




Best Web Hosting Provider In India 2024

Bread and Milk: పాలు, బ్రెడ్ ఉన్నాయా? కేవలం 15 నిమిషాల్లోనే కలాకండ్ రెడీ అయిపోయినట్లే! ఈ రెసిపీతో ఇలా ట్రై చేయండి!
Bread and Milk: గెస్ట్‌లు ఇంటికి వస్తున్నారా? ఇంట్లో తినడానికి స్వీట్స్ లేవని కంగారుపడకండి. పాలు, బ్రెడ్ ఉంటే చాలు. కేవలం 15 నిమిషాల్లోనే టేస్టీ స్వీట్ రెడీ చేసుకోవచ్చు. అతిథుల కోసమే కాదు, పిల్లలకు స్నాక్స్ కోసం కూడా చాలా మంచి బెస్ట్ ఆప్షన్ ఈ కలాకండ్.
పాలు, బ్రెడ్ ఉన్నాయా? కేవలం 15 నిమిషాల్లోనే కలాకండ్ రెడీ అయిపోయినట్లే! (Pinterest)
పెద్దల నుంచి పిల్లల వరకూ స్వీట్స్ తినడానికి ఇంటరస్ట్ చూపించని వారెవరుంటారు చెప్పండి. మార్కెట్లో దొరికే కల్తీ వంటకాలు తినడానికే అంత ఆసక్తి కనబరుస్తుంటే, ఇక ఇంట్లో తయారుచేసే స్వీట్స్ అంటే ఇష్టపడకుండా ఉంటారా..? మరి, కేవలం ఇంట్లో అందుబాటులో ఉండే పాలు, బ్రెడ్‌లతో టేస్టీ కలాకండ్ తయారుచేసుకుంటే … ? అది కూడా 15 నిమిషాల్లో రెడీ చేసుకునేలా ఉంటే.? అదెలాగో చూసేద్దామా..

కావాల్సిన పదార్థాలు:
- పాలు – ఒకటిన్నర లీటర్లు
- బ్రెడ్ – సుమారు 10 ముక్కలు
- పంచదార – సుమారు 6 టీస్పూన్లు లేదా రుచికి తగినంత
- డ్రై ఫ్రూట్స్
- కుంకుమపువ్వు ముక్కలు
- అవసరమైనంత నీరు
పాలు – బ్రెడ్‌లతో కలాకండ్ తయారుచేసే విధానం
- ఈ స్వీట్ తయారు చేయడానికి ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో పాలు పోసి మరిగించండి.
- ఈ పాలలో ఎలాంటి క్రీమ్ ఉండకూడదని గుర్తుంచుకోండి.
- పాలలో పంచదార కలుపుకుని, ఆ మొత్తం పాల నుంచి అరకప్పు పాలు తీసి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు మిగిలిన పాలను సగం అయ్యే వరకు మరిగించాలి. వంట చేసేటప్పుడు పాలు చిక్కగా, పూర్తిగా పిండిలా మారుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి.
- కలర్ కోసం దానిపై కొద్దిగా కుంకుమపువ్వు పాలు వేసి క్రీమ్ కూడా కలుపుకుని గ్రైండ్ చేసుకోవాలి.
- అది పక్కకుపెట్టుకుని, కొన్ని బ్రెడ్ ముక్కలను తీసుకుని వాటి అంచులను తొలగించండి.
- ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ లేదా ట్రే తీసుకోండి. ఈ ట్రేపైన పాలను పోసి బ్రెడ్ ముక్కలను ఉంచి వాటిపై కొద్దిగా ఇందాక తీసి ఉంచిన పాలు పోయాలి.
- ఇప్పుడు మళ్లీ దాని పైన కొన్ని బ్రెడ్ ముక్కలను ఉంచి, దానిపై మళ్లీ పాలు, రబ్రీని పూయండి. ఈ విధంగా కేక్ లాంటి పొరను తయారు చేసుకోవాలి.
- ఇప్పుడు వాటిని అల్యూమినియం ఫాయిల్‌తో బాగా కవర్ చేసి రెండు మూడు గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచి సెట్ చేయాలి. ఇప్పుడు దాని పైన మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- మీరు తినాలనుకున్న పాలు – బ్రెడ్ కాంబినేషన్ కలాకండ్ స్వీట్ రెడీ.
మీ ఇంటికి వస్తున్న గెస్ట్ ల కోసం, మీ పిల్లలు బయట తింటామన్న చిరుతిళ్లను మాన్పించడం కోసం ఎప్పుడు ట్రై చేస్తున్నారు మరి.. ఈ కలాకండ్ స్వీట్ ను?
సంబంధిత కథనం