



Best Web Hosting Provider In India 2024

Kiran Abbavaram: వాటికన్నా చాలా బాగుంటుందిలే: హీరోయిన్‍కు కిరణ్ అబ్బవరం కౌంటర్
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన దిల్‍రూబా నుంచి మరో పాట రెడీ అయింది. అయితే, ఈ సాంగ్ గురించి హీరోయిన్ ఓ ట్వీట్ చేశారు. దీనికి కిరణ్ సరదాగా అదిరిపోయే రిప్లై ఇచ్చారు.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, రుక్సర్ థిల్లాన్ జంటగా నటించిన దిల్‍రూబా చిత్రంపై మంచి బజ్ ఉంది. గతేడాది ‘క’ సినిమాతో కిరణ్ బ్లాక్‍బస్టర్ కొట్టారు. దిల్‍రూబా చిత్రంపై కూడా ముందు నుంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ప్రమోషనల్ కంటెంట్ కూడా ఇప్పటికి వరకు ఆకట్టుకుంది. ఫిబ్రవరి 14న విడుదల కావాల్సిన ఈ చిత్రం మార్చి 14కు వాయిదా పడింది. అయితే, దిల్‍రూబా నుంచి ‘హే జింగిలి’ అంటూ రెండో పాట వచ్చేస్తోంది. ఈ పాటపైనే హీరోయిన్ రుక్సర్ ట్వీట్ చేయగా.. కిరణ్ అబ్బవరం రియాక్ట్ అయ్యారు.
ఏం దొరకనట్టు ఇది ఏంటి!
దిల్‍రూబా నుంచి హే జింగిలి పాట నేటి (ఫిబ్రవరి 17) సాయంత్రం 5.01 గంటలకు రిలీజ్ కానుంది. దీనికోసం ఓ పోస్టర్ కూడా మూవీ టీమ్ తీసుకొచ్చింది. అయితే, హే జింగిలి ఏంటి అంటూ హీరోయిన్ రుక్సర్ థిల్లాన్ ట్వీట్ చేశారు. “ఓయ్ కిరణ్ అబ్బవరం.. ఇంకేం దొరకనట్టు.. బుజ్జి, బంగారం కాకుండా, ఈ జింజిలి.. జింగిలి ఏంటి?” అని సరదాగా రుక్సర్ పోస్ట్ చేశారు.
కిరణ్.. సరదా కౌంటర్
ఈ మధ్య పిలుచుకునే కొన్ని ముద్దు పేర్ల కంటే ఈ జింగిలి చాలా బాగుంటుందని కిరణ్ అబ్బవరం రిప్లై ఇచ్చారు. “ఈ మధ్య జనాలు పిలుచుకునే కూకీ, వైఫూ లాంటి వాటికన్నా జింగిలి చాలా బాగుంటుందిలే” అని కిరణ్ సరదాగా కౌంటర్ ఇచ్చారు. పాటకు ప్రమోషన్‍లో భాగంగానే కిరణ్, రుక్సర్ ఇలా ట్వీట్లు చేసుకున్నారని అర్థమవుతోంది.
దిల్‍రూబా చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అగ్గిపుల్లే పాట మెప్పించింది. ఇప్పుడు హే జింగిలి సాంగ్ వస్తోంది. ఈ మూవీ టీజర్లోనే బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ బాగా అట్రాక్ట్ చేసింది. టీజర్ థీమ్ మెలోడియస్‍గా సాగింది. ‘క’ చిత్రానికి మంచి సంగీతం ఇచ్చిన సామ్.. మరోసారి కిరణ్‍కు అదిరిపోయే ట్యూన్ ఇస్తున్నట్టు అర్థమవుతోంది.
దిల్‍రూబా చిత్రానికి విశ్వకరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతోనే దర్శకుడిగా విశ్వ పరిచయం అవుతున్నారు. ఈ మూవీని శివం సెల్యులాయిడ్, సరిగమ బ్యానర్లు ప్రొడ్యూజ్ చేస్తున్నారు. వాలైంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ముందుగా ప్లాన్ చేశారు. అయితే, హోలీ పండుగ ఉన్న మార్చి 14వ తేదీన ఈ చిత్రం విడుదల వాయిదా పడింది. ఈ మూవీపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.
సంబంధిత కథనం