



Best Web Hosting Provider In India 2024

Kiran Abbavaram: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న కిరణ్ అబ్బవరం!
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన దిల్‍రూబా విడుదల వాయిదా పడింది. అయితే, ప్రస్తుతం బాక్సాఫీస్ పరిస్థితులు చూసుకుంటే ఈ చిత్రం మంచి అవకాశాన్నే మిస్ చేసుకున్నట్టుగా అనిపిస్తోంది.
తెలుగు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గతేడాది ‘క’ చిత్రంతో మంచి హిట్ కొట్టారు. వరుస ప్లాఫ్‍ల తర్వాత మళ్లీ సక్సెస్ ట్రాక్ పట్టారు. కిరణ్ హీరోగా నటించిన దిల్‍రూబా చిత్రం వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన విడుదల కావాల్సింది. ఈ రొమాంటిక్ డ్రామా మూవీకి విశ్వ కరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, ఈ మంచి క్రేజ్ ఉన్న చిత్రం సడెన్‍గా వాయిదా పడింది.
మంచి ఛాన్స్ మిస్ అయిందా!
దిల్‍రూబా మూవీ వాలెంటైన్స్ డేకు సూటయ్యేలా లవ్ స్టోరీతో రూపొందింది. ఈ చిత్రంపై ముందు నుంచి పాజిటివ్ వైబ్స్ నెలకొన్నాయి. ఈ వాలెంటైన్స్ డేకు తెలుగులో లైలా, బ్రహ్మా ఆనందం చిత్రాలు రిలీజయ్యాయి. లైలాకు డిజాస్టర్ టాక్ రాగా.. బ్రహ్మా ఆనందం మూవీకి మోస్తరు రెస్పాన్స్ ఉంది. అయితే, ఈ రెండు సినిమాలు కూడా వాలెంటైన్స్ సీజన్‍కు కనెక్ట్ అయ్యేవి కాదు.
రొమాంటిక్ డ్రామా రూపొందిన దిల్‍రూబా చిత్రం వాలెంటైన్స్ డే రోజున వచ్చి ఉంటే మంచి ఓపెనింగ్ దక్కించుకునేందుకు మరింత ఎక్కువ ఛాన్స్ ఉండేది. అందులోనూ లైలాకు నెగెటివ్ టాక్ ఉండటం ఈ మూవీకి ప్లస్ అయ్యేది. తండేల్ థియేట్రికల్ రన్ జోరు కూడా కాస్త తగ్గింది. దీంతో ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ మందకొడిగా ఉంది. ఒకవేళ దిల్‍రూబా ఫిబ్రవరి 14న విడుదలై ఉంటే.. ఈ అంశాలన్నీ కలిసి వచ్చేవి. అయితే, ఆ అవకాశాన్ని కిరణ్ అబ్బవరం చిత్రం మిస్ చేసుకుంది.
కొత్త రిలీజ్ డేట్ ఇదే
దిల్‍రూబా చిత్రం ఇక మార్చి 14వ తేదీన విడుదల కానుంది. వాలెంటైన్స్ డే నుంచి హోలీ పండుగకు ఈ మూవీ వాయిదా పడింది. అనుకోని పరిస్థితుల వల్ల ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు మూవీ టీమ్ వెల్లడించింది. మరి ‘క’ సక్సెస్‍ను దిల్‍రూబాతో కిరణ్ కొనసాగిస్తారేమో చూడాలి.
దిల్‍రూబా చిత్రంలో కిరణ్ అబ్బవరం సరసన రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మెప్పించింది. ఈ చిత్రం నుంచి రిలీజైన ఫస్ట్ సాంగ్ బాగా పాపులర్ అయింది. టీజర్ కూడా ఆకట్టుకుంది. ఈ మూవీకి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. క తర్వాత మళ్లీ కిరణ్ చిత్రానికి సామ్ వర్క్ చేస్తున్నారు.
దిల్‍రూబా చిత్రాన్ని శివం సెల్యులాయిడ్, సరిగమ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి జోజో జోస్, రాకేశ్ రెడ్డి ప్రొడ్యూజర్లుగా ఉన్నారు. ఈ చిత్రాన్ని రొమాంటిక్ డ్రామా తెరకెక్కించారు కొత్త డైరెక్టర్ విశ్వ కరుణ్.
సంబంధిత కథనం