Gobi dum Biryani: గోబీ దమ్ బిర్యానీ ఇక్కడ చెప్పినట్టు చేసి చూడండి, రెసిపీ చాలా సులువు ఎంతో రుచి కూడా

Best Web Hosting Provider In India 2024

Gobi dum Biryani: గోబీ దమ్ బిర్యానీ ఇక్కడ చెప్పినట్టు చేసి చూడండి, రెసిపీ చాలా సులువు ఎంతో రుచి కూడా

Haritha Chappa HT Telugu
Feb 14, 2025 05:30 PM IST

Gobi dum Biryani: చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ లాగే కాలీ ఫ్లవర్‌తో కూడా దమ్ బిర్యానీ వండుకోవచ్చు. గోబీ దమ్ బిర్యానీ రెసిపీ ఇక్కడ ఇచ్చాము. ఇది ఎంతో టేస్టీగా, స్పైసీ ఉంటుంది.

గోబీ దమ్ బిర్యానీ రెసిపీ
గోబీ దమ్ బిర్యానీ రెసిపీ

బిర్యానీ పేరు వింటే తినాలన్న కోరిక రెట్టింపవుతుంది. బిర్యానీలో వెజ్ బిర్యానీ, పనీర్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. కాలి ఫ్లవర్ తో కూడా టేస్టీగా గోబి దమ్ బిర్యానీ వండుకోవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ముఖ్యంగా శాకాహారులకు ఇది ఎంతో నచ్చుతుంది. ఒక చిన్న గోబీ పువ్వుతో దమ్ బిర్యానీ వండేసుకోవచ్చు. ఇక దీని రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

yearly horoscope entry point

గోబీ దమ్ బిర్యానీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

బాస్మతి రైస్ – రెండు కప్పులు

నీరు – నాలుగు కప్పులు

పచ్చి యాలకులు – రెండు

బిర్యానీ ఆకు – ఒకటి

దాల్చినచెక్క ముక్క – ఒకటి

లవంగాలు – రెండు

ఉప్పు – రుచికి సరిపడా

కాలీఫ్లవర్ ముక్కలు – ఒక కప్పు

పెరుగు – ఒక స్పూను

అల్లం వెల్లుల్లి పేస్ట్ – రెండు స్పూన్లు

ఉల్లిపాయలు – రెండు

టమోటాలు – రెండు

పచ్చిమిర్చి – రెండు

పసుపు – అరస్పూను

గరం మసాలా – ఒక స్పూను

జీడిపప్పులు – పది

నెయ్యి – రెండు స్పూన్లు

నూనె – రెండు స్పూన్లు

పాలు – రెండు స్పూన్లు

కుంకుమపువ్వు రేకలు – నాలుగు

పుదీనా తరుగు – రెండు స్పూన్లు

కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు

గోబీ దమ్ బిర్యానీ రెసిపీ

  1. కాలిఫ్లవర్ ను ముక్కలుగా కట్ చేసి వేడి నీళ్లలో కాసేపు ఉంచి తీసి పక్కన పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్రను పెట్టి నాలుగు గ్లాసుల నీళ్లు వేయాలి.
  3. అందులో బిర్యానీ ఆకు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, కొద్దిగా ఉప్పు, బాస్మతి బియ్యం వేసి 80 శాతం వరకు ఉడికించాలి.
  4. అన్నం ఉడికిన తర్వాత అదనపు నీటిని వడగట్టి ఆ అన్నాన్ని పక్కన పెట్టుకోవాలి.
  5. ఇప్పుడు బిర్యానీ వండేందుకు పెద్ద పాత్ర స్టవ్ మీద పెట్టాలి.
  6. ఇందులో నెయ్యి, నూనె వేసి వేడి చేయాలి. అందులో తరిగిన ఉల్లిపాయలను బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
  7. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటాలు, పచ్చిమిర్చి, పసుపు, కారం, గరం మసాలా, బిర్యానీ మసాలా వేసి మసాలాలన్నీ బాగా వేగనివ్వాలి.
  8. ఇప్పుడు ఇందులో పెరుగు వేసి బాగా కలపాలి.
  9. తర్వాత కాలీఫ్లవర్ ముక్కలు వేసి మూతపెట్టి 10 నిమిషాలు ఉడికించాలి.
  10. కాలీ ఫ్లవర్ ఉడికి మెత్తగా అయ్యాక జీడిపప్పులు వేసి అన్నీ కలపాలి.
  11. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా కలపుకోవాలి.
  12. కాలీ ఫ్లవర్ మిశ్రమాన్ని సగం తీసి పక్కన పెట్టుకోవాలి.
  13. ఇప్పుడు మిగిలిన కాలి ఫ్లవర్ మిశ్రమంలో ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని పొరలుపొరలుగా వేసుకోవాలి.
  14. మధ్యలో కాలిఫ్లవర్ మిశ్రమాన్ని కూడా వేస్తూ ఉండాలి. కొత్తిమీర, పుదీనా తరుగును కూడా చల్లాలి.
  15. చివరలో పాలల్లో నానబెట్టిన కుంకుమ పువ్వు మిశ్రమాన్ని వేసి పైన మూత పెట్టాలి.
  16. చిన్న మంట మీద ఈ పాత్రను పెట్టి పావు గంట సేపు ఉడికించాలి. అంతే టేస్టీ గోబీ దమ్ బిర్యానీ రెడీ అయినట్టే.

ఇంటికి శాకాహారం తినే అతిధులు వచ్చినప్పుడు ఇలా గోబీ దమ్ బిర్యానీ వండి చూడండి. ఇది వారికి ఎంతో నచ్చుతుంది. దీనికి తోడుగా రైతా కూడా ఉండే ఆ రుచే వేరు.

Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024