


Best Web Hosting Provider In India 2024

OTT Crime Thriller Web Series: నెట్‌ఫ్లిక్స్‌లోకి అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్.. ఆ రోజు నుంచే
OTT Crime Thriller Web Series: నెట్‌ఫ్లిక్స్ లోకి మరో అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. తమిళ హీరోయిన్ జ్యోతిక, అర్జున్ రెడ్డి భామ షాలినీ పాండే, షబానా అజ్మీలాంటి వాళ్లు నటించిన ఈ సిరీస్ ట్రైలర్ మంగళవారం (ఫిబ్రవరి 18) రిలీజైంది.
OTT Crime Thriller Web Series: క్రైమ్ థ్రిల్లర్ జానర్ మూవీస్, వెబ్ సిరీస్ లకు ఓటీటీ పెట్టింది పేరు. అందులో నెట్‌ఫ్లిక్స్ లో ఇలాంటివే ఎక్కువ. ఇప్పుడు ఆ ప్లాట్‌ఫామ్ లోకే డబ్బా కార్టెల్ (Dabba Cartel) పేరుతో మరో వెబ్ సిరీస్ వస్తోంది. ఈ సిరీస్ ట్రైలర్ మంగళవారం (ఫిబ్రవరి 18) రిలీజ్ కాగా.. వెబ్ సిరీస్ ఫిబ్రవరి 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్
క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ డబ్బా కార్టెల్ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. సీనియర్ నటీనటులు షబానా అజ్మీ, జ్యోతిక, షాలినీ పాండే, గజరాజ్ రావ్ లాంటి వాళ్లు నటించిన సిరీస్ ఇది. డబ్బాల్లో లంచ్ తోపాటు డ్రగ్స్ కూడా సప్లై చేసే ఐదుగురు గృహిణుల చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ వాళ్ల అక్రమ దందా, అందులో ఇరుక్కుపోయి అటు డ్రగ్స్ మాఫియా, ఇటు పోలీసుల చేతుల్లో ఎలాంటి ఇబ్బందులకు గురయ్యారన్నది ఈ ట్రైలర్లో చూపించారు.
ముంబై శివార్లలోనే థానే బ్యాక్‌డ్రాప్ లో ఈ డబ్బా కార్టెల్ స్టోరీ నడుస్తుంది. ముంబైలో డబ్బా వాలాల బిజినెస్ ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలుసు. అయితే ఆ డబ్బాల వెనుక డ్రగ్స్ అనే చీకటి దందాను నడిపించే గృహిణిలు గురించి ఈ డబ్బా కార్టెల్ చూపించబోతోంది.
డబ్బా కార్టెల్ ఓటీటీ రిలీజ్ డేట్
ఎంతో ఆసక్తి రేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ డబ్బా కార్టెల్ ఫిబ్రవరి 28 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. “వాళ్లు వండుతున్నారు. అది క్రిమినల్లీ గుడ్. డబ్బా కార్టెల్ ను ఫిబ్రవరి 28 నుంచి చూడండి” అనే క్యాప్షన్ తో తన ఇన్‌స్టాగ్రామ్ లో నెట్‌ఫ్లిక్స్ ఈ ట్రైలర్ రిలీజ్ చేసింది.
ఈ డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్ ను హితేష్ భాటియా డైరెక్ట్ చేశాడు. జ్యోతిక, షబానా అజ్మీ, షాలినీ పాండేలాంటి వాళ్లు నటించడంతో ఈ వెబ్ సిరీస్ పై భారీ అంచనాలే ఉన్నాయి. అందులోనూ ముంబై, డ్రగ్స్ కథాంశంతో వస్తుండటంతో డబ్బా కార్టెల్ ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకంతో మేకర్స్ ఉన్నారు.
సంబంధిత కథనం