రంగరాజన్‌కు వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ చెవిరెడ్డి ప‌రామ‌ర్శ‌

Best Web Hosting Provider In India 2024

హైద‌రాబాద్‌: ఇటీవల దాడికి గురైన చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్‌ రంగరాజన్‌ను, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పరామర్శించారు. మాజీ సీఎం, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశం మేరకు ఆదివారం రంగరాజన్‌ను కలుసుకున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, దాడి ఘటన వివరాలు ఆరా తీశారు. ఆయన యోగక్షేమాలు తెలుసుకున్నారు. జగన్‌గారు వారికి పూర్తి అండగా ఉంటామని చెప్పమన్నారని తెలిపారు. అలాగే రంగరాజన్‌గారి తండ్రి సౌందరరాజన్‌ గారిని కూడా కలిసిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. తనకు వైయస్‌ రాజశేఖర్‌రెడ్డిగారు ఎంతో సన్నిహితులన్న సౌందరరాజన్‌గారు, ఈ సందర్భంగా ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేశారు.

Best Web Hosting Provider In India 2024