కొడుకే వారసుడు అవుతాడా.. కూతుర్లు కారా ?

Best Web Hosting Provider In India 2024

చిరంజీవికి వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి ఆరే శ్యామల సూటి ప్ర‌శ్న‌

తాడేప‌ల్లి:  వార‌సుడి గురించి మెగాస్టార్ చిరంజీవి చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌ను వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి ఆరే శ్యామల ఖండించారు. కొడుకే వార‌సుడు అవుతాడా.. కూతుర్లు కారా.. అని చిరంజీవిని సూటిగా ప్ర‌శ్నించారు. వారసుడు అనేవాళ్ళు కొడుకు అనే భ్ర‌మ నుంచి అందరూ బయటకు వస్తే బాగుంటుంది..మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ముందుకు వెళ్తున్నారని తెలిపారు. సినిమా ఈవెంట్లో చిరంజీవి చేసిన కామెంట్ల‌పై శ్యామ‌ల బుధ‌వారం స్పందించారు.  చిరంజీవి కోడ‌లు ఉపాసన అన్నీ చక్కగా నడుతున్నారు..వారసులు అంటే ఒక్క కొడుకే కానక్కరలేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం అని చురకలు అంటించారు.. ఒక్కరి వ్యాఖ్యల వల్ల సినిమా పరిశ్రమ దెబ్బతినకూడదు. ఇటీవ‌ల క‌మోడియ‌న్ పృధ్వీ చేసిన‌ వ్యాఖ్యల వల్ల కొందరికి కోపం వచ్చింద‌ని తెలిపారు. కొంద‌రైతే లైలా సినిమా చూడ‌మ‌ని చెబుతున్నారు.. దానివల్ల నిర్మాతకు నష్టమ‌నిని గ్ర‌హించాల‌న్నారు. ఏపీలో మహిళలకు రక్షణ కరువు అని శ్యామ‌ల ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కూట‌మి స‌ర్కార్‌  విద్యార్ధులకు ఇచ్చే సంక్షేమ‌ పథకాలు ఆపేసి వారి జీవితాలతో ఆడుకుంటుంద‌ని మండిప‌డ్డారు. గతంలో మద్యంపై ప్రభుత్వానికి  ఆదాయం వచ్చేదన్నారు. ఇప్పుడు ఎవరికి దొరికింది వారు దోచుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఏపీ అభివృద్ధి వైయ‌స్ జగన్ తోనే సాధ్యమ‌ని శ్యామ‌ల వ్యాఖ్యానించారు. 

Best Web Hosting Provider In India 2024