



Best Web Hosting Provider In India 2024

Fat Burning: కొవ్వు కరిగించడానికి ఏది బెటర్? భోజనానికి ముందు నడవడమా.. భోజనం తర్వాత నడవడమా?
Fat Burning: మనలో కొంతమంది తిన్న తర్వాత నడుస్తారు, మరికొందరు తినకముందే నడుస్తారు. ఇందులో ఏ సమయంలో వాకింగ్ చేస్తే ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయో తెలుసా? ఉత్తమమైన ఫలితం కోసం ఏది చేయాలి?
వ్యాయామం అనే ప్రక్రియలో వాకింగ్ చేయడం చాలా ఉత్తమమైన పని. ఇది మీ కేలరీలను సునాయాసంగా ఖర్చు అయ్యేలా చేస్తుంది. ఒత్తిడిని తగ్గించడంతో పాటు, మెటబాలిజం పెంచి, కండరాలను మంచి షేప్ లోకి మారుస్తుంది. మీ వెయిట్ లాస్ జర్నీలో వాకింగ్ అనేది మరిన్ని ప్రయోజనాలను చేకూరుస్తుంది.
వాకింగ్ చేయడంలో భిన్న అభిప్రాయాలు కనిపిస్తుంటాయి. కొందరు ఖాళీ కడుపుతో నడిస్తే, మరికొందరు తిన్న తర్వాత నడుస్తారు. మీరెప్పుడైనా ఆలోచించారా.. వాస్తవానికి ఏ సమయంలో వాకింగ్ చేస్తే వెయిట్ లాస్ ఎక్కువగా ఉంటుందనేది? ఈ రెండు సందర్భాల్లో ఎప్పుడు వాకింగ్ చేసినా కూడా కేలరీలు ఖర్చవుతాయి. కానీ, నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. ఏది ఉత్తమమనేది ఓసారి చూసేద్దామా?
ఎవరైనా బరువు తగ్గాలని చూస్తున్నప్పుడు, ఉపవాసంతో ఉండి నడవటం మంచిది. దీన్ని ‘ఉపవాస కార్డియో’ అని కూడా పిలుస్తారు. ఒకరు సాధారణంగా ఆరోగ్యంగా ఉంటే, తక్కువగా తిన్న తర్వాత నడవడం వారి రోజువారీ అలవాట్లలో భాగంగా ఉండవచ్చు.
ఉపవాసంతో నడక ఎలా సహాయపడుతుంది..
నడవడం మొదలుపెడితే శరీరం నిల్వ అయిన కొవ్వును శక్తిగా ఉపయోగించడానికి ప్రేరేపిస్తుంది. మామూలుగా ఆహారంలో ఉండే గ్లూకోజ్ అందుబాటులో లేకపోవడం వల్ల, కొవ్వును కరిగించుకొని గ్లూకోజ్ గా మార్చుకుంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గితే, కాలేయం గ్లైకోజన్ ను గ్లూకోజ్ గా విడదీస్తుంది. ఇది మజిల్స్‌కు శక్తిని అందిస్తుంది. నిద్రలో కూడా కాలేయం గ్లూకోజ్ ను రక్తప్రసరణలో విడుదల చేస్తుంది. అందువల్ల, శరీరంలో గ్లైకోజన్ నిల్వలు ఉదయానికి తక్కువగా ఉంటాయి. అందువల్ల, ఉపవాస స్థితిలో వ్యాయామం చేసినప్పుడు శరీరం మరింత కొవ్వును శక్తిగా ఉపయోగిస్తుంది. ఇలా కొవ్వు కరగడం వల్ల బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
భోజనం తరువాత నడక
భోజనం తరువాత నడక కూడా ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. భోజనం తరువాత నడిస్తే, ఆహారంతో తీసుకున్న గ్లూకోజ్ ను శరీరం శక్తిగా ఉపయోగిస్తుంది. అందువల్ల, ఇది రక్తంలో చక్కెర పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది డయాబెటిస్ లేదా ఇన్సులిన్ తో బాధపడుతున్న వారికి సహాయపడుతుంది.
ఎంత సేపు నడవాలి?
బరువు తగ్గడంతో ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు, ప్రతిరోజూ 30 నుండి 60 నిమిషాలు నడవండి. మొత్తంగా, బరువు తగ్గేందుకు కేవలం వ్యాయామం మాత్రమే కాదు. మీరు ఆరోగ్యకరమైన జీవనశైలిని కూడా కొనసాగించాలి. మంచి నిద్ర పొందడం, క్యాలరీలను ఖర్చు చేయడం కూడా అవసరం. ఉపవాసంతో ఉన్నప్పటి నడక కొవ్వును ఎక్కువగా కరిగించవచ్చు.
నడిచే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- వాకింగ్ చేయాలనుకుంటే, సరైన బూట్లు లేదా పాదరక్షలు ధరించాలి.
- నడవడానికి వెళ్లే ముందు పాలు లేదా నీరు వంటి పానీయాలను తీసుకోవడం మంచిది. తద్వారా హైడ్రేట్ గా ఉండగల్గుతారు.
- నడవడానికి వెళ్లే ముందు వార్మప్ చేయడం మంచిది. ఈ విధంగా చేయడం వల్ల మజిల్స్ లూజ్ అవుతాయి.
- నడక వేగాన్ని మితంగా ఉంచుకుని, శ్వాసను నియంత్రణలో ఉంచుకోండి. ఫలితంగా శరీరంపై ఎలాంటి ఒత్తిడి రాకుండా ఉంటుంది.
సంబంధిత కథనం