PVR INOX : ‘యాడ్స్​ వేసి టైమ్​ వేస్ట్​ చేస్తున్నారు’ అన్న కేసులో పీవీఆర్​- ఐనాక్స్​కి షాక్​! ఇక నుంచి..

Best Web Hosting Provider In India 2024

PVR INOX : ‘యాడ్స్​ వేసి టైమ్​ వేస్ట్​ చేస్తున్నారు’ అన్న కేసులో పీవీఆర్​- ఐనాక్స్​కి షాక్​! ఇక నుంచి..

 

PVR INOX : ‘నా మీద యాడ్స్​ రుద్ది, 30 నిమిషాలు ఆలస్యంగా సినిమాని ప్రారంభించి, నా విలువైన సమయాన్ని వృథా చేశారు,’ అంటూ బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి పీవీఆర్​-ఐనాక్స్​పై కేసు వేశాడు. ఈ వ్యవహారంపై దిగ్గజ మల్టిప్లెక్స్​ బ్రాండ్​కి బెంగళూరు కన్జ్యూమర్​ కోర్టు షాక్​ ఇచ్చింది.

 
ఓ మాల్​లో పీవీఆర్​ సినిమాస్​..
ఓ మాల్​లో పీవీఆర్​ సినిమాస్​.. 

పీవీఆర్​-ఐనాక్స్​లో మూవీ వాచింగ్​ ఎక్స్​పీరియెన్స్​ బాగానే ఉంటున్నప్పటికీ, సినిమా ప్రారంభమయ్యే విషయంపై చాలా విమర్శలు ఉన్నాయి. చాలా చోట్ల ఎక్కువసేపు యాడ్స్​ ప్రదర్శించి, సినిమాను.. చెప్పిన టైమ్​ కన్నా చాలా ఆలస్యంగా ప్రారంభిస్తుంటారు. ఇది చాలా మంది ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తోంది. అంతేకాదు చాలా సమయం వృథా కూడా అవుతోంది. దీనిని ఓ వ్యక్తి చాలా సీరియస్​గా పరిగణించాడు. “25 నిమిషాల పాటు యాడ్స్​ వేసి, నా సమయాన్ని వృథా చేశారు,” అంటూ కేసు వేశాడు. ఈ వ్యవహారంపై బెంగళూరు కన్జ్యూమర్​ కోర్టు పీవీఆర్​ సినిమాస్​- ఐనాక్స్​కి షాక్​ ఇచ్చింది. అసలేం జరిగిందంటే..

 

ఇదీ జరిగింది..

అభిషేక్​ ఎంఆర్​ అనే వ్యక్తి “సామ్​ బహదూర్“​ సినిమా చూసేందుకు 2023లో పీవీఆర్​కి వెళ్లాడు. సినిమా చూసి, అటు నుంచి అటు వర్క్​కి వెళ్లి, ఇతర పనులు పూర్తి చేసుకునే విధంగా ప్లాన్​ చేసుకున్నాడు. కానీ పీవీఆర్​లో సినిమా ప్రారంభం అవ్వడానికి ఆలస్యమైంది. సినిమాకి ముందు దాదాపు 25 నిమిషాల పాటు యాడ్స్​ ప్లే చేశారు. సినిమా ఆలస్యంగా ప్రారంభం అవ్వడంతో, ఆలస్యంగా పూర్తయింది. ఫలితంగా అభిషేక్​ తన పని చేసుకోలేకపోయాడు. కోపంతో, పీవీఆర్​-ఐనాక్స్​పై కేసు వేశాడు.

“4:05కి సినిమా స్టార్ట్​ అవ్వాలి. కానీ నా మీద యాడ్స్​ రుద్దారు. 4:30కి సినిమా ప్రారంభమైంది. 6:30కి పూర్తవ్వాల్సిన సినిమా, చాలా ఆలస్యమైంది. ఫలితంగా నేను ఇతర ముఖ్యమైన పనులు చేసుకోలేకపోయాను. దీని వల్ల నాకు నష్టం జరిగింది. దీనిని డబ్బుతో పూడ్చలేము. చాలా విలువైన సమయాన్ని వృథా చేశారు. షో టైమింగ్స్​ని తప్పుగా చెప్పి, అక్రమంగా యాడ్స్​ ప్లే చేసి లబ్ధిపొందేందుకు చూస్తున్నారు,” అని ఫిర్యాదుదారుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. బుక్​మైషోని కూడా ఈ కేసులోకి తీసుకొచ్చాడు.

కన్జ్యూమర్​ కోర్టు తీర్పు ఇలా..

ఈ వ్యవహారంపై పీవీఆర్​-ఐనాక్స్​ తన వాదనలను వినిపించింది. పీఎస్​ఏ (పబ్లిక్​ సర్వీస్​ అనౌన్స్​మెంట్స్​) కింద కొన్ని యాడ్స్​ ప్లే చేయడం చట్ట పరిధిలోనే ఉంటుందని, తాము తప్పుచేయలేదని వాదించింది. పైగా ఈ యాడ్స్​ ప్లే చేసే సమయంలో బయట సెక్యూరిటీ చెక్స్​ జరుగుతుంటాయని, ఫలితంగా కాస్త ఆలస్యంగా వచ్చే వారికి ఇబ్బంది ఉండదని పేర్కొంది.

 

కానీ బెంగళూరు కోర్టు పీవీఆర్​-ఐనాక్స్​ చెప్పిన దానితో సంతృప్తి చెందలేదు.

“ఈ యుగంలో టైమ్​ డబ్బుతో సమానం. అందరి సమయం చాలా విలువైనది. ఇతరుల పర్మీషన్​ లేకుండా వారి సమయాన్ని వృథా చేయకూడదు. 25-30 నిమిషాల పాటు థియేటర్​లో ఖాళీగా కూర్చోవడం అంటే మాటలు కాదు. బిజీ షెడ్యూల్​లో సినిమాలు ప్లాన్​ చేసే వారికి ఇది ఇబ్బంది కలిగిస్తుంది. సినిమా చూస్తున్నారు కదా అని వారికి పనిపాటా లేదనుకోవడం తప్పు,” అని కన్జ్యూమర్​ కోర్టు వ్యాఖ్యానించింది.

అదే సమయంలో.. సెక్యూరిటీ చెక్​ల పేరుతో హాల్​లో కూర్చున్న వారి సమయాన్ని వృథా చేయడం తప్పు అని స్పష్టం చేసింది. ఈ కేసుతో బుక్​మైషోకి సంబంధం లేదని, సమయానికి సినిమాని ప్రారంభించే బాధ్యత మల్టీప్లెక్స్​లదే అని వెల్లడించింది.

పీవీఆర్​ సినిమాస్​కి జరిమానా..

ఈ నేపథ్యంలో పీవీఆర్​- ఐనాక్స్​కి రూ. 1లక్ష జరిమానా విధిస్తూ తీర్పును ఇచ్చింది బెంగళూరులోని కన్జ్యూమర్​ కోర్టు. విలువైన సమయాన్ని వృథా చేసినందుకు ఫిర్యాదుదారుడు అభిషేక్​కి రూ. 50వేల నష్ట పరిహారం, అతని మానసి క్షోభకు బదులుగా రూ. 5వేల పరిహారం, కేసు ఫైలింగ్​ సహా అతను చేసిన ఇతర ఖర్చులకు రూ. 10వేలు ఇవ్వాలని ఆదేశాలిచ్చింది.

 

అంతేకాదు.. ఇక నుంచి సినిమా టికెట్​పై చెప్పిన సమయానికే షో స్టార్ట్​ చేయాలని పీవీఆర్​-ఐనాక్స్​కి బెంగళూరు కన్జ్యూమర్​ కోర్టు తేల్చిచెప్పినట్టు సమాచారం.

పీఎస్​ఏలను సినిమా ప్రారంభానికి 10 నిమిషాల ముందు, ఇంటర్వెల్​ సమయంలో వేయాలని కోర్టు స్పష్టం చేసింది.

 
Whats_app_banner
 

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.


Best Web Hosting Provider In India 2024


Source link