



Best Web Hosting Provider In India 2024

Rashmika Mandanna Trolling: తనది హైదరాబాద్ అని చెప్పుకున్న రష్మిక మందన్నా.. ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్
Rashmika Mandanna Trolling: రష్మిక మందన్నాను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. తనది హైదరాబాద్ అని చెప్పుకోవడంతో కొందరు కన్నడిగులు ఆమెపై మండిపడుతున్నారు.
Rashmika Mandanna Trolling: నేషనల్ క్రష్ రష్మిక మందన్నాపై మరోసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. తాజాగా శుక్రవారం (ఫిబ్రవరి 14) ఆమె నటించిన ఛావా (Chhaava) మూవీ రిలీజైంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో రష్మిక తనది హైదరాబాద్ అని చెప్పుకుంటున్న వీడియో వైరల్ కావడంతో కొందరు కన్నడిగులు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
నాది హైదరాబాద్: రష్మిక
రష్మిక మందన్నా కర్ణాటకకు చెందిన నటి అయినా.. తెలుగు సినిమాలతోనే పాపులర్ అయింది. తెలుగు నుంచి బాలీవుడ్ లోకి అడుగుపెట్టి నేషనల్ క్రష్ గా మారిపోయింది. అయితే ఇప్పుడామె ఎక్కడికి వెళ్లినా తనది హైదరాబాద్ అని చెప్పుకుంటోంది. తాజాగా ఛావా మూవీ ప్రమోషన్లలో భాగంగా కూడా రష్మిక మాట్లాడుతూ.. తాను హైదరాబాద్ కు చెందిన వ్యక్తిని అని చెప్పుకుంది.
“నాది హైదరాబాద్. కానీ ఇక్కడికి ఒంటరిగా వచ్చాను. ఇప్పుడు నేను కూడా మీ కుటుంబంలో ఒకరని అనుకుంటున్నాను. థ్యాంక్యూ” అని రష్మిక చెప్పింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రష్మికపై ట్రోలింగ్
రష్మిక వీడియో వైరల్ కావడంతో కొందరు కన్నడ అభిమానులు ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. విరాజ్‌పేట, కొడగు జిల్లా హైదరాబాద్ లో ఉన్నట్లు నాకు తెలియదు అంటూ ఓ అభిమాని కామెంట్ చేశాడు. రష్మికది కర్ణాటకలోని కొడగు జిల్లా విరాజ్‌పేట కావడం విశేషం. అందుకే ఆ అభిమాని అలా కామెంట్ చేశారు. ఇక మరొకరు స్పందిస్తూ.. ఇన్నాళ్లూ నిన్ను అందరూ ట్రోలింగ్ చేస్తుంటే వాళ్లను తప్పుబట్టాను కానీ.. ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు చూస్తుంటే వాళ్లే కరెక్ట్ అనిపిస్తోందని అనడం గమనార్హం.
అయితే రష్మికకు మద్దతుగా మరికొందరు కూడా ట్వీట్లు చేస్తున్నారు. ఆమె తనది ఎప్పుడూ కూర్గ్ అనే చెప్పుకున్నదంటూ మరో వీడియోను పోస్ట్ చేశారు. అందులో రష్మిక మాట్లాడుతూ.. తాను కూర్గ్ కు చెందిన వ్యక్తి అని, అక్కడి భాష చాలా మందికి తెలియకపోవడంతో తాను విక్కీ కౌశల్ (ఛావా మూవీ హీరో)కు నేర్పిస్తున్నట్లు చెప్పింది. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ రష్మిక ఎప్పుడూ తనది కూర్గ్ అనే చెబుతుందని, అయితే హైదరాబాద్ లో నివాసం ఉంటున్నందుకు అలా చెప్పి ఉంటుందని సమర్థిస్తున్నారు.
విక్కీ కౌశల్, రష్మిక మందన్నా నటించిన ఛావా మూవీ శుక్రవారం (ఫిబ్రవరి 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మూవీ ఇది. ఈ సినిమాకు అంతటా పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. విక్కీ, రష్మిక నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ ఏడాది అతిపెద్ద ఓపెనింగ్ సాధించిన హిందీ సినిమాగా ఛావా నిలిచింది.
సంబంధిత కథనం