



Best Web Hosting Provider In India 2024

పొట్ట నొప్పి, మెడ నొప్పి తరచూ వస్తుంటే పాదాల్లోని ఈ ప్రాంతంలో మసాజ్ చేయండి, ఆక్యుప్రెషర్ పాయింట్ ఎక్కడంటే
పొట్ట, మెడ నొప్పులతో బాధపడుతున్నారా? మీ పాదాలపై ఉన్న ఈ ప్రెషర్ పాయింట్లకు మసాజ్ చేయడం ద్వారా ఉపశమనం పొందండి. ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది.
మన శరీరంలో అనేక ప్రెషర్ పాయింట్లు ఉంటాయి. వీటిని నొక్కితే చాలా రకాల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. అందుకే ఎంతో మంది ఆక్యుప్రెషర్ ద్వారా చికిత్సను తీసుకుంటూ ఉంటారు. మహిళల్లో కడుపు నొప్పి చాలా సాధారణం. అలాగే, నిరంతరం కూర్చుని పనిచేయడం వల్ల సెర్వికల్, భుజాల నొప్పులు కూడా చాలా మందిని బాధిస్తూ ఉంటాయి. ఈ రకమైన నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి అనేక వ్యాయామాలు సహాయపడతాయి. అలాగే, మీరు మీ పాదాలపై ఉన్న ఈ ప్రెషర్ పాయింట్ల గురించి తెలుసుకుని మసాజ్ చేస్తే కూడా ఉపశమనం లభిస్తుంది. పొట్ట నొప్పి నుండి ఉపశమనం పొందడానికి పాదాల్లో ఏ ప్రెషర్ పాయింట్లకు మసాజ్ చేయాలో తెలుసుకుందాం.
పాదాల మధ్యలో ఉన్న ప్రెషర్ పాయింట్
పాదాల వైపు, పాదం ఆర్క్ ప్రాంతం ఉండే చోట, మధ్యలోనే మసాజ్ పాయింట్ ఉంటుంది. ఈ పాయింట్‌ను నొక్కి, తేలికపాటిగా చేతులతోనే మసాజ్ చేయడం వల్ల కడుపు నొప్పి నుండి ఉపశమనం లభించవచ్చు. నిజానికి, ఈ ప్రాంతం నేరుగా వెన్నెముకతో అనుసంధానించి ఉంటుంది. ఈ ప్రాంతాన్ని బొటనవేలు, ఇతర చేతి వేళ్ల సహాయంతో నొక్కితే ఉపశమనం లభిస్తుంది.
మెడనొప్పి నుండి
మెడ నొప్పితో బాధపడుతున్నారా? అయితే, మీ పాదాల బొటనవేలు, దాని పక్కన ఉన్న వేలును కలిపి నొక్కండి. దీన్ని నొక్కడం వల్ల మెడ నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. బొటనవేలు, చూపుడు వేలి సహాయంతో, పాదాల బొటనవేలు నుండి అంచుల వరకు నొక్కి మసాజ్ చేయడం వల్ల శరీరంలోని నొప్పుల నుండి ఉపశమనం లభించవచ్చు.
మన శరీరంలో దాదాపు 30 ఆక్యుప్రెషర్ పాయింట్లు ఉంటాయి. ఇవి జీర్ణక్రియ నుంచి పొట్ట నొప్పి వరకు అనేక రకాల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి. ఆక్యుప్రెషర్ అనేది కొన్ని నరాలను ఉత్తేజపరచడం వల్ల నొప్పి అనుభూతిని తగ్గిస్తారు. ఎన్నో పరిశోధనలు కూడా ఆక్యుప్రెషర్ మసాజ్ వల్ల కార్టిసాల్ హార్మోను స్థాయిలను తగ్గిస్తుందని కూడా నిరూపించాయి. ఇవి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఆక్యుప్రెషర్ అనేది రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం