



Best Web Hosting Provider In India 2024

Cholesterol Symptoms: మీ చర్మం పై ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మీ శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయిందని అర్థం
Cholesterol Symptoms: కొలెస్ట్రాల్ పేరుకుపోవడం అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. చర్మంపై కనిపించే కొన్ని లక్షణాల ద్వారా దీన్ని గుర్తించవచ్చు.
అధిక కొలెస్ట్రాల్ అనేది అతి పెద్ద సమస్యగా మారిపోయింది. రక్తంలో ఎక్కువ కొవ్వుharitha పేరుకుపోవడం వల్ల ఈ అధిక కొలెస్ట్రాల్ సమస్య పెరుగుతుంది. ధమనులలో ఫలకాలు ఏర్పడి రక్త ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలో ధమనులను ఇరుకుగా చేస్తాయి. ఇవి గుండెకు రక్త ప్రవాహాన్ని పరిమితం చేస్తాయి. దీనివల్లే గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి అధిక కొలెస్ట్రాల్ శరీరంలో చేరితే ఆ విషయాన్ని తెలుసుకొని వెంటనే చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది.
కొలెస్ట్రాల్ లక్షణాలు
శరీరంలో అధిక కొలెస్ట్రాల్ చేరితే వాటిని శరీరం కొన్ని లక్షణాల ద్వారా బయటికి తెలియజేస్తుంది. అందులో మొదటి సూచన చర్మంపై చిన్న గడ్డలు ఏర్పడడం. వాటిని కొవ్వు గడ్డలు అని కూడా పిలుచుకుంటారు. ఇవి కొవ్వు నిక్షేపాలు. చర్మం కింద ఉన్న కణజాలాలను ఇవి ప్రభావితం చేస్తాయి. ఈ గడ్డలు అప్పుడప్పుడు దద్దుర్లులాగా మారుతాయి. ఈ గడ్డల్లో కొలెస్ట్రాల్ నిండిపోయి ఉంటుంది. మోకాళ్లు, మోచేతులు, పిరుదులపై కూడా ఈ గడ్డలు వస్తూ ఉంటాయి. నోటి లైనింగ్, జననేంద్రియాలు లోపల కూడా మొటిమల్లాగా కనిపిస్తూ ఉంటాయి.
చర్మం రంగు మారితే
చర్మంపై నీలి, ఎరుపు రంగు మచ్చలు వస్తున్నా కూడా తేలికగా తీసుకోకూడదు. సాధారణంగా తొడలు, పాదాలు, వేలు, పిరుదులు, కాళ్లు వంటి భాగాలపై ఈ నీలి, ఎరుపు రంగు మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా మచ్చలు వస్తే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఇలా నీలి, ఎరుపు రంగు మచ్చలు కనబడడం ఏమాత్రం మంచిది కాదు. వైద్యులు చెబుతున్న ప్రకారం ఇది అత్యవసర వైద్య సహాయం అవసరం అయ్యే సంకేతం కూడా కావచ్చు.
ముక్కు రెండువైపులా మూలల్లో పసుపు రంగు మచ్చలు కనిపిస్తున్నా కూడా తేలిగ్గా తీసుకోకూడదు. అలాగే కళ్ళ చుట్టూ కూడా పసుపు రంగులో చర్మం మారినా, చిన్న గడ్డల్లాగా ఏర్పడినా కూడా అది కొలెస్ట్రాల్ వల్లనేమోనని ఆలోచించి వెంటనే వైద్యుల సహాయం తీసుకోవాలి.
సోరియాసిస్ అనేది ఒక దీర్ఘకాలిక ఆటో ఇమ్యూన్ రుగ్మత. దీనివల్ల గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సోరియాసిస్ రక్తనాళాలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి చర్మంలో మంటగా అనిపిస్తున్నా, ఉబ్బిన ఎరుపు రంగులో ప్యాచెస్ వచ్చినా అది సొరియాసిస్ ఏమోనని అనుమానించాలి. సోరియాసిస్‌కు తగిన చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది. సోరియాసిస్ కూడా అధిక కొలెస్ట్రాల్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది.
ఎంబోలిజం వచ్చే అవకాశం
మీ పెద్ద ధమనులలో ఫలకాల నుండి చిన్నచిన్న స్పటికాలు విడిపోయి చిన్న ధమనులో రక్తనాళాల్లోకి చేరిపోతాయి. అప్పుడు అవి గుండె వైపు ప్రయాణిస్తున్నప్పుడు ఎంబోలిజం జరుగుతుంది. ఈ స్పటికాలు ఆ ప్రాంతానికి రక్త ప్రవాహాన్ని వెళ్లకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల కాలంలో పుండ్లు, చర్మం రంగు మారడం జరుగుతూ ఉంటాయి. నీలం లేదా ఊదా రంగులోకి కాలి వేలు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అప్పుడు వెంటనే వైద్యుల సాయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.
అధిక కొలెస్ట్రాల్ చేరిందో లేదో సంవత్సరానికి ఒకసారైనా చెక్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. అలాగే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వ్యాయామాల ద్వారా కూడా అధిక కొలెస్ట్రాల్ చేరకుండా అడ్డుకోవచ్చు.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం