




Best Web Hosting Provider In India 2024

Rana Daggubati: నాకు కొన్ని లవ్ స్టోరీస్ మాత్రమే అర్థం అవుతాయి.. అందులో ఇదొకటి.. రానా దగ్గుబాటి కామెంట్స్
Rana Daggubati About Love Stories In Its Complicated Press Meet: స్టార్ హీరో రానా దగ్గుబాటి నిర్మించిన యూత్ లవ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ఇట్స్ కాంప్లికేటెడ్ ఇవాళ థియేటర్లలో విడుదలైంది. రిలీజ్‌కు ముందు నిర్వహించిన మూవీ క్యూ అండ్ ఏ ప్రెస్ మీట్‌లో రానా దగ్గుబాటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Rana Daggubati Comments In Its Complicated Press Meet: సిద్ధు జొన్నలగడ్డ నటించిన యూత్‌ఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం కృష్ణ అండ్ హిజ్ లీలా నేరుగా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఇదే సినిమాను ఇట్స్ కాంప్లికేటెడ్ టైటిల్‌తో ఇవాళ (ఫిబ్రవరి 14) థియేటర్లలో విడుదల చేశారు.

అయితే, ఇట్స్ కాంప్లికేటెడ్ థియేట్రికల్ రిలీజ్‌కు ముందు సిద్ధు జొన్నలగడ్డ, రానా దగ్గుబాటి, డైరెక్టర్ రవికాంత్ పెరెపుతో క్యూ అండ్ ఏ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రానా దగ్గుబాటి, సిద్ధు, రవికాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఇదే యాప్ట్ రిలీజ్
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. “సినిమాని థియేటర్స్‌లో ఆడియన్స్ చుడాలనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఫిబ్రవరి 14 సినిమాకి యాప్ట్ రిలీజ్. థియేటర్స్‌లో ఆడియెన్స్ ఎగ్జయిట్‌మెంట్ చూడాలని ఉంది” అని చెప్పుకొచ్చాడు.
“లాక్ డౌన్‌లో ఈ సినిమా థియేటర్స్‌లో చూడటం కుదరలేదు. అందరితో కలసి చూస్తే మజా వస్తుంది. ఆడియన్స్ రియాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాం” అని డైరెక్టర్ రవికాంత్ పెరెపు చెప్పారు.
రానా గారు ఈ టైటిల్ ఐడియా ఎవరిది? టైటిల్ మార్చి రిలీజ్ చేయడం కొత్త ట్రెండ్ అనుకోవచ్చా?
-ముందు ఒక టైటిల్ అనుకున్నాం. కానీ, ఆ టైటిల్ పెట్టనివ్వలేదు. తర్వాత ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ అని డైరెక్టరే పెట్టారు. ఈ సినిమా థియేటర్స్‌లో అందరితో కలసి చూడడం అనేది వెరీ గుడ్ ఫీలింగ్. ఇది రీ రిలీజ్ కాదు. థియేటర్స్‌లో ఫస్ట్ టైం రిలీజ్.
రవికాంత్ గారు.. మార్చిన టైటిల్ గురించి చెప్పండి?
-‘ఇట్స్ కాంప్లికేటెడ్’ అని కాలేజ్ డేస్‌లో ఓ షార్ట్ ఫిల్మ్ తీశాను. ఇప్పుడు థియేటర్స్‌లో రిలీజ్ కాబోతున్న సినిమా శాటిలైట్ రావాలంటే సెన్సార్ క్లియర్ కావాలి. ఈ సినిమాకి ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ టైటిల్ యాప్ట్ అవుతుంది. ఆ రకంగా సినిమాకి ఈ టైటిల్ పెట్టడం జరిగింది. ఈ కథ అందరూ రిలేట్ చేసుకునేలా ఉంటుంది.
సిద్దుగారు లైలా (విశ్వక్ సేన్) మీకు మంచి ఫ్రెండ్ కదా. ఆయన సినిమాతో పాటు మీ సినిమా రిలీజ్ చేయడానికి కారణం?
-మా సినిమా రీ రిలీజ్, అది స్ట్రయిట్ రిలీజ్.. అసలు కంపారీజన్ లేదు.
రానా గారు.. ఈ లవ్ స్టొరీలో మీకు కనెక్ట్ అయిన పాయింట్?
-నాకు కొన్ని లవ్ స్టోరీస్ మాత్రమే అర్థం అవుతాయి. అందులో ఈ సినిమా ఒకటి. అందరిలో లైఫ్‌లో కొన్ని జరుగుతాయి. వాటిని చాలా బ్యూటీఫుల్‌గా క్యాప్చర్ చేశారు.
సిద్దు: అవుట్ అఫ్ ది బాక్స్ కథలు ఉంటే రానా దగ్గరికి వస్తారు. రానా వాటిని అర్ధం చేసుకొని ముందుకు తీసుకెళతారు. ఇలాంటి కథలు చేయాలంటే కొందరు ధైర్యం చేయరు. రానా మాత్రం ఇలాంటి కథ చెప్పాలని అనుకుంటారు. ఈ కథ రానాకి చెబితే చాలా స్ట్రాంగ్‌గా ఫీలయ్యారు. అక్కడే రానాకి ఈ సినిమా కనెక్ట్ అయ్యింది. ఈ సినిమాని ముందు థియేటర్స్‌లో రిలీజ్ చేయాలనే అనుకున్నాం. నిజానికి థియేటర్స్‌లో రిలీజ్ చేసుంటే సిక్స్ టైమ్స్ ఎక్కువ వచ్చేది.
సంబంధిత కథనం