Hyderabad To Bangalore : 2 గంటల్లో హైదరాబాద్ టూ బెంగళూరు.. హైస్పీడ్ రైలు కారిడార్‌‌కు ప్లానింగ్.. చెన్నైకి కూడా!

Best Web Hosting Provider In India 2024


Hyderabad To Bangalore : 2 గంటల్లో హైదరాబాద్ టూ బెంగళూరు.. హైస్పీడ్ రైలు కారిడార్‌‌కు ప్లానింగ్.. చెన్నైకి కూడా!

Anand Sai HT Telugu
Feb 12, 2025 12:15 PM IST

Hyderabad To Bangalore : రైలు ప్రయాణికులకు శుభవార్త. హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్లు నిర్మించాలని రైల్వే శాఖ అనుకుంటోంది. దీంతో ఈ రెండు నగరాలకు వెళ్లేందుకు ప్రయాణ సమయం తగ్గనుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

భారతదేశంలో రైల్వే ప్రయాణికులే అధికం. అయితే కొన్ని నగరాలకు వెళ్లేందుకు ఇప్పటికే బుల్లెట్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. వీటితో చాలా వరకు ప్రయాణికుల సమయం ఆదా అవుతుంది. హైస్పీడ్ కారిడార్లలో భాగంగా బుల్లెట్ రైళ్లు చాలా వరకు ఉపయోగకరంగా ఉన్నాయి. ఇప్పుడు రైల్వే శాఖ హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై నగరాలకు హైస్పీడ్ రైలు కారిడార్ నిర్మించాలని అనుకుంటోంది. దీంతో చాలా మందికి ప్రయోజనం చేకూరనుంది.

yearly horoscope entry point

తక్కువ సమయంలోనే

ప్రస్తుతం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి విమాన ప్రయాణానికి ఒక గంట 15 నిమిషాలు పడుతుంది. హైదరాబాద్ నుంచి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి ఒక గంట 20 నిమిషాలు పడుతుంది. విమానాశ్రయం నుండి నగరంలోని వివిధ ప్రదేశాలకు చేరుకోవడానికి సుమారు 2-3 గంటలకు పెరుగుతుంది. అయితే ఈ సమయంలో హైదరాబాద్ నుంచి హై-స్పీడ్ రైళ్లతో బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వెళ్ళవచ్చు.

రెండు నగరాలకు

హైదరాబాద్-చెన్నై మార్గంలో హై-స్పీడ్ రైలు కారిడార్ 705 కి.మీ.లకు ప్రతిపాదించగా, హైదరాబాద్-బెంగళూరు మార్గం 626 కి.మీ.లుగా ఉంటుంది. రెండు హై-స్పీడ్ ఎలివేటెడ్ కారిడార్‌ల కోసం డీపీఆర్, అలైన్‌మెంట్ డిజైన్, అంచనా, ఇంజనీరింగ్ సర్టిఫికేట్స్ తయారీతో కూడిన తుది సర్వేను నిర్వహించడానికి ప్రభుత్వ రంగ సంస్థ, ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ కార్పొరేషన్ అయిన RITES లిమిటెడ్ టెండర్లను ఆహ్వానించింది.

బుల్లెట్ రైలు

‘ఈ ప్రాజెక్టు సర్వే, అంచనాకు రూ. 33 కోట్లు అవసరం అవుతుంది. రాబోయే రైలు మార్గాలు ప్రత్యేకంగా హై స్పీడ్ రైళ్లకు సేవలు అందిస్తాయి. ఇవి సాంప్రదాయ రైలు ట్రాక్‌ల నుండి భిన్నంగా ఉంటాయి. ఈ డిజైన్ ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ కారిడార్ నమూనాను అనుసరిస్తుంది. దీనిని బుల్లెట్ రైలు కార్యకలాపాల కోసం అభివృద్ధి చేస్తున్నారు.’ అని దక్షిణ మధ్య రైల్వే సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.

టెండర్‌ నోటీస్

టెండర్ నోటీసు ప్రకారం.. రెండు రైలు కారిడార్లలో రిమోట్ సెన్సింగ్ అధ్యయనాలు, జియోలాజికల్ మ్యాపింగ్, ప్రధాన వంతెనల డ్రిల్లింగ్, వయాడక్ట్, మట్టి, రాతి నమూనాలపై ప్రయోగశాల పరీక్షలను చేపట్టాల్సి ఉంటుంది. 350 కి.మీ. వేగంతో ప్రయాణించేలా రూపొందించబడినప్పటికీ, గంటకు 320 కి.మీ. వేగంతో పనిచేస్తాయని టెండర్‌లో పేర్కొన్నారు. ఈ అధ్యయనం ట్రాఫిక్ అధ్యయనాలు, బ్రిడ్జింగ్, టన్నెలింగ్, భవనం, ఇతర నిర్మాణాలతో సహా సివిల్ ఇంజనీరింగ్ అధ్యయనాలులాంటివాటిని కవర్ చేస్తుందని టెండర్ నోటీసులో పేర్కొన్నారు.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link