



Best Web Hosting Provider In India 2024

Whats App Chat : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం, బాలుడి ప్రాణం తీసిన వాట్సాప్ చాటింగ్
Whats App Chat : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాట్సాప్ చాటింగ్ ప్రాణం తీసింది. తొమ్మిదో తరగతి విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తనతో పాటు చదువుతున్న బాలికతో చాటింగ్ చేసిన బాలుడ్ని బాలిక బంధువులు బెదిరించారు. దీంతో భయపడిన బాలుడు సూసైడ్ చేసుకున్నాడు.
Whats App Chat : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మంచుపల్లి మండలం చుంచుపల్లి తండాకు చెందిన మనోజ్(15) గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్కూల్ లో 7వ తరగతి చదువుతున్న బాలికతో 9వ తరగతి చదివే బాలుడు వాట్సాప్ చాటింగ్ చేశాడు. ఇది గమనించిన బాలిక కుటుంబసభ్యులు బాలుడిని బెదిరించారు. దీంతో భయపడిన బాలుడు ఆత్మహత్య చేసుకున్నారు.
మనోజ్(15) తన స్కూల్లోనే ఏడవ తరగతి చదువుతున్న బాలికతో చనువు ఏర్పడింది. దీంతో మనోజ్, బాలికతో రోజు వాట్సాప్‌లో చాటింగ్ చేసేవాడు. ఇది గమనించిన ఆమె కుటుంబసభ్యులు మనోజ్‌కు ఫోన్ చేసి బెదిరించారు. దీంతో భయపడిన మనోజ్ ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. బాలుడ్ని గమనించిన కుటుంబసభ్యులు ఖమ్మం ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు.
కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బాలుడి మృతి విషయం తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అతడి ఇంటికి చెరుకున్నారు. బాలుడి తల్లి రోదన చూసిన వారందరి కళ్లు చెమ్మగిల్లాయి.
బాలికతో పెళ్లైన వ్యక్తి ప్రేమ వ్యవహారం-బాలిక తండ్రి దారుణం
పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్న ఒక యువకుడు, స్కూలుకు వెళ్లే మైనర్ బాలికను ప్రేమ పేరుతో తప్పు దోవ పట్టిస్తున్నాడని కక్ష పెంచుకున్న బాలిక తండ్రి, ఆ యువకుడిని ముక్కలు ముక్కలుగా నరికాడు. ఈ సంఘటన, సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే జిల్లాలోని నిజాంపేట్ మండలంలో ఉన్న రామచంద్ర తండా కు చెందిన దశరథ్ (26) కు పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాను సంగారెడ్డి పట్టణంలో ఉంటూ, గణపతి షుగర్ కంపెనీ లో లారీ డ్రైవర్ గ పనిచేస్తూ గత కొంత కాలంగా జీవనం సాగిస్తున్నాడు.
కొంత కాలంగా మృతుడు దశరథ్ తన గ్రామానికి దగ్గరలోని మెగ్యా నాయక్ తండాలో నివసిస్తున్న మైనర్ బాలికపై కన్ను వేసి, తనను ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపినట్టు తెలుస్తుంది. జిల్లాలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ బాలిక, దశరథ్ మాయమాటలు నమ్మి, తరచుగా అతడిని కలుస్తున్నట్టు తెలుచుకున్న ఆ బాలిక తండ్రి గోపాల్ కసితో రగిలిపోయాడు. తన కూతురు జీవితాన్ని నాశనం చేస్తున్న, దశరథ్ ను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు.
నాలుగు రోజుల క్రితం, సంగారెడ్డి లో తన కిరాయి ఇంటి నుండి బయటకి వెళ్లిన దశరథ్ ఇంటికి తిరిగి రాకపోవటంతో, దశరథ్ భార్య సంగారెడ్డి పోలీసు స్టేషన్ లో మిస్సింగ్ కేసు పెట్టింది. ఒకవైపు పోలీసులు, కేసు విచారణ చేస్తుండగా, గోపాల్ శనివారం సాయంత్రం నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్ కు వచ్చి దశరథ్ ను తానే చంపానని అంగీకరిస్తూ పోలీసుల ముందు లొంగిపోయాడు. హత్య తర్వాత, తానే శవాన్ని కాల్చేశానని పోలీసులకు చెప్పటంతో అప్పటికే మిస్సింగ్ కేసు నమోదు కావడంటో చిక్కుముడి వీడింది. శనివారం నుండి గ్రామంలో శవాన్ని చూపిస్తానని పోలీసులకు చుక్కలు చూపించిన గోపాల్, చివరకి శవాన్ని నిజాం పేట మండలంలోని ఈద్గా తండా వద్ద చూపించాడు.
సంబంధిత కథనం
టాపిక్