Best Web Hosting Provider In India 2024

Gunde Ninda Gudi Gantalu Serial: సంజు టార్చర్ – పుట్టింటికొచ్చిన మౌనిక – మనోజ్ సీక్రెట్ బయటపెట్టిన శృతి
Gunde Ninda Gudi Gantalu Serial: గుండె నిండా గుడి గంటలు ఫిబ్రవరి 17 ఎపిసోడ్‌లో మౌనిక చేత సంజు జాబ్ మానేయించాడని బాలు అనుమానపడతాడు. నిజం తెలుసుకోవడానికి సంజు ఇంటికి బయలుదేరుతాడు. కానీ మౌనికనే సడెన్‌గా పుట్టింటికి వస్తుంది. సంజు తనను బాగా చూసుకుంటున్నాడని అబద్ధం చెబుతుంది
Gunde Ninda Gudi Gantalu Serial: కారు కొనడానికి మనోజ్ పనిచేస్తున్న షోరూమ్‌కు వెళతారు రవి, శృతి. కానీ అక్కడ మనోజ్ పేరుతో ఎవరూ పనిచేయడం లేదని షోరూమ్ ఎంప్లాయిస్ చెబుతారు. మనోజ్‌కు ఫోన్ చేస్తాడు రవి. కొత్తగా జాబ్‌లో జాయిన్ అయిన ఉద్యోగులు తనను గుర్తుపట్టలేదని, తానే హెడ్ ఆఫీస్‌లో ఉన్నానని అబద్దం చెప్పి తప్పించుకుంటాడు మనోజ్.
నిజం తెలిస్తే…
ఇంటికొచ్చిన మనోజ్తో అడ్డంగా నువ్వు దొరికిపోయావనుకున్నానని ప్రభావతి అంటుంది. నిన్ను బాలుతో పాటు రోహిణి కూడా బోనులో నిలబెట్టి ఆడుకునేవారని అంటుంది. ముఖ్యంగా శృతికి ఈ నిజం తెలిస్తే మోసం చేశానని తనకు రోహిణికి విడాకులు ఇప్పించిన ఇప్పిస్తుందని మనోజ్ కంగారుపడతాడు. ఏదో ఒక ఉద్యోగం మాత్రం వెతుక్కోమని కొడుకుకు సలహా ఇస్తుంది. అప్పుడే రోహిణి ఇంట్లోకి రావడంతో టాపిక్ మార్చేస్తారు.
బాలు కంగారు…
ట్రిప్ వెళ్లకుండా బాలు ఇంటికొస్తాడు. డల్‌గా కనిపించడంతో ఏమైందని భర్తను అడుగుతుంది మీనా. మౌనిక పనిచేసే ఆఫీస్‌కు వెళ్లానని, కానీ తను జాబ్ మానేసిందని వాళ్లు చెప్పారని బాలు అంటాడు. మౌనిక ఎలా ఉందో ఇప్పుడే తెలుసుకుంటానని సంజు ఇంటికి బయలుదేరబోతాడు. అతడిని ప్రభావతి, సత్యం ఆపేస్తారు.
గొడవలు…
మౌనికను నువ్వు కలవాలని ఎందుకు అనుకుంటున్నావు? పెళ్లిలో నీ వల్ల జరిగిన గొడవలు చాలవా? అంటూ కొడుకుపై ప్రభావతి ఫైర్ అవుతుంది. అలాంటి గొప్పవాళ్లకు మౌనిక జీతంతో ఏం పని అని తల్లి మాటలకు మనోజ్ సపోర్ట్ చేస్తాడు. వాళ్లు ఎంత గొప్పవాళ్లో నువ్వు చూశావా? వాళ్లు ఎలాంటివాళ్లో నాకు తెలుసు అని శృతి అంటుంది. శృతి ఇంటికి బాలు వెళ్లొద్దని ప్రభావతి, మనోజ్, రోహిణి పట్టుపడతారు. నువ్వు సంజు ఇంటికి వెళ్లి గొడవలు పడితే మౌనికను ఇంట్లో నుంచి వెళ్లగొడతారని ప్రభావతి అంటుంది.
ఈ విషయంలో బాలునే కరెక్ట్ అని, నేను, రవి కూడ అతడి వెంట మౌనిక ఇంటికి వెళతామని శృతి అంటుంది.
మౌనిక ఎంట్రీ…
అప్పుడే మౌనిక ఎంట్రీ ఇస్తుంది. ఆమెను చూడగానే అందరూ ఆనందపడతారు. ఎలా ఉన్నావని, సంజు నిన్ను ఎలా చూసుకుంటున్నాడని మౌనికపై ప్రశ్నల వర్షం కురిపిస్తారు. నేను మహారాణిలా ఉన్నానని, సంజు బాగా చూసుకుంటున్నాడని మౌనిక అబద్ధం ఆడుతుంది. మా ఫ్యామిలీ బిజినెస్ అకౌంట్స్ చూస్తున్నానని, అందుకే జాబ్ మానేశానని మౌనిక అంటుంది. సంజు తనను ఇష్టపడి పెళ్లిచేసుకుంటున్నాడని చెబుతుంది. మౌనిక అబద్ధం చెబుతుందని శృతి కనిపెడుతుంది.
ప్లేట్ లాక్కున్న ప్రభావతి…
శృతికి అన్నం తినిపిస్తానని మీనా అంటుంది. ఆమె చేతిలో నుంచి ప్లేట్ లాక్కుంటుంది ప్రభావతి. తాను తినిపిస్తానని చెబుతుంది. మౌనికను నువ్వు కన్నతల్లి అనే విషయం ఇప్పుడు గుర్తొచ్చిందా బాలు సెటైర్లు వేస్తాడు. సంజు తనకు చేసిన అవమానాలు గుర్తొచ్చి మౌనిక కన్నీళ్లు పెట్టుకుంటుంది.
ఏమైందని, ఎందుకు ఏడుస్తున్నావని ప్రభావతి అడుగుతుంది. మౌనిక సమాధానం చెప్పదు.బాలు మాటవినకుండా సంజును పెళ్లిచేసుకున్నందుకు కష్టాలు అనుభవిస్తున్నానని మనసులో మౌనిక బాధపడుతుంది.
సంజు ప్రశ్నలు…
మౌనిక ఇంట్లో అడుగుపెట్టగానే ఎక్కడికి వెళ్లావని టార్చర్ మొదలుపెడతాడు సంజు. మొక్కు కోసం తానే గుడికి పంపించానని కోడలికి సువర్ణ సపోర్ట్ చేస్తుంది. గుడికి వెళ్లింది అబద్ధం అని తెలితే చంపేస్తానని మౌనికకు సంజు వార్నింగ్ ఇస్తాడు. మౌనిక గుడికి వెళ్లింది నిజమో కాదో తెలుసుకోవడానికి డ్రైవర్‌ను పిలుస్తాడు సంజు. మౌనికను ఎక్కడికి తీసుకెళ్లావని డ్రైవర్‌ను అడుగుతాడు. గుడికే తీసుకెళ్లానని డ్రైవర్ అంటాడు.గుడికే వెళితే ప్రసాదం ఏదని మౌనికను ప్రశ్నిస్తాడు. కారులో ఉందని డ్రైవర్ తీసుకొచ్చిఇస్తాడు.
భయం పోయిందా…
గుడికి వెళితే నాకు ఎందుకు చెప్పలేదని సంజు అంటాడు. వీడికేంటి చెప్పేది ఏంటి అని లోకువ తీసుకున్నావా…భయం మొత్తం పోయిందా అని నీలకంఠం వార్నింగ్ ఇస్తాడు. ఇక నుంచి ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టాలంటే నన్ను అడగాలని సంజు హెచ్చరిస్తాడు. సువర్ణను ప్రసాదం ఇచ్చి తనను కాపాడిందని తెలిసి అత్తయ్యకు కృతజ్ఞతలు చెబుతుంది మౌనిక.
నేను ఇక్కడ సంతోషంగా ఉన్నానని మా వాళ్లు అనుకుంటున్నారు…ఇదంతా అబద్ధం అని తెలిస్తే వాళ్లు ఏమైపోతారో, ఎన్ని గొడవలు జరుగుతయోనని మౌనిక అంటుంది. నీకు అంత మంచే జరుగుతుందని సువర్ణ సర్ధిచెబుతుంది.
బయటపడ్డ సీక్రెట్…
ఈ రోజు మనోజ్ గురించి ఓ సీక్రెట్ తెలిసిందని శృతి, రవి అంటారు. పార్క్ సంగతి తెలిసిపోయిందా అని నోరుజారుతాడు మనోజ్. పార్క్ ఏంటి అని రవి అడుగుతాడు. నిజం బయటపడకుండా టాపిక్ డైవర్ట్ చేస్తుంది ప్రభావతి. షోరూమ్‌కు వెళితే మనోజ్ ఎవరో తెలియదని అన్నారని, హెడ్ ఆఫీస్ నుంచి మనోజ్ ఫోన్ చేసి వాళ్లకు ఇచ్చిపడేశాడని రవి అంటాడు. తన బిల్డప్పులు వర్కవుట్ కావడంతో మనోజ్ ఆనందపడతాడు.
డబ్బు ఇచ్చిన శృతి..
మనోజ్ బట్టలు ఉతకమని మీనాకు ఇస్తుంది రోహిణి. అత్తయ్య చేత ఉతికించుకోమని మీనా బదులిస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన శృతి కూడా తన బట్టలు ఉతకమని మీనాకు ఇస్తుంది. అందుకు డబ్బులు కూడా ఇస్తానని రెండు వేలు చేతిలో పెడుతుంది. శృతి మాటలతో మీనా మనసు గాయపడుతుంది. పొగరు బాగా దిగినట్లుందని మీనాపై సెటైర్లు వేస్తుంది ప్రభావతి. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం
టాపిక్