



Best Web Hosting Provider In India 2024

Signs of Eating Too Much Sugar: షుగర్ ఎక్కువగా తినేస్తున్నారని అనుమానంగా ఉందా? ఈ 5 లక్షణాలు కనిపిస్తే కన్ఫమ్ అన్నట్లే!
Signs of Eating Too Much Sugar: మనలో చాలా మంది షుగర్ ఎక్కువగా తినేస్తున్నామనే భయంలోనే ఉంటారు, తింటారు కూడా. రోగం లేదా సమస్య వచ్చేదాకా షుగర్ ఎక్కువగా తీసుకున్నామని అర్థం చేసుకోలేరు. కానీ, ఏ సమస్య రాకముందే.. మనలో కనిపించే ఈ లక్షణాలను బట్టి షుగర్ ఎక్కువగా తీసుకుంటున్నామని ఇట్టే పసిగట్టేయొచ్చట!
పండుగైనా, ఏదైనా ప్రత్యేక రోజులైనా షుగర్‌తో చేసిన తీపి వంటకం కచ్చితంగా ఉండాల్సిందే. ఆరోగ్య సమస్యలను పక్కకుపెట్టి రుచి కోసం షుగర్ ను కచ్చితంగా వాడేసే వాళ్లు ఇది తప్పక తెలుసుకోవాలి. పండ్లు, కూరగాయల్లో దొరికే షుగర్ శక్తిని అందిస్తే, చక్కెర కలుపుకుని తినే ఆహార పదార్థాల వల్ల అనారోగ్యం కలిగే ప్రమాదముందట. మరి, రోజువారీ లైఫ్ లో మీరు తినే చక్కెర లిమిట్ లోనే ఉంటుందా.. హద్దు దాటుతుందా అని ఇలా తెలుసుకోండి.
శక్తి స్థాయిలు పడిపోవడం లేదా నీరసంగా ఉండటం
మీరు షుగర్ ఎక్కువగా తింటుంటే, తరచూ నీరస పడిపోతుండటం సంభవించవచ్చు. మీరు షుగర్ తినగానే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి. వాటి ద్వారా మీకు తక్షణమే శక్తి అందుతుంది. తాత్కాలికంగా శక్తిని అందించినప్పటికీ కాసేపటికే నీరసం కలుగుతున్నట్లు అనిపిస్తుంది.
స్వీట్ ఫుడ్స్ ఎక్కువగా తినాలనిపించడం
మీకు తరచుగా స్వీట్స్ తినాలనిపిస్తుందంటే, కాస్త ఆలోచించాల్సిన విషయమే. ఇప్పటికే మీ శరీరం షుగర్ ఎక్కువగా తినడానికి అలవాటుపడిందని అర్థం చేసుకోవాలి. స్వీట్స్ ద్వారా లేదా ఇతర పదార్థాల ద్వారా షుగర్ తీసుకుంటున్నట్లు అయితే, అది మీ బ్రెయిన్‌లో రిజిష్టర్ అయిపోతుంది. ఓ మాదిరిగా చెప్పాలంటే మిమ్మల్ని షుగర్ తినమని పరోక్షంగా ప్రేరేపిస్తుంది.
బొజ్జ పెరగడంతో పాటు బరువు కూడా పెరుగుతుంది
ఎక్కువగా షుగర్ తీసుకోవడం వల్ల ఉదర భాగంలో కొవ్వు పేరుకుపోతుంది. ఫలితంగా ఒబెసిటీ కలిగి పొట్టతో పాటు నడుం చుట్టూ లావుగా కనిపిస్తారు. శరీరంలో ప్రతి కణం వినియోగించే గ్లూకోజ్ మాత్రమే కాకుండా చక్కెరలో ఫ్రక్టోజ్ కూడా ఉంటుంది. ఇది సాధారణంగా లివర్ ద్వారా జీవక్రియ చేయాల్సి ఉంటుంది. ఫ్రక్టోజ్ ను మితిమీరి తీసుకోవడం వల్ల ఫ్యాట్ సింథసిస్ పెరిగి కొవ్వు నిల్వలకు దారితీస్తుంది. ఫలితంగా షుగర్ తో తయారుచేసిన స్వీట్లు తినడం వల్ల బరువు పెరగడంతో పాటు ఒబెసిటీకి కూడా గురవుతారు.
చర్మంపై మచ్చలతో పాటు పగుళ్లు
షుగర్ వల్ల శరీరంలో ఇన్‌ఫ్లమ్మేషన్ పెరిగి హార్మనల్ మార్పులు కలగొచ్చు. దీని కారణంగా మచ్చలు, చర్మ సమస్యలు కలుగుతాయి. షుగర్ ఎక్కువగా తినడం వల్ల ఇన్సులిన్ లెవల్స్ పెరిగి, ఆండ్రెజెన్ ఉత్పత్తి, సీబమ్ స్రావం ఉత్పత్తి ఎక్కువై మొటిమలు కలగడానికి కారణమవుతుంది.
క్రోనిక్ జబ్బుల ప్రమాదం
షుగర్ ను ఎక్కువ కాలం పాటు ఎక్కువ స్థాయిలో తీసుకుంటే, అది టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులకు, మెటబాలిక్ సిండ్రోమ్‌కు దారి తీయొచ్చు. షుగర్ ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఇన్సులిన్ తగ్గిపోయి టైప్ 2 డయాబెటిస్ సమస్యను పెంచుతుంది. దీంతో పాటుగా ఇన్‌ఫ్లమ్మేషన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగి గుండె జబ్బులకు కారణం కావొచ్చు.
మూడ్ స్వింగ్స్
అతిగా షుగర్ తినడం వల్ల తరచూ మూడ్ స్వింగ్స్ కు ఎక్కువగా లోనవుతుంటారు. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతున్నప్పుడు మీ లోపల ఆందోళన, ఒంటరితనం అనే ఫీలింగ్స్ కు గురవుతుంటారు.
పంటి సమస్యలు
పంటి సమస్యలకు, కేవిటీలకు కూడా అతిగా షుగర్ తీసుకోవడం ఒక కారణమే. షుగర్ అనేది హానికరమైన బ్యాక్టీరియాను పోషిస్తుంది. నోటిలో యాసిడ్‌ను ఉత్పత్తి అయ్యేలా చేసి దంతాలపై ఎనామిల్‌ను కరిగిపోయేలా చేస్తుంది.
సంబంధిత కథనం