




Best Web Hosting Provider In India 2024

OTT Revenge Thriller: నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న ఈ మలయాళం రివేంజ్ థ్రిల్లర్ చూశారా.. అమలా పాల్ సూపర్ యాక్టింగ్
OTT Revenge Thriller: నెట్‌ఫ్లిక్స్ లో థ్రిల్లర్ మూవీస్ చాలానే ఉన్నాయి. కానీ ఈ మలయాళ రివేంజ్ థ్రిల్లర్ మాత్రం స్పెషల్ అని చెప్పొచ్చు. అమలా పాల్ ఓ టీచర్ గా నలుగురు స్టూడెంట్స్ పై తీర్చుకునే ప్రతీకారమే ఈ మూవీ.
OTT Revenge Thriller: ఓటీటీలో థ్రిల్లర్, రివేంజ్ థ్రిల్లర్ మూవీస్ కు ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది. ఈ జానర్ సినిమాలు ఏ భాషలో వచ్చిన ఓటీటీ ప్రేక్షకులు ఆదరిస్తారు. అలా నెట్‌ఫ్లిక్స్ లోనూ ది టీచర్ (The Teacher) పేరుతో ఓ మలయాళం మూవీ ఉంది. అమలా పాల్ నటించిన ఈ సినిమా తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఒకవేళ ఇప్పటి వరకూ చూడకపోతే వెంటనే చూసేయండి.

ది టీచర్.. ఓ రివేంజ్ థ్రిల్లర్
మలయాళం మూవీ ది టీచర్.. రెండేళ్ల కిందట థియేటర్లలో రిలీజైంది. వివేక్ డైరెక్ట్ చేశాడు. అమలా పాల్ లీడ్ రోల్లో నటించింది. ఓ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పాత్రలో ఆమె నటించిన మూవీ ఇది. డిసెంబర్, 2022లో థియేటర్లలో రిలీజై మంచి రెస్పాన్స్ సంపాదించింది.
తర్వాత నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనూ ప్రేక్షకులు బాగానే ఆదరించారు. ఓ టీచర్.. తనకు అన్యాయం చేసిన నలుగురు స్టూడెంట్స్ పై ఎలా ప్రతీకారం తీర్చుకుంటుందన్న కథ ఆధారంగా ఈ మూవీని తీశారు. ఇదొక డిఫరెంట్, పక్కా మలయాళం మార్క్ రివేంజ్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు.
ది టీచర్ స్టోరీ ఏంటంటే?
ది టీచర్ మూవీ దేవిక (అమలా పాల్) అనే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ చుట్టూ తిరుగుతుంది. ఓ రోజు స్కూల్లో ఈవెంట్ తర్వాత ఆమె ఇంటికి తిరిగి వస్తుంది. మరుసటి రోజు ఒంటి గాయాలు కావడం చూసుకొని షాక్ తింటుంది. అసలు అంతకుముందు రాత్రి ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఓ స్టూడెంట్ ఇంటికి వెళ్తుంది. అక్కడ ఆమెకు ఓ భయంకరమైన నిజం తెలుస్తుంది.
ఆ నిజం ఏంటి? ఆ తర్వాత తనకు జరిగిన అన్యాయంపై ఆమె ఎలా ఫైట్ చేస్తుంది? కట్టుకున్న భర్త ఛీ పొమ్మన్నా.. తన అత్త ఇచ్చిన ధైర్యంతో తనకు అన్యాయం చేసిన వాళ్లపై ఆమె ఎలా ప్రతీకారం తీర్చుకుంది అన్నది ది టీచర్ సినిమాలో చూడొచ్చు.
ది టీచర్.. ఎలా ఉందంటే?
రెగ్యులర్ రివేంజ్ థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా ది టీచర్ కథ సాగుతుంది. ఈ మూవీలో దేవిక పాత్రలో అమలా పాల్ నటన చాలా బాగుంది. తన స్టూడెంట్స్ పై టీచర్ రివేంజ్ అనే స్టోరీయే ఈ మూవీకి హైలైట్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక ఊహకందని క్లైమ్యాక్స్ కూడా ది టీచర్ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. థ్రిల్లర్, రివేంజ్ థ్రిల్లర్ జానర్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది.
అక్కడక్కడా కథనం కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపించినా.. ఓవరాల్ గా మూవీని ఓసారి చూడొచ్చు. ది టీచర్ మూవీలో అమలాపాల్ తోపాటు హకీమ్ షా, చెంబన్ వినోద్ జోస్, మంజు పిళ్లైలాంటి వాళ్లు కూడా నటించారు. ది టీచర్ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఏదో ఒక వీకెండ్ చూసేయండి.
సంబంధిత కథనం