


Best Web Hosting Provider In India 2024
New FASTag Rules : అమల్లోకి ఫాస్ట్‌ట్యాగ్ కొత్త నిబంధనలు.. ఈ విషయాలు పాటించకపోతే ఫైన్
New FASTag Rules : ఫాస్ట్‌ట్యాగ్ కొత్త నిబంధనలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఫాస్ట్‌ట్యాగ్ కొత్త రూల్‌లో ఎలాంటి మార్పులు చేశారు? డబుల్ టోల్ ఛార్జీలను ఎలా నివారించవచ్చో తెలుసుకుందాం..
మీరు కూడా హైవేపై ప్రయాణించి ఫాస్ట్‌ట్యాగ్ ఉపయోగిస్తుంటే తప్పకుండా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఫిబ్రవరి 17 నుండి భారతదేశం అంతటా ఫాస్ట్‌ట్యాగ్ కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఇది డిజిటల్ టోల్ చెల్లింపులను సులభతరం చేయడం, మోసాన్ని అరికట్టడం, టోల్ ప్లాజాల వద్ద పొడవైన క్యూలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ), రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్టీహెచ్) ఈ కొత్త నిబంధనలను అమలు చేశాయి. ఫాస్ట్‌ట్యాగ్ కొత్త రూల్‌లో ఎలాంటి మార్పులు జరిగాయో చూద్దాం..
రెట్టింపు టోల్
ఫాస్ట్‌ట్యాగ్‌లో తగినంత బ్యాలెన్స్ లేకుండా ఉంటే అది బ్లాక్‌లిస్టులోకి వెళ్తుంది. టోల్‌ప్లాజా రీడర్ వద్దకు చేరుకొనే ముందు 60 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువసేపు ఫాస్ట్‌ట్యాగ్ ఇన్‌యాక్టివ్‌లోనే ఉంటే.. కోడ్ 176 ఎర్రర్ చూపిస్తుంది. లావాదేవీ విఫలమవుతుంది. చెల్లించిన టోల్ తిరస్కరిస్తారు. అంతేకాకుండా మీరు టోల్ చెల్లించిన పది నిమిషాల్లోనూ ఇన్‌యాక్టివ్‌లోకి వెళ్లినా.. మళ్లీ లావాదేవీలు రిజెక్ట్ అవుతాయి. ఇలాంటి సందర్భాల్లో వాహన యజమాని రెట్టింపు టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే తగినంత బ్యాలెన్స్ ఉంచుకోవాలి.
బ్లాక్ లిస్ట్
అకౌంట్‌లో తగినంత బ్యాలెన్స్ లేకపోవడం, కైవైసీ చేయకపోవడం, పెండింగ్‌లో ద్రువీకరణ, వాహన రిజిస్ట్రేషన్‌లో వ్యత్యాసం ఉంటే.. ఫాస్ట్‌ట్యాగ్ బ్లాక్‌లిస్టులోకి వెళ్తుంది. వాహనం ఫాస్ట్‌ట్యాగ్ 15 నిమిషాల్లో టోల్ ఫీజును ప్రాసెస్ చేయలేకపోతే.. అదనపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. లావాదేవీల్లో జాప్యం కారణంగా టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ పెరిగే సందర్భాలను ఇది నివారిస్తుంది.
టోల్‌ప్లాజా వద్ద ట్యాగ్‌ను స్కాన్ చేసిన 10 నిమిషాల్లో ఎవరైనా ఫాస్ట్‌ట్యాగ్‌ను రీచార్జ్ చేసుకుంటే పెనాల్టీ రీఫండ్ కోసం అభ్యర్థించవచ్చు. అంటే స్కాన్ చేసిన పది నిమిషాల తర్వాత బ్లాక్ లిస్టులో ఉంటే చెల్లింపు తిరస్కరిస్తారు. అలాగే ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్ మెుత్తం ఖర్చు అయిపోతే.. రీచార్జ్ చేసుకోవడానికి 70 నిమిషాల సమయం లభిస్తుంది. తద్వారా తన ఫాస్ట్‌ట్యాగ్‌కు బ్యాలెన్స్ జోడించవచ్చు. ఫాస్ట్‌ట్యాగ్ స్టేటస్ మార్చుకోవచ్చు. అంటే బ్లాక్ లిస్టులో ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. రెట్టింపు టోల్ ఛార్జీలను నివారించవచ్చు.
ఇలా చేయండి
ఫాస్ట్‌ట్యాగ్‌లో ఎల్లప్పుడూ తగినంత బ్యాలెన్స్ ఉంచండి. ప్రయాణాన్ని ప్రారంభించడానికి ముందు బ్యాలెన్స్ చెక్ చేయండి. మీకు తక్కువ బ్యాలెన్స్ సందేశం వచ్చిన వెంటనే రీఛార్జ్ చేయండి. తప్పుడు ఛార్జీ తగ్గింపు విషయంలో బ్యాంకును సంప్రదించండి. ఛార్జ్ బ్యాక్ నిబంధన కింద మీ మొత్తాన్ని తిరిగి పొందండి. లావాదేవీలో జాప్యం జరిగితే, వెంటనే రిపోర్ట్ చేయండి. టోల్స్‌పై అధిక ఛార్జీలు వసూలు చేయకుండా ఉండటానికి ఫాస్టాగ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి.
ఫాస్ట్‌ట్యాగ్
‘వన్ నేషన్ వన్ ట్యాగ్’ పథకం కింద 2019 డిసెంబర్‌లో ఫాస్ట్‌ట్యాగ్ ప్రారంభించారు. ఇది డిజిటల్ టోల్ చెల్లింపు వ్యవస్థ. టోల్ ప్లాజా వద్ద వాహనాలు నాన్‌స్టాప్‌గా వెళ్ళడానికి సులభతరం చేస్తుంది. టోల్ ప్లాజాల వద్ద సమయాన్ని ఆదా చేయడం, పారదర్శకత పాటించడం వంటివి ఉంటాయి.
ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక, జీవితకాల పాస్
కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రైవేట్ వాహన యజమానులకు ఫాస్టాగ్ వార్షిక, జీవితకాల పాస్‌లను జారీ చేయనుంది. వార్షిక పాస్‌కు సుమారు రూ.3,000 వరకు ఖర్చవుతుంది. అదే సమయంలో లైఫ్‌టైమ్ పాస్ ధర రూ .30,000 వరకు (15 సంవత్సరాలకు) ఉంటుంది. రిజిస్ట్రేషన్ నంబర్ ఫాస్ట్‌ట్యాగ్ జారీ చేసిన వాహనానికి మాత్రమే ఈ పాస్ వర్తిస్తుంది. ఇది హైవేపై ప్రయాణాన్ని మరింత చౌకగా, సౌకర్యవంతంగా చేస్తుంది.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link