మ‌ల‌యాళం  ఓటీటీ
మ‌ల‌యాళం ఓటీటీ

మ‌ల‌యాళం రొమాంటిక్ డ్రామా మూవీ మ‌నోరాజ్యం థియేట‌ర్ల‌లో రిలీజైన ఏడు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌స్తోంది. వాలెంటైన్స్ డే కానుక‌గా మ‌నోర‌మా మ్యాక్స్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. మ‌నోరాజ్యం మూవీలో అల వైకుంఠ‌పుర‌ములో ఫేమ్‌ గోవింద్ ప‌ద్మ‌సూర్య‌, ర‌జిత మీన‌న్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. న‌వాస్‌, గోకుల‌న్‌, య‌శ్వి కీల‌క పాత్ర‌లు పోషించారు. ర‌షీద్ ప‌రాక్కాల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

yearly horoscope entry point

9.1 రేటింగ్‌…

గ‌త ఏడాది ఆగ‌స్ట్‌లో థియేట‌ర్ల‌లో మ‌నోరాజ్యం మూవీ రిలీజైంది. పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. ఐఎమ్‌డీబీలో ఈ మూవీ 9.1 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది. కాన్సెప్ట్‌, ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్‌తో పాటు హీరోహీరోయిన్ల యాక్టింగ్ బాగుంద‌నే ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. భార్యాభ‌ర్త‌ల బంధాన్ని రొమాంటిక్‌, బోల్డ్ అంశాల‌తో మోడ్ర‌న్ స్టైల్‌లో డైరెక్ట‌ర్ ఈ మూవీలో చూపించాడు.

మ‌నోరాజ్యం…

మ‌నోరాజ్యం మూవీ ఆస్ట్రేలియ‌న్ బ్యాక్‌డ్రాప్‌లోనే సాగుతుంది. ఈ సినిమానుమెల్‌బోర్న్‌తో పాటు ఆస్ట్రేలియాలోని ప‌లు లొకేష‌న్స్‌లో షూట్ చేశారు. ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్‌లో ఈ మూవీ స్క్రీనింగ్‌కు ఎంపికైంది.

మ‌నోరాజ్యం క‌థ ఇదే…

మ‌ను ఓ బిజినెస్‌మెన్‌, ఆస్ట్రేలియాలో సెటిల్ అవుతాడు. సంస్కృతి, సంప్ర‌దాయాల‌కు విలువ‌నిచ్చే మ‌ల‌యాళీ అమ్మాయిని పెళ్లిచేసుకుంటాడు. త‌న స్నేహితుడికి జ‌రిగిన అన్యాయం కార‌ణంగా మ‌ను త‌న భార్య‌పై అనుమానం పెంచుకుంటాడు. అప‌రిచిత వ్య‌క్తి పేరుతో భార్య‌తో చాటింగ్ చేస్తాడు? ఆ త‌ర్వాత ఏమైంది? మ‌ను త‌న‌ను అనుమానిస్తోన్న విష‌యం అత‌డి భార్య‌కు ఎలా తెలిసింది? జంట మ‌ధ్య అపోహ‌లు, అపార్థాలు ఎలాంటి గొడ‌వ‌ల‌కు దారితీశాయి? మ‌నుకు ద‌గ్గ‌రైన మ‌రో అమ్మాయి ఎవ‌రు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

టాప్ యాంక‌ర్‌గా…

టీవీ హోస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించాడు గోవింద్ ప‌ద్మ‌సూర్య‌. మ‌ల‌యాళం టాప్ యాంక‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు. టీవీ షోస్ ద్వారా వ‌చ్చిన గుర్తింపుతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రేతం, కాలేజీ డేస్‌, వ‌ర్ష‌తో పాటు ప‌లు మ‌ల‌యాళ సినిమాల్లో హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా క‌నిపించాడు.

అల వైకుంఠ‌పుర‌ములో…

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన అల వైకుంఠ‌పుర‌ములో మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు గోవింద్ ప‌ద్మ‌సూర్య‌. ఈ సినిమాలో స‌ముద్ర‌ఖ‌ని కొడుకుగా నెగెటివ్ షేడ్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించాడు. అల వైకుంఠ‌పుర‌ములో త‌ర్వాత తెలుగులో బంగార్రాజు, లైక్ ఆండ్ షేర్ స‌బ్‌స్క్రైబ్ సినిమాల్లో విల‌న్‌గా న‌టించాడు గోవింద్ ప‌ద్మ‌సూర్య‌.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024