తుని మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎన్నిక మరోసారి వాయిదా

Best Web Hosting Provider In India 2024

కాకినాడ జిల్లా: నిస్సిగ్గుగా చంద్రబాబు సర్కార్‌ దౌర్జన్యాలు, అరాచకాలతో తుని మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎన్నిక మరోసారి వాయిదా పడింది.  తునిలో టీడీపీ గూండాల దౌర్జన్యకాండకు దిగారు. తునిలో 30కి 30 మంది కౌన్సిలర్లు వైయ‌స్ఆర్‌సీపీ వారే. ప్రలోభపెట్టి, భయపెట్టి 10 మంది టీడీపీ లాక్కుంది. వైయ‌స్ఆర్‌సీపీ చేతిలో 17 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ కౌన్సిలర్లపై టీడీపీ గూండాలు దాడి చేసి.. మున్సిపల్‌ ఆఫీస్‌లో వెళ్లకుండా అడ్డుకున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్‌ చేసే ప్రయత్నం చేశారు.

దీంతో ప్రాణభయంతో వైయ‌స్ఆర్‌సీపీ కౌన్సిలర్లు వెనుదిరిగారు. మున్సిపల్‌ ఆఫీస్‌ వద్ద కర్రలతో టీడీపీ గూండాలు మోహరించారు. 144 సెక్షన్‌ అమల్లో ఉన్నాటీడీపీ గూండాలు పట్టించుకోలేదు. తునిలో ప్రజాస్వామ్యం ఖూనీపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నేడు తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో​ టీడీపీ దౌర్జన్యం పరాకాష్ఠకు చేరింది. ఇప్పటికే మూడుసార్లు ఎన్నికను అడ్డుకున్న టీడీపీ గుండాలు.. నాలుగోసారి అడ్డుకున్నారు.

తునిలో టిడిపి అరాచకం సృష్టించింది:  మాజీ మంత్రి దాడిశెట్టి రాజా
మున్సిప‌ల్ వైస్ చైర్మ‌న్ ఎన్నిక సంద‌ర్భంగా తునిలో టీడీపీ నేత‌లు అరాచ‌కం సృష్టించార‌ని కాకినాడ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు దాడిశెట్టి రాజా మండిప‌డ్డారు. మోజారిటీ వచ్చేవరకు వాయిదా వేయిచాలని టిడిపి ఉద్దేశమ‌ని ధ్వ‌జ‌మెత్తారు.  వాస్తవంగా తుని మున్సిపాలిటీలో టిడిపికి మెజారిటీ లేద‌న్నారు. బిసి మహిళ అయిన మున్సిపల్ ఛైర్మన్ సుధారాణి ఇంటిపై దాడిచేసి తిరిగి ఆమెపై అక్రమ‌ కేసు పెట్టారని త‌ప్పుప‌ట్టారు. కలెక్టర్, ఎస్పీలకు తుని నియోజకవర్గం మీద ఏవిధమైన పట్టులేద‌న్నారు. ఆర్గనైజ్డ్ క్రైం మా కౌన్సిలర్ల ను పోలీసుల ద్వారా కిడ్నాప్ చేయాలనుకున్నారని ఫైర్ అయ్యారు. చట్టాలను, వ్యవస్ధలను గౌరవించి మా కౌన్సలర్ లను ఓటింగ్ కు పంపించామ‌ని చెప్పారు. పచ్చమూకల దాడి చేసే ప్రయత్నంలో ప్రాణ భయంతో కౌన్సిలర్ల వెనక్కి పారిపోయి వచ్చార‌ని తెలిపారు. కనీసం వారికి పోలీసులు రక్షణ కల్పిచలేకపోయార‌ని ఆక్షేపించారు. ఈసారి జరిగే ఎన్నికకు కలెక్టర్, ఎస్పీ రంగంలోకి వచ్చి ధర్మంగా ఎన్నిక జరిపించాల‌ని దాడిశెట్టి రాజా  కోరారు. 

Best Web Hosting Provider In India 2024