




Best Web Hosting Provider In India 2024

Na Love Story: నేను, అతను ఆర్జీవీ దగ్గర అసిస్టెంట్స్‌గా పనిచేశాం.. మంగళవారం డైరెక్టర్ అజయ్ భూపతి కామెంట్స్
Director Ajay Bhupathi Launch Na Love Story First Look: ఆర్ఎక్స్ 100, మంగళవారం సినిమాల డైరెక్టర్ అజయ్ భూపతి చేతుల మీదుగా నా లవ్ స్టోరీ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు అజయ్ భూపతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Director Ajay Bhupathi Launch Na Love Story First Look: మహీర క్రియేషన్స్, సుప్రియ ఆర్ట్స్ బ్యానర్లపై దొమ్మరాజు అమరావతి, శ్రీకాంత్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా నా లవ్ స్టోరీ. తెలుగులో రొమాంటిక్ అండ్ లవ్ స్టోరీ చిత్రంగా తెరకెక్కిన నా లవ్ స్టోరీ సినిమాకు వినయ్ గోను దర్శకత్వం వహిస్తున్నారు. నా లవ్ స్టోరీ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ అజయ్ భూపతి లాంచ్ చేశారు.

అజయ్ భూపతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తెలుగులో ఆర్ఎక్స్ 100, మంగళవారం చిత్రాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు డైరెక్టర్ అజయ్ భూపతి. మంగళవారం సినిమాకు పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్ సైతం వరించాయి. అయితే, నా లవ్ స్టోరీ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ సందర్భంగా అజయ్ భూపతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
వాలంటైన్స్ డే సందర్భంగా
అజయ్ భూపతి మాట్లాడుతూ.. “ఈ చిత్ర దర్శకుడు వినయ్ గోను, నేను ఆర్జీవీ గారి దగ్గర అసిస్టెంట్స్‌గా వర్క్ చేశాం. ఈ వాలెంటైన్స్ డే సందర్బంగా ఈ సినిమా పోస్టర్‌ను లాంచ్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ పోస్టర్ చాలా యూనిక్‌గా ఉంది” అని తెలిపారు.
హాస్టల్ బ్యాక్‌డ్రాప్‌లో
“స్టూడెంట్స్ హాస్టల్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఒక కొత్త తరహా ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దర్శకుడు వినయ్ గోను ఈ సినిమా ద్వారా పెద్ద సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను” అని చెప్పుకొచ్చిన డైరెక్టర్ అజయ్ భూపతి నా లవ్ స్టోరీ మూవీ దర్శక నిర్మాతలకు, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. నా లవ్ స్టోరీ మూవీ దర్శకుడు వినయ్ గోను మాట్లాడుతూ.. “మా పోస్టర్ లాంచ్ చేసిన నా దర్శక మిత్రులు అజయ్ భూపతి గారికి ధన్యవాదాలు” అని చెప్పారు.
ఏం మాయ చేశావే లాంటి మ్యూజిక్
సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ మాట్లాడుతూ.. “ఏం మాయ చేశావే లాంటి మ్యూజిక్ లవ్ స్టోరీకి సంగీతం అందించాలని ఎప్పటినుంచో అనుకుంటున్న నాకు డైరెక్టర్ వినయ్ గారి నుంచి అలాంటి అవకాశం దక్కింది. ఈ అందమైన ప్రేమ కథకు అద్భుతమైన సంగీతాన్ని అందిస్తానని.. మళ్లీ వచ్చే ప్రేమికుల రోజున ఇందులోని పాటలు అందరూ రింగ్ టోన్ పెట్టుకునేలా ఉంటాయన్న నమ్మకం ఉంది” అని ఆశాభావం వ్యక్తం చేశారు.
మార్చి తొలి వారం నుంచి
నా లవ్ స్టోరీ చిత్రంలో లీడ్ రోల్‌లో నటిస్తున్న మోహిత్ పెద్దాడ మాట్లాడుతూ.. “ఒక మంచి లవ్ స్టోరీలో నటించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని. మా టీమ్‌ని సపోర్ట్ చేసిన అజయ్ భూపతి గారికి కృతజ్ఞతలు” అని చెప్పుకొచ్చాడు. కాగా, మార్చి నెల మొదటి వారం నుంచి నా లవ్ స్టోరీ చిత్రం తొలి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాతలు వెల్లడించారు.
సంబంధిత కథనం