



Best Web Hosting Provider In India 2024

Jaali Reddy Wedding: భార్య కాళ్లు మొక్కిన పుష్ప మూవీ విలన్.. వైరల్ అవుతున్న వీడియో
Jaali Reddy Wedding: పుష్ప మూవీలో జాలిరెడ్డి అనే క్రూరమైన విలన్ గా కనిపించిన కన్నడ నటుడు రియల్ లైఫ్ లో చేసిన ఓ పని ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ మధ్య పెళ్లి చేసుకున్న అతడు తన భార్య కాళ్లు మొక్కుతున్న వీడియో అది.
Jaali Reddy Wedding: పుష్ప మూవీలో జాలి రెడ్డి పాత్ర పోషించిన నటుడు గుర్తున్నాడు కదా. ఆ సినిమాలో ఎంతో క్రూరమైన, అమ్మాయిలను వేధించే పాత్రలో కనిపించిన ఈ నటుడి పేరు ధనంజయ. ఈ కన్నడ నటుడు రియల్ లైఫ్ లో మాత్రం అమ్మాయిలను ఎంతో గౌరవించే వాడని తాజాగా వైరల్ అవుతున్న వీడియో చూస్తే స్ఫష్టమవుతోంది.
భార్య కాళ్లు మొక్కిన జాలి రెడ్డి అలియాస్ ధనంజయ
కన్నడ నటుడు ధనంజయ ఈ మధ్యే పెళ్లి చేసుకున్న విషయం తెలుసు కదా. డాక్టర్ అయిన ధన్యంత గౌరక్లర్ ను మైసూరులో ఫిబ్రవరి 15న అతడు పెళ్లి చేసుకున్నాడు. వీళ్ల పెళ్లి కొందరు సన్నిహితుల సమక్షంలోనే జరిగింది. రెండు రోజులుగా ధనంజయ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
అయితే తాజాగా అతనికి సంబంధించిన ఓ వీడియో మాత్రం బాగా వైరల్ అవుతోంది. అందులో ధనంజయ తన భార్య ధన్యంత కాళ్లు మొక్కడం విశేషం. పెళ్లి తర్వాత తన కాళ్లు మొక్కడానికి భార్య ప్రయత్నించగా.. అతడు వద్దని వారించాడు. చివరికి సరే అన్నాడు. అయితే ఆమె తన కాళ్లు మొక్కిన వెంటనే అతడు కూడా ఆమె కాళ్లు తాకడం విశేషం.
రియల్ లైఫ్ జాలి రెడ్డి వేరు..
పుష్ప మూవీలో జాలి రెడ్డి పాత్ర చాలా క్రూరంగా ఉంటుంది. బలవంతంగా అమ్మాయిలను అనుభవించే పాత్ర అది. అలాంటి పాత్ర పోషించిన ధనంజయ.. రియల్ లైఫ్ లో మాత్రం అమ్మాయిలను ఇంతలా గౌరవిస్తాడా అంటూ అభిమానులు ఈ వీడియో చూసి కామెంట్స్ చేస్తున్నారు.
ధనంజయ, ధన్యంత నిశ్చితార్థం గతేడాది నవంబర్ లో జరిగింది. మూడు నెలల తర్వాత ఇప్పుడు ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. నిజానికి జీవితంలో అసలు పెళ్లి చేసుకోనని అతడు మొదట్లో అనుకున్నాడట. కానీ తల్లి ఒత్తిడి మేరకు మొత్తానికి ఓ ఇంటివాడయ్యాడు.
పుష్ప ది రైజ్ లో కనిపించిన జాలి రెడ్డి పాత్ర పుష్ప 2లో మాత్రం కనిపించలేదు. దీంతో కొందరు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అద్భుతమైన విలనీని పండించిన జాలి రెడ్డి పాత్రను సెకండ్ పార్ట్ లోనూ కొనసాగించాల్సిందని అభిప్రాయపడ్డారు.
ఇక ధనంజయ సినిమాల విషయానికి వస్తే.. అతడు ఉత్తరాకాండ అనే కన్నడ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది.