Harish Shankar: సినిమా సినిమాకు గ్యాప్ ఇవ్వొద్దని కోరుకుంటున్నాను.. హీరోపై డైరెక్టర్ హరీష్ శంకర్ కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

Harish Shankar: సినిమా సినిమాకు గ్యాప్ ఇవ్వొద్దని కోరుకుంటున్నాను.. హీరోపై డైరెక్టర్ హరీష్ శంకర్ కామెంట్స్

 

Director Harish Shankar About Pradeep Ranganathan: డైరెక్టర్ హరీష్ శంకర్ తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన దర్శకుడు హరీష్ శంకర్ కామెంట్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

 
సినిమా సినిమాకు గ్యాప్ ఇవ్వొద్దని కోరుకుంటున్నాను.. హీరోపై డైరెక్టర్ హరీష్ శంకర్ కామెంట్స్
సినిమా సినిమాకు గ్యాప్ ఇవ్వొద్దని కోరుకుంటున్నాను.. హీరోపై డైరెక్టర్ హరీష్ శంకర్ కామెంట్స్
 

Director Harish Shankar About Dragon Movie: దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ వరుసగా హిట్ చిత్రాలను నిర్మిస్తోంది. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ కాంబినేషన్‌లో బ్లాక్ బస్టర్ ‘లవ్ టుడే’ చిత్రం వచ్చింది.

 

జోడీగా అనుపమ పరమేశ్వరన్

ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్‌లో ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌’ ఆడియెన్స్ ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని కల్పాతి ఎస్. అఘోరం, కల్పాతి ఎస్. గణేష్, కల్పాతి ఎస్. సురేష్ నిర్మించారు. ఓరి దేవుడా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అశ్వత్ మారిముత్తు రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ చిత్రానికి దర్శకత్వం వహించారు.

ఫిబ్రవరి 21న రిలీజ్

రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా ఫిబ్రవరి 21న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. ఇందులో భాగంగానే ఆదివారం (ఫిబ్రవరి 16) నాడు రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు డైరెక్టర్ హరీష్ శంకర్, సాయి రాజేష్, కిషోర్ తిరుమల వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ హరీష్ శంకర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మనకు చాలా నచ్చేస్తుంది

డైరెక్ట‌ర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ.. “తెలుగులో ప్రదీప్ రంగనాథన్ అద్భుతంగా మాట్లాడారు. ఒకసారి హీరోని మనం సొంతం చేసుకుంటే.. ఆ హీరో ఏం చేసినా మనకు చాలా నచ్చేస్తుంది. ఇప్పుడు ప్రదీప్ అలాంటి ఇమేజ్‌ను ఇక్కడ సొంతం చేసుకున్నారు. ఇక ప్రదీప్‌ని సినిమా సినిమాకి గ్యాప్ ఇవ్వొద్దని కోరుకుంటున్నాను” అని తెలిపారు.

 

కొత్త వాళ్లను ఎంకరేజ్ చేస్తుంటారు

“అశ్వత్ మారిముత్తు అద్భుతమైన దర్శకుడు. ట్రైలర్ కట్ చూస్తేనే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందనిపిస్తోంది. తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ ఓ బ్రాండ్. టాలెంట్ హంట్‌లో మైత్రి రవి గారు చాలా ముందుంటారు. తెలుగులో మైత్రి ఎలానో.. తమిళంలో ఏజీఎస్ అలా ఉంటుంది. ఎప్పుడూ కొత్త కంటెంట్, కొత్త వాళ్లని ఎంకరేజ్ చేస్తుంటారు” అని దర్శకుడు హరీష్ శంకర్ చెప్పారు.

తెలుగు డైలాగ్స్ బాగా రాశారు

“నిర్మాత ఎస్‌కేఎన్ మాట్లాడిన తరువాత మనం మాట్లాడటానికి ఏం ఉండదు. ఈ సినిమాకు తెలుగు డైలాగ్స్ బాగా రాశారు. ఫిబ్రవరి 21న ఈ చిత్రాన్ని నేను ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను. ఈ మూవీని అందరూ సపోర్ట్ చేయండి” అని డైరెక్టర్ హరీష్ శంకర్ కోరారు.

పవన్ కల్యాణ్‌తో మూవీ

ఇదిలా ఉంటే, ఇటీవల మిస్టర్ బచ్చన్ సినిమాతో ఫ్లాప్ అందుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా చేస్తున్న ఈ మూవీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.

 
 
Whats_app_banner
 

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024