



Best Web Hosting Provider In India 2024

OTT Telugu Comedy Movie: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హెబ్బా పటేల్ కామెడీ డ్రామా.. రెండు వారాల్లోనే రికార్డు వ్యూస్
OTT Telugu Comedy Movie: ఓటీటీలో ఇప్పుడో తెలుగు కామెడీ డ్రామా దుమ్ము రేపుతోంది. హెబ్బా పటేల్ నటించిన ఈ సినిమా రెండు వారాల కిందట అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది.
OTT Telugu Comedy Movie: ఓటీటీలో తెలుగు కామెడీ డ్రామాలకు ఎంతటి క్రేజ్ ఉంటుందో తాజాగా రిలీజైన ధూమ్ ధామ్ మూవీ నిరూపిస్తోంది. జనవరి 31న అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చిన ఈ సినిమా.. రెండు వారాల్లోనే రికార్డు స్ట్రీమింగ్ మినట్స్ సొంతం చేసుకోవడం విశేషం. చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటించిన సినిమా ఇది.
ఓటీటీలో ధూమ్ ధామ్ రికార్డు
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ధూమ్ ధామ్ మూవీ రెండు వారాల్లోనే 40 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు అందుకుంది. జనవరి 31 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండా సడెన్ గా ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు.
థియేటర్లలో రిలీజైన సుమారు మూడు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ సాధించలేకపోయినా.. ఓటీటీలో మాత్రం దుమ్ము రేపుతోంది. తెలుగులో మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ఈ సినిమా హిందీ వెర్షన్ ను నేరుగా ఓటీటీలోకే తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ త్వరలోనే రానుంది.
ధూమ్ ధామ్ మూవీ గురించి..
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ నటించిన ధూమ్ ధామ్ మూవీ గతేడాది నవంబర్ 8న థియేటర్లలో రిలీజైంది. సాయి కిశోర్ మచ్చ మూవీని డైరెక్ట్ చేయగా.. రామ్ కుమార్ మద్దినేని నిర్మించాడు. వెన్నెల కిషోర్, సాయికుమార్, గోపరాజు రమణతో పాటు పలువురు టాలీవుడ్ కమెడియన్లు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. గోపిమోహన్ కథ, స్క్రీన్‌ప్లేను సమకూర్చాడు.
వల్గారిటీ, డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా క్లీన్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా డైరెక్టర్ ఈ మూవీని తెరకెక్కించాడు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ ఆడియెన్స్‌ను మెప్పించింది. కానీ కాన్సెప్ట్ పాతది కావడం, టేకింగ్‌లో కొత్తదనం మిస్సవ్వడంతో బాక్సాఫీస్ వద్ద మూవీ యావరేజ్‌గా నిలిచింది.
తండ్రీకొడుకుల కథ…
రామరాజుకు (సాయికుమార్) కొడుకు కార్తీక్ (చేతన్ కృష్ణ)అంటే ప్రాణం. కొడుకు సంతోషం కోసం ఏం చేయడానికైనా వెనుకాడడు. కార్తీక్ కూడా తండ్రే లోకంగా బతుకుంటాడు. అలాంటి కార్తీక్ లైఫ్‌లోకి సుహానా (హెబ్బా పటేల్) వస్తుంది. గొడవలతో మొదలైన కార్తీక్, సుహానా పరిచయం ప్రేమగా మారుతుంది.
ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఆ టైమ్‌లోనే రెండు కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయనే నిజం బయటపడుతుంది. ఆ గొడవలకు కారణం ఏమిటి? సుహానా ఫ్యామిలీకి రామరాజు, కార్తీక్ ఎలాంటి ద్రోహం తలపెట్టారు? సుహానా ప్రేమను కార్తీక్ ఎలా గెలుచుకున్నాడు అన్నదే ధూం ధాం మూవీ కథ.
గ్లామర్ రోల్…
ధూం ధాం మూవీలో హెబ్బా పటేల్ గ్లామర్ రోల్‌లో కనిపించింది. డైరెక్టర్ మారుతి నిర్మించిన రోజులు మారాయి మూవీతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు చేతన్ కృష్ణ. ఫస్ట్ ర్యాంక్ రాజు, గల్ఫ్, బీచ్ రోడ్ చేతన్ సినిమాలు చేశాడు. కానీ ఈ సినిమాలేవి అతడికి విజయాల్ని తెచ్చిపెట్టలేకపోయాయి.
హెబ్బా పటేల్ కూడా కమర్షియల్ హిట్ అందుకొని చాలా కాలమైంది. ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా తెలుగులో వరుసగా అవకాశాల్ని అందుకుంటోంది. శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన పలు సినిమాలకు గోపీమోహన్ కథను అందించారు.
సంబంధిత కథనం