Karthika Deepam Serial February 18: కార్తీక్ కొత్త ప్రయత్నం.. పోటీకి వచ్చిన జ్యోత్స్న.. గాడిదలు అరుస్తున్నాయంటూ పంచ్

Best Web Hosting Provider In India 2024

Karthika Deepam Serial February 18: కార్తీక్ కొత్త ప్రయత్నం.. పోటీకి వచ్చిన జ్యోత్స్న.. గాడిదలు అరుస్తున్నాయంటూ పంచ్

Karthika Deepam 2 Serial February 18 Today Episode: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. ఓ రెస్టారెంట్‍ను చేజిక్కించుకునే అవకాశం కార్తీక్‍కు వస్తుంది. అందుకోసం ప్రయత్నం మొదలుపెడతాడు. జ్యోత్స్న కూడా పోటీలో ఉంది. దీపను జ్యోత్స్న మాటలు అంటే.. కౌంటర్ ఇస్తాడు కార్తీక్. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.

 
Karthika Deepam Serial February 18th: కార్తీక్ కొత్త ప్రయత్నం.. పోటీకి వచ్చిన జ్యోత్స్న.. గాడిదలు అరుస్తున్నాయంటూ పంచ్
Karthika Deepam Serial February 18th: కార్తీక్ కొత్త ప్రయత్నం.. పోటీకి వచ్చిన జ్యోత్స్న.. గాడిదలు అరుస్తున్నాయంటూ పంచ్
 

కార్తీక దీపం 2 నేటి (ఫిబ్రవరి 18) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. కార్తీక్, దీప కలిసి తులసి కోట వద్ద దీపారాధన చేస్తారు. ఏం మొక్కుకున్నావో ఇప్పుడైనా చెప్పు అని కార్తీక్ అడుగుతాడు. మీ కోసమే బాబు అని దీప బదులిస్తుంది. మీకు మంచి అవకాశం వచ్చి.. ఎవరికీ అందనంత ఎత్తు ఎదగాలని మొక్కుకున్నానని దీప చెబుతుంది. దేవుడిని ఇంత గట్టిగా అడిగావంటే నీ కోరిక తీర్చకుండా ఉంటాడా, తప్పకుండా తీరుస్తాడని కార్తీక్ అంటాడు. శౌర్య ప్రాణాలు నిలిచేందుకు మీరే అని, ఆయన గెలుపుకు సాయంగా ఉండాలని మనసులో దేవుడిని కోరుకుంటుంది దీప.

 

అంతా డబ్బుతోనే ముడిపడింది

ఉదయాన్ని కార్తీక్‍కు కాఫీ తీసుకొస్తుంది దీప. ఇడ్లీ బండి దగ్గరికి నన్ను రానివ్వడం లేదు కదా.. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ పెట్టాలని అనుకుంటున్నానని దీపతో కార్తీక్ చెబుతాడు. బస్టాండ్ పక్కన ఓ ప్లేస్ చూసివచ్చానని, మున్సిపాలిటీ వాళ్లతో ఓ మాట చెప్పి బండి పెడితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నానని చెబుతాడు. లోన్ లాంటిది తీసుకొని రెస్టారెంట్ పెడితే అని దీప అంటే.. ఆస్తులో, నగలో షూరిటీగా పెట్టాల్సి ఉంటుందని కార్తీక్ బదులిస్తాడు. అందుకే ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ పెట్టి.. డబ్బు సంపాదించి.. రెస్టారెంట్ పెట్టాలని ఆలోచిస్తున్నానని కార్తీక్ అంటాడు. దానికి కూడా చాలా టైమ్ పడుతుందని, అంతా డబ్బుతోనే ముడిపడి ఉందని చెబుతాడు.

మేనేజర్ ఎంట్రీ.. కొత్త అవకాశం

మంచి అవకాశం రావాలని, ఆ దేవుడే ఏదో రూపంలో ఇవ్వాలని కార్తీక్ అంటాడు. ఇంతలో ‘ఇచ్చాడు సర్’ అంటూ జ్యోత్స్న కంపెనీ మేనేజర్ ప్రభాకర్ వస్తాడు. ఆఫీస్‍లో ఏదైనా ప్రాబ్లం ఉందా అని కార్తీక్ అడిగితే.. మీ దయ వల్ల ఎప్పటిలాగే ప్రశాంతంగా పని చేస్తున్నామని చెబుతాడు. మీ శత్రువు దివాళా తీశాడని అంటాడు. శత్రువా.. ఎవరు అని కార్తీక్ అడుగుతాడు.

 

జ్యోత్స్న రెస్టారెంట్‍కు పోటీగా సత్యరాజ్ రెస్టారెంట్ ఉండేది కదా అని మేనేజర్ అంటాడు. మీ టాలెంట్‍తో జ్యోత్స్న రెస్టారెంట్‍లో కొత్త వంటలు చేసి.. ఆ రెస్టారెంట్‍ను దెబ్బకొట్టారు కదా అని కార్తీక్‍కు గుర్తు చేస్తాడు. అప్పుడే సత్యరాజ్ రెస్టారెంట్ లాస్‍లోకి వెళ్లిందని, ఇప్పుడు దివాళీ తీసే పరిస్థితికి వచ్చిందని మేనేజర్ అంటాడు. తనకు ఈ సమాచారం ఎందుకు చెబుతున్నావని కార్తీక్ అడుగుతాడు. దివాళా స్థితిలో ఉన్న ఆ రెస్టారెంట్‍ను హ్యాండోవర్ చేసుకుంటే.. జ్యోత్స్న రెస్టారెంట్ కంటే సూపర్ పాపులర్ చేయగలరని ఆ మేనేజర్ అంటాడు.

ఇప్పుడు అంత ఇన్వెస్ట్ చేయలేను

రెస్టారెంట్‍ను హ్యాండోవర్ చేసుకోవడమంటే కోట్లతో పని అని, ఇప్పుడు అంత ఇన్వెస్ట్ చేసే పరిస్థితుల్లో లేను ప్రభాకర్ అని కార్తీక్ చెబుతాడు. అయితే, వాళ్లతో ఓసారి మాట్లాడాలని, కలిస్తే ఏదైనా ఉపయోగం ఉంటుందని ప్రభాకర్ సలహా ఇస్తాడు. వేరే పార్టీలు కూడా ప్రయత్నిస్తున్నారని, మీరు వెళ్లి కలవండని చెబుతాడు. జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్‍లో పని చేస్తూ ఈ సమాచారం నాకెందుకు చెబుతున్నావని కార్తీక్ అంటాడు. ఉద్యోగాలు పోయి రోడ్డుపై ఉంటే మీరు మా తరఫున నిలబడ్డారని, మీరు మళ్లీ బాగుంటే చూడాలని ఉందని ప్రభాకర్ చెబుతాడు. ఈరోజు వెళ్లి సత్యరాజ్‍ను కలవాలని అంటాడు.

 

అవకాశాన్ని వదులుకోకండి

ఏంటి కార్తీక్ బాబు ఆలోచిస్తున్నారు.. మీరు ఎదురుచూస్తున్న అవకాశాన్ని దేవుడు మీ దగ్గరికే తీసుకొచ్చాడని దీప అంటుంది. వదులుకోకండని చెబుతుంది. అది నా వల్లే దివాళీ తీసిన రెస్టారెంట్ కదా.. నేను వెళ్లి ఏం మాట్లాడాలని కార్తీక్ అంటాడు. అది గతంలో రా.. ఇప్పుడు నువ్వు జ్యోత్స్న రెస్టారెంట్‍కు సీఈవోవు కాదు కదా.. ఏం ఆలోచించకు అని కాంచన చెబుతుంది. ప్రయత్నం చేస్తే తప్పేంటి అని కార్తీక్ అంటాడు. మీ ముఖం చూస్తే శత్రువైనా చిరునవ్వు నవ్వుతారని దీప అంటుంది. దీపను కూడా తనతో రావాలని కార్తీక్ అడుగుతాడు. నేనెందుకు లే అని దీప అంటే.. రావాల్సిందేనని ఒప్పిస్తాడు కార్తీక్. భగవంతుడా ఎలాగైనా ఇది మా కార్తీక్‍కు వచ్చేలా చూడు అని కాంచన అనుకుంటుంది.

జ్యోత్స్న కూడా పోటీలో..

సత్యరాజ్ రెస్టారెంట్ తీసుకోవాలని అనుకుంటున్నట్టు తాత శివన్నారాయణతో జ్యోత్స్న చెబుతుంది. పోటీ లేకుండా చేసేందుకు దాన్ని కొందామని అంటుంది. దాన్ని కొనడం కరెక్టేనా అని శివన్నారాయణ ప్రశ్నిస్తాడు. మనం కొంటే ఇక ఎవరూ పోటీగా ఉండరని జ్యోత్స్న చెబుతుంది. శివన్నారాయణ కూడా మాట్లాడేందుకు వస్తానంటే.. తానొక్కటే వెళతానని జ్యోత్స్న అంటుంది. నువ్వు ఈ డీల్ చేయగలవా అని శివన్నారాయణ అడిగితే.. చేస్తానంటూ బలంగా చెబుతుంది. నువ్వు వెళితే కొనే రావాలి.. లేకపోతే శత్రువు ముందు పరువు పోతుందని శివన్నారాయణ అంటాడు. మనకు పోటీగా ఎవరు ఉంటారని, అడిగితే అమ్మడం తప్ప సత్యరాజ్‍కు ఆప్షన్ ఉండదని జ్యోత్స్న అంటుంది. శివన్నారాయణ ఆశీర్వాదం తీసుకుంటుంది. చూస్తుంటే అనుకున్నది జ్యోత్స్న సాధించేలా ఉందని, తమ మనవరాలు కదా అని మురిసిపోతాడు శివన్నారాయణ.

 

చిన్నచూపు చూసిన మేనేజర్

సైకిల్‍పై సత్యరాజ్ ఆఫీస్‍కు కార్తీక్, దీప వస్తారు. తాను చదువుకోలేదని, లోపలికి రానని దీప అంటుంది. నీకు జీవితం నేర్పిన సంస్కారం ఉందని, నీలా నువ్వు మాట్లాడాలని కార్తీక్ అంటాడు. ఇంతలో ఓ వ్యక్తితో సత్యరాజ్ మాట్లాడుతుంటాడు. ఎవరికీ పడితే వారికి రెస్టారెంట్ అమ్మబోమని, సమర్థత, సామర్థ్యం ఉన్న వారికే ఇస్తామని, అలాంటి వారి కోసం ఎదురుచూస్తున్నామని అంటాడు. ఇంతలో కార్తీక్, దీప ఆఫీస్‍లోకి వస్తారు. ఎవరి కోసం వచ్చారని సత్యరాజ్ ఆఫీస్ మేనేజర్ అడిగితే.. సత్యరాజ్‍ను కలిసేందుకు వచ్చామని కార్తీక్ అంటాడు. తాను కూడా బిజినెస్ గురించి మాట్లాడేందుకు వచ్చామని కార్తీక్ అంటే.. సరే అంటూ నిట్టూర్పుగా అంటాడు మేనేజర్. ఏం కావాలి అని కార్తీక్‍ను ఆఫీస్ బాయ్ అడిగితే.. ఎవరికి మర్యాదలు చేయాలో తెలుసుకో అని మేనేజర్ అంటాడు. చిన్నచూపు చూస్తాడు. మీ పక్కన నేనుంటే మీకు కూడా మర్యాదలు దక్కవని దీప అంటుంది. వచ్చింది మర్యాద కోసం కాదు.. అవకాశం కోసమని కార్తీక్ సర్దిచెబుతాడు.

జ్యోత్స్న ఎంట్రీ

సత్యరాజ్ ఆఫీస్‍కు అప్పుడే ఎంట్రీ ఇస్తుంది జ్యోత్స్న. అక్కడ కార్తీక్, దీపను చూసి షాక్ అవుతుంది. తాను జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సీఈవోను అని, సత్యరాజ్‍ను కలవాలని మేనేజర్‌తో జ్యోత్స్న చెబుతుంది. ఆమెకు ఏం కావాలో చూడాలని ఆఫీస్ బాయ్‍తో మేనేజర్ అంటాడు. మాట్లాడరా.. క్యాటరింగ్‍లో జరిగింది మరిచిపోలేదా అని కార్తీక్, దీపతో జ్యోత్స్న అంటుంది. మీరు ఈజీగా రాళ్లు విసిరిపోతారని, అవతలి వాళ్ల అద్దాలు పగిలిపోతాయని కార్తీక్ అంటాడు. మీరు మరిచిపోతారు, అవతలి వాళ్లు గుర్తు పెట్టుకుంటారు అని కౌంటర్ వేస్తాడు.

 

కొంప తీసి రెస్టారెంట్ కొనడానికి వచ్చావా ఏంటి..

ఎక్కడికి ఎందుకు వచ్చారని దీపను జ్యోత్స్న అడుగుతుంది. సత్యరాజ్‍ను కలిసేందుకని దీప బదులిస్తుంది. కొంపతీసి రెస్టారెంట్ కొనేందుకు వచ్చావా ఏంటి అని వెకిలిగా నవ్వుతుంది జ్యోత్స్న. కార్తీక్, దీపను ఆపి మరీ జ్యోత్స్న లోపలికి పంపిస్తాడు మేనేజర్. ఇది నీకు దక్కాల్సిన గౌరవం, ఆ మనిషి పక్కన నిలబడి ఏం కోల్పోతున్నావో తెలుసుకో అని పొగరుగా అంటుంది జ్యోత్స్న. నేను వెళతానని దీప అంటే.. పట్టించుకోవద్దనేలా కార్తీక్ అంటాడు. జ్యోత్స్న కూడా రెస్టారెంట్ కోసమే వచ్చి ఉంటుందని కదా అని దీప అంటుంది.

బేరాల్లేవు.. అమ్మేయండి

మీరు చెప్పిన అమౌంట్‍కే రెస్టారెంట్ కొంటానని సత్యరాజ్‍తో జోత్స్న అంటుంది. మీ తాతకంటే ముక్కుసూటిగా ఉన్నావని సత్యరాజ్ చెబుతాడు. నీ గురించి నాకు తెలియదా అని అంటాడు. 50 ఏళ్లు దాటిన వారిని ఉద్యోగంలో నుంచి తీసేసి.. మళ్లీ తీసుకొని సారీ కూడా చెప్పావంట కదా అని సత్యరాజ్ అంటాడు. దీంతో కోపంగా చూస్తుంది జ్యోత్స్న. కొన్ని సార్లు నిర్ణయాలు బ్యాక్‍ఫైర్ అవుతాయని అంటుంది. తామే నంబర్ వన్ అంటూ పొగరుగా మాట్లాడుతుంది. కొనేస్తానని, ఒకే అంటే సింగిల్ పేమెంట్‍లో అమౌంట్ ఇచ్చేస్తానంటుంది. బేరాలు ఏమీ ఆడనని, తనకు రెస్టారెంట్ ఇచ్చేయాలని చెబుతుంది.

 

మీరు ఓకే కదా అని జ్యోత్స్న అంటుంది. కాదనలేని ఆఫర్ ఇచ్చావ్.. కానీ బయట ఎవరో వెయిట్ చేస్తున్నారట.. వాళ్లతో కూడా మాట్లాడి నిర్ణయిస్తానని సత్యరాజ్ చెబుతాడు. వాళ్లది కొనే రేంజ్ కాదని జ్యోత్స్న అంటుంది. వాళ్లు ఎవరో తెలుసు అని సత్యరాజ్ అడిగితే.. పిలిచి మాట్లాడితే మీకు తెలుస్తుందని జ్యోత్స్న చెబుతుంది. మీరు ఓకే అంటారని నాకు తెలుసునని, నా ఆఫర్ ఓకే చేయాల్సిందేనని అంటుంది. టైమ్ ఎక్కువ ఇవ్వనని, త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెబుతుంది. అంత పొగరుగా మాట్లాడుతోందని సత్యరాజ్‍తో మేనేజర్ అంటాడు. డబ్బు వల్లే అలా మాట్లాడున్నా మౌనంగా ఉన్నానని సత్యరాజ్ చెబుతాడు.

గాడిదలు అరుస్తున్నా.. చెవులు మూసుకో

రెస్టారెంట్‍ను తాను కొనేశానని, మీరు బయలుదేరవచ్చని కార్తీక్, దీపతో జ్యోత్స్న అంటుంది. మేం సత్యరాజ్‍ను కలిసేందుకు వచ్చానని కార్తీక్ చెబుతాడు. “దీప నువ్వు వెళ్లొద్దు.. బావ ఒక్కటే వెళితే జాబ్ కోసం వచ్చాడని అనుకుంటారు. నువ్వు కూడా వెళితే.. ఏదైనా పని కోసం వచ్చారని అనుటుంటారు” అని జ్యోత్స్న పొగరుగా అంటుంది. “గాడిదలు అరుస్తున్నాయ్ చెవులు మూసుకో దీప” అని జ్యోత్స్నకు పంచ్ వేస్తాడు కార్తీక్. నువ్వు నా పక్కన ఉంటే హీరో అవుతావు బావ.. దీప పక్కన ఉంటే జీరో అని జ్యోత్స్న అంటుంది. దీపపై మరోసారి అక్కసు వెళ్లగక్కుతుంది జ్యోత్స్న.

 

నేనే కాల్ చేద్దామనుకున్నా..

సత్యరాజ్ దగ్గరికి మాట్లాడేందుకు కార్తీక్, దీప వెళతారు. నువ్వు శివన్నారాయణ మనవడివి కదా అని కార్తీక్‍తో సత్యరాజ్ అంటాడు. తాను నా భార్య దీప అని కార్తీక్ చెబుతాడు. ఆ మధ్య నీ గురించి చాలా విన్నానయ్యా.. పర్సనల్‍గా కాల్ చేసి మాట్లాడదామని అనుకున్నానని సత్యరాజ్ అంటాడు. ముందు కూర్చోవాలని చెబుతాడు. గౌరవంగా మాట్లాడతాడు.

రెస్టారెంట్ దివాళాకు కారణం నువ్వు

ఎందుకు కాల్ చేసి మాట్లాడాలనుకున్నానో తెలుసా.. ఈ రోజున నా రెస్టారెంట్ దివాళా తీసి అమ్ముకునే పరిస్థితికి వచ్చేందుకు కారణం నువ్వే అని కార్తీక్‍తో సత్యరాజ్ అంటాడు. లండన్‍లో గొప్పగా చదువుకొని, మీ తాత కంపెనీకి సీఈవో అయి మా కంపెనీని దెబ్బకొట్టావని చెబుతాడు. కంపెనీ నుంచి నిన్ను తీసేశారని తెలియగానే సంతోషంగా అనిపించిందని, కానీ నువ్వు జ్యోత్స్న రెస్టారెంట్‍కు క్రియేట్ చేసిన మార్కెట్ తనను పైకి ఎదగనివ్వ లేదని అంటాడు. “ఆ కంపెనీకి నువ్వు బలం. మరదలిని పెళ్లి చేసుకోలేదని కంపెనీ నుంచి తీసేశారని విన్నా” అని సత్యరాజ్ అంటాడు. దీప తలదించుకుంటే కార్తీక్ అలా చూస్తాడు. దీంతో కార్తీక దీపం 2 నేటి (ఫిబ్రవరి 18) ఎపిసోడ్ ముగిసింది. రెస్టారెంట్ డీల్ కార్తీక్‍కే దక్కుతుందేమో చూడాలి.

 
 
Whats_app_banner
 

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024