Pacific Ocean: విమానాలు పసిఫిక్ సముద్రం మీద నుంచి ఎందుకు ఎగరవు?

Best Web Hosting Provider In India 2024

Pacific Ocean: విమానాలు పసిఫిక్ సముద్రం మీద నుంచి ఎందుకు ఎగరవు?

Haritha Chappa HT Telugu
Feb 12, 2025 05:30 PM IST

విమానయానం నేడు ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన రవాణా సేవగా మారింది. ఒకప్పుడు ధనవంతులకు మాత్రమే పరిమితమైన విమానాలు ఇప్పుడు సామాన్యులకు సులభమైన ధరలో అందుబాటులో ఉంది. అయితే విమానాలు పసిఫిక్ సముద్రం మీద నుంచి ఎగరవు. అలా ఎందుకు ఎగరవో తెలుసుకోండి.

విమానం కొన్ని ప్రాంతాల మీద నుంచి ఎందుకు ఎగరవు?
విమానం కొన్ని ప్రాంతాల మీద నుంచి ఎందుకు ఎగరవు? (Pixabay)

ఏవియేషన్ రంగంలో వచ్చిన విప్లవం సామాన్యులకు విమాన ప్రయాణాన్ని సులభతరం చేసింది.ఉడాన్ పథకం వల్ల సామాన్యుడికి విమాన ప్రయాణ సౌలభ్యం లభిస్తోంది. చౌక ధరలకు టిక్కెట్లు లభిస్తుండడంతో, విమానయాన సంస్థల నుంచి అనేక ఆఫర్లు కూడా ఇస్తున్నాయి.

yearly horoscope entry point

ఏవియేషన్ రూట్, ఫీల్డ్ పై మీకు ఆసక్తి ఉంటే కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు ఇక్కడ చెప్పాము. విమానాలు ఆకాశంలో ఎగురుతాయి. కాబట్టి ఆకాశంలో ఎత్తుగా ఎగురుతూ ఏ ప్రాంతంలోనైన ఎగిరిపోతాయని ఎంతో మంది అనుకుంటారు. కానీ విమానాలు కొన్ని ప్రాంతాల మీద నుంచి ఎగరవు. అందులో ముఖ్యమైనది పసిఫిక్ మహా సముద్రం. పసిఫిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణించే విమానాలు చాలా తక్కువనే చెప్పాలి. వాస్తవానికి, విమానయాన సంస్థలు ఆ ప్రాంతం గుండా ప్రయాణించాల్సి వస్తే, సమీప మార్గానికి బదులుగా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంటాయి. పసిఫిక్ మహాసముద్రం వైపు ప్రయాణాన్ని నివారించి ఇతర మార్గాలను ఎంచుకుంటాయి. దానికి కారణం ఏమిటి?

పసిఫిక్ పై విమానాలు ఎందుకు ఎగరవు?

పసిఫిక్ మహాసముద్రం చాలా పెద్దగా ఉండే సముద్రం. దీనిని దాటడానికి విమానాలకు పెద్ద మొత్తంలో ఇంధనం అవసరం. అంత ఇంధనం విమానంలో లేకపోతే ప్రయాణం ప్రమాదంలో పడుతుంది. పసిఫిక్ మహాసముద్రం మీదుగా నేరుగా ఎగరడానికి బదులుగా, చాలా వాణిజ్య విమానాలు వేరే మార్గాలను ఎంచుకుంటాయి. ఎందుకంటే నిటారుగా ఎగరడం కంటే వక్ర మార్గం గుండా ప్రయాణించడం మంచిదనుకుంటారు. ఇది సుదూర ప్రయాణంగా అనిపించినప్పటికీ సేఫ్టీ కోసం విమానాలు పసఫిక్ మీద నుంచి ఎగరడానికి సిద్ధంగా ఉండవు.

కొన్ని విమానాలు పసిఫిక్ మహాసముద్రంపై ఎగరకపోవడానికి మరో ప్రధాన కారణం విమానాలు ఎల్లప్పుడూ చదునైన ఉపరితల ప్రాంతంలో అత్యవసర ల్యాండింగ్ అవుతూ ఉంటాయి. అదే పసిఫిక్ సముద్రంపై ఎగురుతున్నప్పుడు అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వస్తే… ఆ పని చేయలేరు. భద్రత దృష్ట్యా గరిష్ట విమానాశ్రయాలు ఉన్న మార్గంలో విమానాన్ని నడపడం మంచిదని పైలట్లు భావిస్తారు. తద్వారా అత్యవసర పరిస్థితుల్లో విమానం సులభంగా ల్యాండ్ అవుతుంది. విమానయాన సంస్థలు పసిఫిక్ మహాసముద్రం గుండా ప్రయాణించవు.

టిబెటన్ పీఠభూమి ప్రాంతం

పసిఫిక్ మహాసముద్ర ప్రాంతం మీద నుంచే కాదు పైలెట్లు మరో ప్రాంతంలో కూడా ప్రయాణించరు. అదే టిబెటన్ పీఠభూమి. టిబెటన్ పీఠభూమిపై విమానాలు ఎగరకుండా ఉండటానికి ప్రధాన కారణం దాని విపరీతమైన ఎత్తు. అధిక ఎత్తులో గాలి నాణ్యత తక్కువగా ఉండటం వల్ల విమానం ఇంజిన్ల పనితీరు దెబ్బతింటుంది. అందువల్ల, అక్కడ విమాన రాకపోకలు ఉండవు.

వాతావరణ కారణాలు

కొన్ని ప్రాంతాల్లో విమానాలు ఎగరకపోవడానికి మరో ప్రధాన కారణం వాతావరణ పరిస్థితులు. టిబెటన్ పీఠభూములు, పసిఫిక్ సముద్రం వంటివి కఠినమైన, అనూహ్యమైన వాతావరణ పరిస్థితులతో కలిగి ఉంటుంది. ఇక్కడ బలమైన గాలులు, విపరీతమైన అల్లకల్లోలం విమానాలకు తీవ్రమైన ముప్పును కలిగిస్తాయి. ఈ ప్రాంతం తీవ్రమైన ఉరుములతో కూడిన తుఫానులకు కూడా గురవుతుంది. అందువల్ల, ఇక్కడ ప్రయాణం సురక్షితం కాదు.

టిబెటన్ పీఠభూమి 7,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తైన శిఖరాలు కలిగిన పర్వతాలను కలిగి ఉంది. ఇంత ఎత్తైన శిఖరాలపై ఎగరడం ప్రమాదకరం. విమానంలో ఇంజిన్ సమస్యలు ఎదురైతే, సురక్షితంగా ల్యాండింగ్ చేయడానికి చేయడానికి అక్కడ ఎలాంటి ఉపరితల ప్రదేశాలు ఉండవు. ఇలాంటి ప్రమాదకర ప్రాంతాల్లో ప్రయాణించకూడదని విమానయాన సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. అంతేకాకుండా యుద్ధం, భద్రతా కారణాల వల్ల కొన్ని ప్రాంతాల్లో విమాన రాకపోకలు నిలిచిపోతాయి.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే.)

Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024