Best Web Hosting Provider In India 2024

తునిలో టీడీపీ నేతల దౌర్జనకాండ
కాకినాడ: తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో టీడీపీ గూండాలు దౌర్జనం పరాకాష్ఠకు చేరింది. వైయస్ఆర్‌సీపీ కౌన్సిలర్లపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. వైస్ చైర్మన్ ఎన్నిక ఇప్పటికే మూడుసార్లు జరగకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఇవాళ మరోసారి ఎన్నిక చేపట్టగా ఓటింగ్‌లో పాల్గొనేందుకు మున్సిపల్ కార్యాలయానికి వెళ్తున్న వైయస్ఆర్‌సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో ప్రాణభయంతో వైయస్ఆర్‌సీపీ కౌన్సిలర్లు వెనుదిరిగారు. మున్సిపల్ ఆఫీస్ వద్ద టీడీపీ గూండాలు కర్రలతో భారీగా మోహరించి దాడికి దిగారు. తునిలో 30కి 30 కౌన్సిలర్లు వైయస్ఆర్‌సీపీ వారే ఉన్నారు. అయితే ప్రలోభపెట్టి, భయపెట్టి 9 మందిని టీడీపీ నేతలు లాక్కున్నారు. వైయస్ఆర్‌సీపీ చేతిలో 19 మంది కౌన్సిలర్లు ఉండగా టీడీపీ అడ్డదారిలో వైస్ చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు ప్రజాస్వామ్యం ఖూనీ చేశారు. తునిలో 144 సెక్షన్ అమల్లో ఉన్న టీడీపీ గూండాలు పట్టించుకోలేదు. అధికార పార్టీ నేతల తీరుపై ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండిస్తున్నారు.
కాగా, వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా.. నేడు ఛలో తునికి పిలుపునిచ్చారు. ‘చలో తుని’కి పోలీసుల అనుమతి లేదని. వస్తే చర్యలు తీసుకుంటామని పోలీసుల హెచ్చరిస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ వైయస్ఆర్‌సీపీ హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు. చలో తుని కార్యక్రమంలో భాగంగా తుని వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పిలుపునివ్వగా, ఇవాళ తెల్లవారుజామునుంచి జక్కంపూడి రాజా ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. జక్కంపూడి రాజాను గృహ నిర్బంధం చేశారు. కాకినాడ జిల్లా కాకినాడ ప్రత్తిపాడులో వైయస్ఆర్‌సీపీ నేత మురళీకృష్ణ రాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.