



Best Web Hosting Provider In India 2024

Medchal Murder: నడిరోడ్డుపై అన్నను కత్తులతో పొడిచి చంపిన తమ్ముళ్లు, మేడ్చల్ జాతీయ రహదారిపై దారుణం.. వీడియో వైరల్
Medchal Murder: మేడ్చల్ జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం దారుణ ఘటన జరిగింది. కుటుంబ వివాదాలతో సొంత అన్నను తమ్ముళ్లు నడి రోడ్డుపై పొడిచి చంపారు. ఈ హత్యను ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ప్రాణాలు పోయే వరకు కత్తులతో పొడిచి, తీరిగ్గా వెళ్లిపోయాడు.
Medchal Murder: మేడ్చల్ జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం దారుణ హత్య జరిగింది. తొడబుట్టిన అన్నను కుటుంబ వివాదాల నేపథ్యంలో సొంత తమ్ముళ్లు కత్తులతో పొడిచి చంపేశారు. ఆ మార్గంలో వెళ్లే వారు ఎవరు హత్యను అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. కొందరు వీడియోలు తీయడంతో అది వైరల్‌గా మారింది. మద్యం సేవించి కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నందుకు తమ్ముళ్లు చంపేసినట్టు పోలీసులు తెలిపారు.
మేడ్చర్ నేషనల్ హైవే 44పై ఆదివారం మధ్యాహ్నం దారుణం జరిగింది. ఓ వ్యక్తిని అంతా చూస్తుండగానే కొందరు యువకులు వెంటాడి పొడిచి చంపారు. కింద పడిపోయిన వ్యక్తి ప్రాణాలు పోయే వరకు కత్తులతో పొడుస్తూనే ఉన్నారు. ఈ దారుణాన్ని ఒక్కరు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.
నిందితులను మృతుడి సొంత తమ్ముడు, చిన్నాన్న కుమారుడిగా గుర్తించారు. ఇంట్లో నుంచి వెంట పడి, కత్తులతో పొడిచి చంపడం చూసిన వారిని భీతావహుల్ని చేసింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమారంపేటకు చెందిన గుగు లోత్ గన్యా మేడ్చల్ ఆర్టీసీ డిపోలో బస్ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. గన్యాకు ఇద్దరు కుమారులు ఉమేశ్, రాకేశ్‌తో పాటు ఒక కుమార్తె హరిణి ఉన్నారు.
గన్యా కుటుంబం మేడ్చల్ ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటోంది. మృతుడు ఉమేశ్‌కు భార్య ప్రియాంక, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. కొంత కాలంగా మద్యానికి బానిసగా మారిన ఉమేశ్ తరచూ కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడు. ఇంట్లో వారిపై కూడా పలుమార్లు దాడులు చేశాడు.
కొద్ది రోజుల క్రితం తల్లి దండ్రులతో పాటు తమ్ముడు రాకేశ్, అతడి భార్యపై దాడి చేశాడు. ఆదివారం మద్యం సేవించి మళ్లీ గొడవకు దిగాడు. ఉమేశ్ తీరుతో విసిగిపోయిన రాకేశ్, అతడి చిన్నాన్న కుమారుడు లక్ష్మణ్, మరో ముగ్గురు స్నేహితులు వాదనకు దిగారు.
ఈ క్రమంలో వారిపై ఉమేశ్ బీరు సీసాతో దాడి చేశాడు. దీంతో వారు ఎదురుదాడి చేశారు. భయంతో ఉమేశ్ ఇంట్లో నుంచి వీధిలోకి పరుగెత్తుకుంటూ వచ్చి జాతీయ రహదారిపైకి చేరుకున్నాడు. కోపం చల్లారని రాకేశ్, లక్ష్మణ్ అతడిని వదిలి పెట్టలేదు.
రోడ్డుపై పట్టుకుని కత్తులతో కసిదీరా పొడవడంతో ఉమేశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలిసి ఉమేశ్ తల్లి, భార్య, పిల్లలు ఘటనా స్థలా నికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించడం అందర్నీ కలచివే సింది. నిందితులు రాకేశ్, లక్ష్మణ్ పరారీలో ఉన్నారు. ఈ కేసులో మరో ముగ్గురు నవీన్, నరేశ్, సురేశ్ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, సీఐ సత్యనారాయణలు తెలిపిన వివరాల ప్రకారం.మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, సీఐ సత్యనారాయణలు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
టాపిక్