Best Web Hosting Provider In India 2024
Srikakulam Crime : శ్రీకాకుళం జిల్లాలో ఘోరం – ఐదో తరగతి బాలికపై అత్యాచారం..!
శ్రీకాకుళం జిల్లాలో ఘోరం వెలుగు చూసింది. ఐదో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారం జరిగింది. ఆడుకుంటున్న బాలికకు వేరుశెనగ చెక్కి ఇచ్చిన నిందితుడు… ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాలిక విషయం చెప్పటంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో కేసు నమోదు కాగా.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. ఐదో తరగతి చదువుతున్న బాలికపై ఒక వ్యక్తి అత్యాచారం చేశాడు. ఆడుకుంటున్న బాలికకు వేరుశెనగ చెక్కి ఇచ్చి ఈ దారుణానికి ఒడిగట్టాడు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
వేరుశెనగ చెక్కిలు ఇచ్చి….!
ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలోని ఒక గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సారవకోట మండలంలోని ఒక గ్రామంలో రామారావు అనే వ్యక్తి (47) కుటుంబం జీవిస్తోంది. ఆయనకు భార్య, వివాహితులైన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం అదే గ్రామంలో చింత చెట్టు కింద ఇద్దరు బాలికలు ఆడుకుంటున్నారు. అటుగా వెళ్లి ఆడుకుంటున్న బాలికలను రామారావు పిలిచాడు. అందులో ఒక బాలికకు రెండు వేరుశెనగ చెక్కిలు ఇచ్చి ఇంటికి వెళ్లిపోమన్నాడు.
ఇంట్లోకి తీసుకెళ్లి…..
అయితే ఆ బాలిక వెళ్లకుండా… అక్కడే ఉండిపోయింది. దీన్ని గమనించిన అతగాడు ఆమెను కొట్టి పంపించే ప్రయత్నం చేశాడు. దీంతో ఆ బాలిక ఏడ్చుకుంటూ వెళ్లిపోయింది. మరొ బాలికకు రెండు వేరుశెనగ చెక్కిలు ఇచ్చి సమీపంలో ఉన్న తన ఇంటికి తీసుకెళ్లాడు. బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి తలుపులు వేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో పాటు బిగ్గరగా ఏడ్చింది. దీంతో తలుపులు తీసి ఆ బాలికను బయటకు పంపించేశాడు.
తీవ్రమైన నొప్పితో ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిన బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు నిందితుడి ఇంటికి వెళ్లి… అతడికి దేహశుద్ది చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షలకు శ్రీకాకుళం తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై డీఎస్పీ డి.ప్రసాదరావు స్పందిస్తూ… సోమవారం సాయంత్రం తమకు ఫిర్యాదు వచ్చిందని తెలిపారు. మంగళవారం పోక్సో కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని వివరించారు. విచారణ జరుగుతోందని, విచారణ పూర్తి అయిన తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం
టాపిక్