Manchu Manoj: అర్ధరాత్రి హైడ్రామా.. పోలీస్ స్టేషన్‍లో మంచు మనోజ్.. మళ్లీ ఏం జరిగిందంటే..

Best Web Hosting Provider In India 2024

Manchu Manoj: అర్ధరాత్రి హైడ్రామా.. పోలీస్ స్టేషన్‍లో మంచు మనోజ్.. మళ్లీ ఏం జరిగిందంటే..

Manchu Manoj: తిరుపతిలోని ఓ పోలీస్ స్టేషన్‍కు మంచు మనోజ్ వెళ్లారు. అర్ధరాత్రి హైడ్రామా తర్వాత స్టేషన్‍లో ఆయన బైఠాయించారు. పోలీసులపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

 
Manchu Manoj: అర్ధరాత్రి హైడ్రామా.. పోలీస్ స్టేషన్‍లో మంచు మనోజ్.. మళ్లీ ఏం జరిగిందంటే..
Manchu Manoj: అర్ధరాత్రి హైడ్రామా.. పోలీస్ స్టేషన్‍లో మంచు మనోజ్.. మళ్లీ ఏం జరిగిందంటే..

మంచు కుటుంబంలో ఆస్తి తగాదాలు కొన్ని రోజులుగా సాగుతున్నాయి. తండ్రి మంచు మోహన్ బాబు, అన్న విష్ణుతో మంచు మనోజ్ విభేదాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇరు వైపుల దాడులు, ప్రతిదాడులు సాగాయి. పోలీస్ స్టేషన్‍కు కూడా పలుసార్లు పంచాయితీ చేరింది. ఇప్పుడు తాజా మరోసారి ఇంకో రచ్చ జరిగింది. అర్ధరాత్రి హైడ్రామా తర్వాత తిరుపతి జిల్లాలోని భాకరాపేట పోలీస్ స్టేషన్‍లో నిరసన వ్యక్తం చేశారు మనోజ్. ఏం జరిగిందంటే..

 

రిసార్టుకు వెళ్లిన పోలీసులు

తిరుపతి సమీపంలోని లేక్ వ్యాలీ రిసార్టులో మంచు మనోజ్ బస చేశారు. ఈ తరుణంలో సోమవారం అర్ధరాత్రి పోలీసులు ఆ రిసార్టుకు వెళ్లారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. అయితే, తాను ఎందుకు వెళ్లాలని, తన గోప్యతకు భంగం కలిగిస్తున్నారని పోలీసులపై మనోజ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

అయితే, యూనివర్సిటీ వ్యవహారంలో మరోసారి కల్పించుకునేందుకే మంచు మనోజ్.. ఆ రిసార్టులో బస చేశారని పోలీసులకు మోహన్ బాబు సమాచారం ఇచ్చారని రూమర్లు ఉన్నాయి. గొడవ జరగకుండా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అక్కడి నుంచి వెళ్లిపోవాలని మనోజ్‍కు పోలీసులు చెప్పారని తెలుస్తోంది.

పోలీస్ స్టేషన్‍కు వెళ్లి బైఠాయింపు

ఈ తతంగంతో తీవ్ర అసంతృప్తికి లోనైన మనోజ్.. భాకరపేట పోలీస్ స్టేషన్‍కు వెళ్లారు. పోలీసుల తీరుపై ఆగ్రహించారు. పోలీస్ స్టేషన్ నుంచి సీఐకు కాల్ చేశారు. ఆయనతో వాగ్వాదం చేశారు. పోలీసుల తీరు నచ్చడం లేదని, తన ప్రైవసీకి భంగం కలిగించారని స్టేషన్‍లోనే కాసేపు బైఠాయించారు మనోజ్. ఆ తర్వాత గంట వ్యవధిలో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇలా అర్ధరాత్రి మరోసారి హైడ్రామా నడిచింది.

మంచు ఫ్యామిలీ ఆస్తి గొడవలు ఇప్పటికే రచ్చకెక్కాయి. మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పరం ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు ఇచ్చుకున్నారు. ఇద్దరికి చెందిన బౌన్సర్ల మధ్య కూడా కొన్నిసార్లు ఘర్షణ జరిగింది. ఈ రచ్చ జరుగుతుండగానే ఓ జర్నలిస్టుపై దాడి చేయడంతో మోహన్ బాబుపై కేసు కూడా నమోదైంది. ఇటీవల మోహన్ బాబు యూనివర్సిటీ వద్దకు మనోజ్ వెళ్లడంతో ఓసారి బాగా గొడవ జరిగింది.

 

సినిమాలు ఇలా..

మంచు మనోజ్ కీలకపాత్ర పోషించిన భైరవం సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, నాారా రోహిత్ కూడా నటించారు. ఈ చిత్రాన్ని మార్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తేజ సజ్జా హీరోగా నటిస్తున్న మిరాయ్ చిత్రంలోనూ కీలకపాత్ర చేస్తున్నారు మనోజ్.

మంచు విష్ణు ప్రధాన పాత్రలో కన్నప్ప చిత్రం వస్తోంది. ఈ మూవీలో మంచు మోహన్ బాబు కూడా నటిస్తున్నారు. ఈ మైథలాజికల్ మూవీలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, మోహన్‍లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కూడా కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన కన్నప్ప సినిమాను ఏప్రిల్ 25వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ ఇప్పటికే ప్రకటించింది. రూ.100 కోట్లకు పైగా బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందుతోంది.

 
Whats_app_banner
 

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024