Best Web Hosting Provider In India 2024
Trump Modi meet: ‘‘ఆ విషయంలో నా కన్నా భారత ప్రధాని మోదీ చాలా టఫ్’’ – డొనాల్డ్ ట్రంప్
భారత ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశం అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మీ ఇద్దరిలో ఎవరు టఫ్ నెగోషియేటర్ అన్న ప్రశ్నకు.. నిస్సందేహంగా మోదీనే’’ అని సమాధానమిచ్చారు. భారత్ సంబంధాలు తమకు అత్యంత ముఖ్యమన్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకంటే చాలా కఠినమైన సంధానకర్త (negotiator) అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొనియాడారు. ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశం అనంతరం ట్రంప్ మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్, యూఎస్ ల మధ్య టారిఫ్ డీల్ పై చర్చలు జరపడంలో మీ ఇద్దరిలో ఎవరు టఫ్ అన్న ప్రశ్నకు ట్రంప్ పై విధంగా సమాధానమిచ్చారు. ‘‘ప్రధాని మోదీ నా కంటే చాలా టఫ్ నెగోషియేటర్. ఇందులో పోటీనే లేదు’’ అని ట్రంప్ చిరునవ్వుతో ప్రశంసించారు. టారిఫ్ డీల్ చర్చల సమయంలో మోదీ భారతదేశం కోసం తీవ్రంగా వాదించారన్న ఉద్దేశంతో ట్రంప్ పై వ్యాఖ్యలు చేశారు.
భారత్ తో పలు ఒప్పందాలు
వాణిజ్య సుంకాలపై తమ మధ్య జరిగిన చర్చ గురించి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, సుంకాల సడలింపు, యుఎస్ నుంచి మరింత చమురు, గ్యాస్ కొనుగోలు, యుద్ధ విమానాల కొనుగోలు, వాణిజ్య యుద్ధాన్ని నిరోధించే రాయితీల గురించి తమ మధ్య చర్చ జరిగిందన్నారు. అమెరికా దిగుమతులపై సుంకాలు విధించే ప్రతి దేశంపై తిరిగి, అదే స్థాయిలో సుంకాలు విధించే రోడ్ మ్యాప్ ను ఆవిష్కరించిన తర్వాత వైట్ హౌస్ లో భారత ప్రధాని మోదీతో డొనాల్డ్ ట్రంప్ గంటల తరబడి ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
భారత్ విధిస్తున్న సుంకాలపై అసహనం
ట్రంప్ తన మొదటి పదవీకాలంలో మోడీతో స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉన్నప్పటికీ, అమెరికా ఉత్పత్తులపై భారతదేశం భారీగా సుంకాలు విధిస్తోందని పలుమార్లు ట్రంప్ విమర్శించారు. “భారత్ విధించే సుంకాలు చాలా ఎక్కువగా” ఉన్నాయని రెండో సారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తరువాత కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్ సహా అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించే అన్ని దేశాలకు రెసిప్రోకల్ టారిఫ్ విధానం అమలు చేస్తామన్నారు. అమెరికా ఉత్పత్తులకు విధించే టారిఫ్ కు సమానమైన సుంకాలను ఆయా దేశాల ఉత్పత్తులకు విధిస్తామని ట్రంప్ గతంలో కూడా స్పష్టం చేశారు. ట్రంప్ ఇతర దేశాలు దిగుమతులపై వసూలు చేసే పన్ను రేట్లకు అనుగుణంగా అమెరికా టారిఫ్ లను పెంచే ప్రణాళికను గురువారం విడుదల చేశారు.
ట్రంప్ పై మోదీ ప్రశంసలు
టారిఫ్ చర్చల అనంతరం ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై ప్రశంసలు కురిపించారు. ట్రంప్ కూడా తన లాగే దేశ ప్రయోజనాలను అత్యున్నత ప్రాధాన్యత ఇస్తారని వ్యాఖ్యానాించారు. “అధ్యక్షుడు ట్రంప్ ను నేను ఎంతగానో అభినందిస్తున్నాను. ఆయన నుండి నేను నేర్చుకున్న ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, అతను జాతీయ ప్రయోజనాలను అత్యున్నతంగా ఉంచుతారు” అని అంతకుముందు ఓవల్ కార్యాలయంలో ట్రంప్ తో కలిసి కూర్చున్నప్పుడు భారత ప్రధాని మోదీ అన్నారు. ఆయనలాగే తాను కూడా భారత దేశ ప్రయోజనాలకు అన్నింటి కన్నా పెద్దపీట వేస్తానని చెప్పారు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link