Curd: కేవలం పావుగంటలో చిక్కటి గడ్డ పెరుగును ఇలా చేసేయండి, రుచి అదిరిపోతుంది

Best Web Hosting Provider In India 2024

Curd: కేవలం పావుగంటలో చిక్కటి గడ్డ పెరుగును ఇలా చేసేయండి, రుచి అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu
Feb 14, 2025 04:30 PM IST

పెరుగు తయారవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఒక పూటంతా ఎదురుచూడాల్సి రావచ్చు. చిక్కటి గడ్డ పెరుగే కావాలంటే చిన్న చిట్కాలతో కేవలం 15 నిమిషాల్లోనే తయారుచేసుకోవచ్చు. ఎలా చేయాలో తెలుసుకోండి.

పావుగంటలో చిక్కటి పెరుగు ఇలా చేసేయండి
పావుగంటలో చిక్కటి పెరుగు ఇలా చేసేయండి (Shutterstock)

పెరుగు తినడం ఎంతో ఆరోగ్యకరం. భోజనం పెరుగుతోనే ముగ్గుస్తుంది. అప్పుడే సంపూర్ణ భోజనం పూర్తయినట్టు. అనేక పోషకాలతో నిండిన పెరుగు చాలా రుచికరంగా ఉంటుంది. ఇది ఆరోగ్యంతో పాటు రుచిలో కూడా తృప్తిని ఇస్తుంది. ఇంట్లోనే పెరుగును తయారుచేసుకుంటారు. అయితే పాలను తోడుపెట్టాక కనీసం 8 గంటలు సమయం పడుతుంది చిక్కటి పెరుగు తయారవ్వడానికి. ఇంట్లో ఉన్న పెరుగు కన్నా మార్కెట్లో ఉన్న పెరుగు చిక్కగా ఉంటుంది. ఇంట్లోనే పావు గంటలో పెరుగును తయారుచేసుకునే చిట్కాను ఇక్కడ మేము చెబుతున్నాము. ఈ పెరుగు మార్కెట్‌లో దొరికేలా గడ్డకట్టినట్టు ఉంటుంది. కాబట్టి ఈ అద్భుతమైన కిచెన్ టిప్స్ తెలుసుకుందాం.

yearly horoscope entry point

గడ్డ పెరుగు పెట్టేందుకు చిట్కాలు

మార్కెట్‌లో దొరికేలా గడ్డ పెరుగును త్వరగా తయారు చేయడానికి, ముందుగా పాలు వేడి చేయడానికి గ్యాస్ మీద ఉంచండి. పాలు మరిగేంత వరకు ఉడికించండి. పాలు బాగా మరిగితే పెరుగు గట్టిగా వస్తుంది. పాలు కాస్త వెచ్చగా అయినప్పుడు పెరుగు చేసేందుకు సిద్ధమవ్వాలి. గోరువెచ్చని పాలల్లో ఒక చెంచా పెరుగు వేసి బాగా కలపండి. ఇక్కడ వరకు ప్రక్రియ మీరు సాధారణంగా పెరుగు పెట్టే విధంగానే ఉంటుంది. ఒక విషయం గుర్తుంచుకోండి, మీకు ఎక్కువ పుల్లని పెరుగు కావాలంటే, పుల్లని పెరుగునే తోడు వేయండి.

తర్వాత ఈ పెరుగు కలిపిన పాలను ఒక పాత్రలో పోసి, అల్యూమినియం ఫాయిల్‌తో బాగా కప్పండి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ గ్యాస్ మీద ఉంచి, దానిలో సుమారు అరకప్పు నుండి ఒక గ్లాసు నీటిని వేయండి. ఆ నీరు మరగడం మొదలుపెట్టాక అందులో మీ పెరుగు పాత్రను ఉంచండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టండి. కుక్కర్ కి విజిల్ మాత్రం పెట్టకండి. ప్రెషర్ కుక్కర్‌లో సుమారు 15 నిమిషాలు పెరుగును ఉడికించండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెరుగు పాత్రను బయటకు తీసి, చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత చూస్తే గడ్డపెరుగు రెడీ అయిపోయి కనిపిస్తుంది. ఇది వెంటనే తినేందుకు కూడా సిద్ధంగా ఉంటుంది.

ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో పెరుగు చేసి చూడండి … రుచి అద్భుతంగా ఉంటుంది. పెరుగు తినడం వల్ల ఎంతో ఆరోగ్యం కూడా. ప్రతిరోజూ పెరుగు తినేవారిలో మానసిక సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే కాల్ఫియం లోపం కూడా రాదు.

Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024