



Best Web Hosting Provider In India 2024

Daaku Maharaaj OTT Release: డాకు మహారాజ్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైనా ఆ విషయంపై మాత్రం ఉత్కంఠే!
Daaku Maharaaj OTT: డాకు మహారాజ్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. అయితే, ఈ మూవీ స్ట్రీమింగ్‍పై ఇటీవల ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. దీనిపై మాత్రం సస్పెన్స్ నెలకొంది.
డాకు మహారాజ్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఎట్టకేలకు అధికారికంగా వెల్లడైంది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లలో రిలీజైంది. మంచి హిట్ కొట్టింది. అయితే, ఓటీటీ స్ట్రీమింగ్ మాత్రం అనుకున్న దాని కంటే ఆలస్యమైంది. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ తేదీ ఖరారైంది. అయితే, ఓ విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఆ వివరాలు ఇవే..
ఆ విషయంపై సస్పెన్స్
డాకు మహరాజ్ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఫిబ్రవరి 21వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. దీనిపై అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. అయితే, ఓటీటీలో డాకు మహరాజ్ చిత్రానికి అదనపు సీన్లు యాడ్ అవుతాయనే రూమర్లు ఇటీవల చక్కర్లు కొడుతున్నాయి. థియేట్రికల్ వెర్షన్‍తో పోలిస్తే మరింత ఫుటేజ్ ఓటీటీలో ఉంటుందనే పుకార్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయంపైనే ఉత్కంఠ నెలకొంది. ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా.. ఈ సస్పెన్స్ మాత్రం కొనసాగనుంది. స్ట్రీమింగ్ మొదలయ్యేకే ఇది వీడనుంది. మరి డాకు మహరాజ్‍కు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో అదనపు సీన్లు ఉంటాయా.. థియేట్రికల్ వెర్షనే వస్తుందా అనేది చూడాలి.
ఫిబ్రవరి 21వ తేదీన డాకు మహరాజ్ చిత్రాన్ని స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు నెట్‍ఫ్లిక్స్ వెల్లడించింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రానున్నట్టు తెలుస్తోంది. డబ్బింగ్ వల్లే ఓటీటీలోకి ఆలస్యమైనట్టు వాదనలు ఉన్నాయి. ఫిబ్రవరి రెండో వారంలోనే ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రావాల్సింది. అయితే, కాస్త ఆలస్యంగా 21న అడుగుపెడుతోంది.
డాకు మహరాజ్ చిత్రం ఓటీటీలోకి ఆలస్యమవటంతో రకరకాల రూమర్లు చక్కర్లు కొట్టాయి. థియేటర్లలో రిలీజైన 50 రోజులకు ఓటీటీలోకి తీసుకురావాలన్న నిర్మాతల మండలి ప్రతిపాదనను ఈ మూవీ మేకర్స్ ఫాలో అవుతున్నారనే పుకార్లు వచ్చాయి. స్ట్రీమింగ్ డేట్ ఖరారు కావటంతో అలాంటిదేమీ లేదని అర్థమైంది. థియేటర్లలో రిలీజైన 40 రోజులకు ఈ మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తోంది.
కమర్షియల్ సక్సెస్
డాకు మహరాజ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.150కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటిందని మూవీ యూనిట్ వెల్లడించింది. దీంతో ఈ చిత్రం కమర్షియల్‍గా విజయం దక్కించుకుంది. బాలయ్యకు వరుసగా ఇది నాలుగో రూ.100కోట్ల చిత్రంగా నిలిచింది. డాకు మహరాజ్ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహించారు. పక్కా యాక్షన్ మూవీగా తెరకెక్కించి మెప్పించారు.
ఈ చిత్రంలో బాలకృష్ణ.. సీతారామ్, నానాజీ, డాకు మహరాజ్ అంటూ మూడు గెటప్‍ల్లో కనిపించారు. యాక్షన్‍తో అదరగొట్టారు. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా ఈ చిత్రంలో ముఖ్యమైన రోల్స్ చేశారు. బాబీ డియోల్ విలన్‍గా నటించగా.. చాందినీ చౌదరి, దీప్‍రాజా రాణా, షైన్ టామ్ చాకో, ఆడుకాలం నరేన్, రిషి, రవికిషన్, సచిన్ ఖేడెకర్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. తనకు సూపర్ మ్యూజిక్ ఇస్తున్న థమన్‍కు తాజా ఓ లగ్జరీ కారును కూడా బాలయ్య బహుమతిగా ఇచ్చారు. ఇక డాకు మహరాజ్ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లు నిర్మించాయి.
సంబంధిత కథనం