Evergreen Telugu Romantic Movies on OTT: ఓటీటీలో ఉన్న ఎవర్‌గ్రీన్ తెలుగు రొమాంటిక్ మూవీస్ ఇవే.. మీ వాలెంటైన్‌తో చూడండి

Best Web Hosting Provider In India 2024

Evergreen Telugu Romantic Movies on OTT: ఓటీటీలో ఉన్న ఎవర్‌గ్రీన్ తెలుగు రొమాంటిక్ మూవీస్ ఇవే.. మీ వాలెంటైన్‌తో చూడండి

Hari Prasad S HT Telugu
Feb 12, 2025 12:48 PM IST

Evergreen Telugu Romantic Movies on OTT: వాలెంటైన్స్ డే వచ్చేస్తోంది. ఓటీటీలో ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీలు మిమ్మల్ని అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి తెలుగులో ఏ ఓటీటీలో ఏ సినిమా ఉందో చూసేయండి.

ఓటీటీలో ఉన్న ఎవర్‌గ్రీన్ తెలుగు రొమాంటిక్ మూవీస్ ఇవే.. మీ వాలెంటైన్‌తో చూడండి
ఓటీటీలో ఉన్న ఎవర్‌గ్రీన్ తెలుగు రొమాంటిక్ మూవీస్ ఇవే.. మీ వాలెంటైన్‌తో చూడండి

Evergreen Telugu Romantic Movies on OTT: క్లాసిక్, ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీస్ ఉన్న తెలుగు సినిమాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం ఇవి నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్, యూట్యూబ్, జీ5, ఆహా వీడియోలాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో అందుబాటులో ఉన్నాయి. మీ వాలెంటైన్ తో కలిసి ఈ శుక్రవారం (ఫిబ్రవరి 14) వచ్చే వాలెంటైన్స్ డేనాడు చూడాల్సిన ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీస్ ఏంటో చూసేయండి.

yearly horoscope entry point

ఓటీటీలోని ఎవర్‌గ్రీన్ తెలుగు లవ్ స్టోరీ మూవీస్

వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఉన్న ఎవర్ గ్రీన్ తెలుగు లవ్ స్టోరీ మూవీస్ ఇవే.

గీతాంజలి – ప్రైమ్ వీడియో

36 ఏళ్ల కిందట వచ్చినా ఇప్పటికీ, ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల మనసులకు దగ్గరగా ఉండే మూవీ గీతాంజలి. నాగార్జున, గిరిజ నటించిన ఈ మూవీని మణిరత్నం డైరెక్ట్ చేయగా.. ఇళయరాజా అందించిన మ్యూజిక్ మరో హైలైట్. ఈ సినిమాను ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.

రోజా – నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్

మణిరత్నం డైరెక్ట్ చేసిన ఈ రోజా మూవీ తమిళంలో నిర్మితమైనా తెలుగులోనూ ఓ ఎవర్‌గ్రీన్ లవ్ స్టోరీగా చెప్పొచ్చు. ఇద్దరు ప్రేమికుల మధ్య కాకుండా ఇద్దరు భార్యాభర్తల మధ్య ఉన్న అసలైన ప్రేమకు ఈ సినిమా అద్దం పట్టింది. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ లలోనూ అందుబాటులో ఉంది.

తొలి ప్రేమ – హాట్‌స్టార్

పవన్ కల్యాణ్, కీర్తి రెడ్డి నటించిన మరో ఎవర్‌గ్రీన్ లవ్ స్టోరీ ఈ తొలి ప్రేమ. ఫస్ట్ లవ్ లోని ఆ మాధుర్యాన్ని అందించే ఈ సినిమాను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో ఫ్రీగా చూడొచ్చు.

దేవదాసు – యూట్యూబ్

తెలుగులోనే కాదు ఇండియన్ సినిమా హిస్టరీలో ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీస్ లో ఒకటి ఈ దేవదాసు. అక్కినేని నాగేశ్వర రావు నటించిన ఈ సినిమా ఓ క్లాసిక్. ఈ సినిమాను యూట్యూబ్ లో ఫ్రీగా చూడొచ్చు.

నిన్నే పెళ్లాడతా – హాట్‌స్టార్

నాగార్జున నటించిన మరో లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా. ఎప్పుడో 29 ఏళ్ల కిందట వచ్చినా ఇప్పటికీ యువతను బాగా ఆకట్టుకునే సినిమా ఇది. ఈ మూవీని హాట్‌స్టార్ లో ఫ్రీగా చూడొచ్చు.

బొమ్మరిల్లు – యూట్యూబ్, సన్ నెక్ట్స్

2006లో సిద్ధార్థ్, జెనీలియా నటించిన మూవీ బొమ్మరిల్లు. ప్రేమించిన అమ్మాయిని వదులుకోలేక, తండ్రి మాటను కాదనలేక సతమతమయ్యే ఓ యువకుడి చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ఈ మూవీని సన్ నెక్ట్స్, యూట్యూబ్ లలో చూడొచ్చు.

మగధీర – ప్రైమ్ వీడియో, ఎంఎక్స్ ప్లేయర్

రామ్ చరణ్, కాజల్ లతో రాజమౌళి తెరకెక్కించిన క్లాసిక్ మూవీ మగధీర. జన్మజన్మలకూ విడిపోని ప్రేమ ఎలా ఉంటుందో చూపించిన మూవీ ఇది. ఈ సినిమాను ప్రస్తుతం ప్రైమ్ వీడియో, ఎంఎక్స్ ప్లేయర్ లలో చూడొచ్చు.

ఏ మాయ చేసావే – జీ5, ప్రైమ్ వీడియో

నాగ చైతన్య, సమంత కలిసి చేసిన ప్రేమ మాయే ఈ ఏ మాయ చేసావే. 2010లో వచ్చిన ఈ సినిమా ఓ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీయే. ఈ మూవీని ప్రస్తుతం ప్రైమ్ వీడియో, జీ5, ఆహా వీడియోలాంటి ఓటీటీ ప్లాట్‌ఫ్లామ్స్ పై చూసే అవకాశం ఉంది.

నువ్వొస్తానంటే నేనొద్దంటానా – ప్రైమ్ వీడియో

సిద్ధార్థ్, త్రిష కలిసి నటించిన మూవీ నువ్వొస్తానంటే నేనొద్దంటానా. 2005లో వచ్చిన ఈ సినిమా 20 ఏళ్ల తర్వాత కూడా అలరిస్తూనే ఉంది. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024