Laila Runtime: విశ్వక్‍సేన్ మూవీకి క్రిస్పీ రన్‍టైమ్.. సెన్సార్ ఏ సర్టిఫికేట్

Best Web Hosting Provider In India 2024

Laila Runtime: విశ్వక్‍సేన్ మూవీకి క్రిస్పీ రన్‍టైమ్.. సెన్సార్ ఏ సర్టిఫికేట్

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 12, 2025 02:22 PM IST

Laila Movie Runtime: లైలా చిత్రం సెన్సార్ పనులు పూర్తయ్యాయి. దీంతో రన్‍టైన్ వివరాలు బయటికి వచ్చాయి. తక్కువ రన్‍టైమ్‍తోనే ఈ మూవీ వస్తోంది

Laila Runtime: విశ్వక్‍సేన్ మూవీకి క్రిస్పీ రన్‍టైమ్.. సెన్సార్ ఏ సర్టిఫికేట్
Laila Runtime: విశ్వక్‍సేన్ మూవీకి క్రిస్పీ రన్‍టైమ్.. సెన్సార్ ఏ సర్టిఫికేట్

మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ హీరోగా నటించిన లైలా చిత్రం రిలీజ్‍కు రెడీ అవుతోంది. ఈ మూవీలో విశ్వక్ లేడీ గెటప్‍లో కూడా కనిపించనున్నారు. వాలెంటైన్స్ డే రోజున ఫిబ్రవరి 14న ఈ సినిమా విడుదల కానుంది. బోల్డ్ డైలాగ్‍లతో ఇటీవల వచ్చిన ట్రైలర్ వైరల్ అయింది. ఇటీవల ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో పృథ్వి చేసిన కామెంట్లు పెద్ద రచ్చగా మారాయి. మొత్తంగా ఈ చిత్రంపై క్రేజ్ బాగానే కనిపిస్తోంది. తాజాగా లైలా సినిమా రన్‍టైమ్ వివరాలు బయటికి వచ్చాయి.

yearly horoscope entry point

రన్‍టైన్ ఇదే

లైలా చిత్రం 136 నిమిషాల (రెండు గంటల 16 నిమిషాలు) రన్‍టైమ్‍తో వస్తోంది. సాధారణం కంటే కాస్త తక్కువ నిడివితోనే రానుంది. రొమాంటిక్ కామెడీ మూవీ కావడంతో ఈ క్రిస్పీ రన్‍టైమ్ సరిగ్గా సూటయ్యేలా కనిపిస్తోంది.

పెద్దలకు మాత్రమే

సెన్సార్ బోర్డు లైలా మూవీకి ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. అంటే 18 సంవత్సరాల లోపు వారు ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసేందుకు అనుమతి ఉండదు. పెద్దలకు మాత్రమే చిత్రంగా లైలా సర్టిఫికేట్ అందుకుంది. ఈ మూవీలో బోల్డ్ డైలాగ్‍లు, సీన్లు ఉండటంతో సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇచ్చిందని తెలుస్తోంది. అయితే, యూత్‍కు కనెక్ట్ అయ్యేలా ఈ మూవీ చేశామని విశ్వక్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. తాను అన్ని రకాల సినిమాలు చేస్తానని అన్నారు.

చల్లారని బాయ్‍కాట్ వివాదం

బాయ్‍కాట్ లైలా హ్యాష్‍ట్యాగ్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో 30ఇయర్స్ పృథ్వి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 11 గొర్రెలు అంటూ కామెంట్లు చేశారు. ఈ మాటలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీని బాయ్‍‍కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

అయితే, పృథ్వి మాట్లాడిన మాటలతో తమకు సంబంధం లేదని, సినిమాను చంపేయవద్దంటూ విశ్వక్‍సే‍న్ ప్రెస్‍మీట్ పెట్టి మరీ వివరించారు. ఎవరైనా బాధపడి ఉంటే సారీ అని కూడా ఉన్నారు. లైలాకు మద్దతు ఇవ్వాలని కోరారు. కానీ, బాయ్‍కాట్ లైలా అంటూ ఇప్పటికీ కొందరు పోస్టులు చేస్తున్నారు. పృథ్వితోనే సారీ చెప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

లైలా మూవీకి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో విశ్వక్ సరసన ఆకాంక్ష శర్మ హీరోయిన్‍గా నటించారు. లేడీ గెటప్‍లో విశ్వక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందోననే ఆసక్తి బాగా ఉంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024