
Best Web Hosting Provider In India 2024
Maha kumbh Mela : ‘మార్చ్ వరకు మహా కుంభమేళా పొడిగింపు’- అన్న వార్తల్లో నిజమెంతా?
Maha kumbh Mela 2025 : ఈ నెల 26తో మహా కుంభమేళా 2025 ముగియాల్సి ఉంది. కానీ కుంభమేళాను పొడిగించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంతా? దీనిపై ప్రయాగ్రాజ్ జిల్లా మెజిస్ట్రేట్ స్పందించారు.
జనవరిలో మొదలైన మహా కుంభమేళా 2025.. ఫిబ్రవర 26తో ముగియాల్సి ఉంది. అయితే, యాత్రికుల తాకిడి విపరీతంగా ఉండటంతో ఈ పవిత్ర కార్యక్రమాన్ని పొడిగించాలని సర్వత్రా విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో, మహా కుంభమేళాని మార్చ్ వరకు పొడిగించారని వార్తలు సైతం వస్తున్నాయి, విపరీతంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై యూపీ ప్రయాగ్రాజ్ జిల్లా మెజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ మందార్ స్పందించారు. మహా కుంభమేళాని మార్చ్ వరకు పొడిగించినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. అది ఫేక్ న్యూస్ అన్నారు.
మహా కుంభమేళా 2025..
మహా కుంభమేళాని పొడిగించినట్టు వస్తున్నవార్తలు నిరాధారమైనవి అని ప్రయాగ్రాజ్ జిల్లా మెజిస్ట్రేట్ తెలిపారు. శుభ సమయాన్ని బట్టి మహా కుంభ్మేళా షెడ్యూల్‌ను ముందుగానే విడుదల చేసినట్టు, అందుకు తగ్గట్టుగానే ఫిబ్రవరి 26న ఈ పవిత్ర కార్యక్రమం ముగుస్తుందని వివరించారు. అప్పటి వరకు యాత్రికులు అందరికి సజావుగా రాకపోకలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మీడియాతో మాట్లాడుతూ ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు భక్తులందరికి అనుకూలంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా మెజిస్ట్రేట్ తెలిపారు. ఎలాంటి ప్రచారాలనూ నమ్మవద్దని విజ్ఞప్తి చేసిన ఆయన, మేళా తేదీని పొడిగించాలని ప్రభుత్వం లేదా పరిపాలన నుంచి ఎలాంటి ప్రతిపాదన లేదని స్పష్టం చేశారు.
మహా కుంభమేళాలో మిగిలిన రోజుల్లో ప్రజలు సజావుగా స్నానాలు చేసి సురక్షితంగా తిరిగి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు.
“సజావుగా ట్రాఫిక్ నిర్వహణ మా ప్రాధాన్యత. దీనిపై నిరంతరం పనిచేస్తున్నాం. ప్రయాగ్రాజ్‌లోని రోజువారీ జీవితంపై ప్రభావం చూపకుండా భక్తుల రాకపోకలను సమతుల్యం చేస్తూ పనిచేస్తున్నాం,” అని ప్రయాగ్రాజ్ జిల్లా మెజిస్ట్రేట్ రవీంద్ర అన్నారు.
‘మేళా ముగిసే వరకు ప్రయాగ సంగం స్టేషన్ మూసివేత’
ప్రయాగ సంగం రైల్వే స్టేషన్ మూసివేత విషయమై జిల్లా మెజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ మందార్ మాట్లాడుతూ.. ముందుగా నోటీసు ఇవ్వకుండా ప్రయాగ్రాజ్‌లోని ఏ రైల్వే స్టేషన్‌ను మూసివేయలేదని తెలిపారు. ఇది కూడా నిరాధారమైన ప్రచారమేనని ఆయన అన్నారు.
“గతంలో కూడా పీక్ డేస్‌లో దారాగంజ్‌లోని ప్రయాగ సంగం స్టేషన్‌ను మూసివేశాము. ఈ స్టేషన్ మేళా ప్రాంతానికి దగ్గరగా ఉండటం వల్ల, ఇక్కడ భారీగా జనం చేరకుండా మేళా ముగిసే వరకు దీన్ని పూర్తిగా మూసివేశాం. మగిలిన అన్ని రైల్వే స్టేషన్లు పనిచేస్తున్నాయి,” అని ఆయన తెలిపారు.
మహా కుంభమేళా 2025 ప్రభుత్వం- జిల్లా పరిపాలనకు చారిత్రక సందర్భం అని, నగరంలోని అన్ని కార్యక్రమాలు సాధారణంగా జరుగుతున్నాయని జిల్లా మెజిస్ట్రేట్ తెలిపారు.
“ఇప్పటి వరకు ఎవరికీ పరీక్షలు మిస్ కాలేదు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డులు కూడా ఎవరైనా పరీక్షను మిస్ అయితే, పరీక్ష ముగిసిన తర్వాత విద్యార్థులకు మరో అవకాశం లభిస్తుందని నిర్ణయించాయి,” అని ఆయన అన్నారు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link