ఎన్టీఆర్ జిల్లా / చందర్లపాడు :
ది.24-8-2022(బుధవారం) ..
చందర్లపాడు గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం” నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
చందర్లపాడు గ్రామంలోని సచివాలయం-1 పరిధిలో బుధవారం సాయంత్రం “గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం”లో భాగంగా శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ప్రతి ఇంటికీ తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను -పనితీరును వివరించారు ,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే పరమావధిగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పని చేస్తున్నారన్నారు , పేదలకు తోడుండాలనే మంచి మనసున్న జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టమని పేర్కొన్నారు , కరోనా మహమ్మారి కోరలు చాచి అల్లకల్లోలం సృష్టించిన సంక్షేమ పథకాల అమలులో వెనకడుగు వేయలేదని చెప్పారు , వాలంటీర్ సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హులకు సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్న ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారని తెలిపారు , ఎన్నో మంచి పనులు చేస్తూ పేదల హృదయాల్లో నిలిచిపోయిన జగన్మోహన్ రెడ్డి పై ప్రతిపక్షాలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని ,ప్రజలు అన్ని గమనిస్తున్నారని -వారే రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు ,
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కస్తాల పున్నమ్మ , మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వెలగపూడి వెంకటేశ్వరరావు , పార్టీ నాయకులు యార్లగడ్డ సత్యనారాయణ ప్రసాద్ , కందుల నాగేశ్వరరావు, జానకి రామయ్య తదితరులు పాల్గొన్నారు ..