Karthika Deepam Serial February 19: కార్తీక్‍ చేతికి రెస్టారెంట్, జ్యోత్స్నకు ఎదురుదెబ్బ.. దీప గతంలో చేసిన సాహసం వల్లే..

Best Web Hosting Provider In India 2024

Karthika Deepam Serial February 19: కార్తీక్‍ చేతికి రెస్టారెంట్, జ్యోత్స్నకు ఎదురుదెబ్బ.. దీప గతంలో చేసిన సాహసం వల్లే..

 

Karthika Deepam Today Episode February 19: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో రెస్టారెంట్‍ ఇవ్వనని కార్తీక్‍తో సత్యరాజ్ చెబుతాడు. ఇక తనదే అని జ్యోత్స్న కూడా సంతోషిస్తుంది. ఇంతలో భారీ ట్విస్ట్ ఎదురవుతుంది. తాత ఇంటికి కార్తీక్ వెళతాడు. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.

 
Karthika Deepam Serial February 19: కార్తీక్‍ చేతికి రెస్టారెంట్, జ్యోత్స్నకు ఎదురుదెబ్బ.. దీప గతంలో చేసిన సాహసం వల్లే..
Karthika Deepam Serial February 19: కార్తీక్‍ చేతికి రెస్టారెంట్, జ్యోత్స్నకు ఎదురుదెబ్బ.. దీప గతంలో చేసిన సాహసం వల్లే..
 

కార్తీక దీపం 2 నేటి (ఫిబ్రవరి 19) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. దివాళా తీసే పరిస్థితిలో ఉన్న రెస్టారెంట్‍ను తమకు ఇవ్వాలని సత్యరాజ్‍ను కార్తీక్, దీప అడుగుతారు. జ్యోత్స్న రెస్టారెంట్‍ను నువ్వు అద్బుతంగా నడిపి.. నా రెస్టారెంట్‍ను దెబ్బకొట్టావని కార్తీక్‍తో సత్యరాజ్ అంటాడు. కంపెనీ నుంచి నిన్ను తీసేసినప్పుడు సంతోషించానని చెబుతాడు. ఎందుకు వచ్చారని కార్తీక్‍ను అడుగుతాడు. రెస్టారెంట్ కోసం అని కార్తీక్ అడిగితే.. కొంటారా అని సత్యరాజ్ ప్రశ్నిస్తాడు.

 

వంట రుచిచూపించిన దీప

రెస్టారెంట్ కొనే స్థోమత తనకు లేదని కార్తీక్ అంటాడు. మరి ఎందుకు వచ్చారని సత్యరాజ్ ప్రశ్నిస్తాడు. ఇంతలో సత్యరాజ్‍కు తాను చేసిన వంటకాన్ని దీప ఇస్తుంది. ఆయన తింటాడు. టేస్ట్ చాలా బాగుందని చెబుతాడు. రెగ్యులర్ రెస్టారెంట్ స్టైల్ కాకుండా డిఫరెంట్‍గా ఉందని చెబుతాడు. తనకు వంటలు ఎలా చేయాలో బాగా తెలుసునని, కార్తీక్ బాబుకు బిజినెస్‍ను ఎలా డెవలప్ చేయాలో కార్తీక్ బాబుకు తెలుసునని అంటుంది.

నష్టాల నుంచి లాభాల్లోకి తెస్తా..

రెస్టారెంట్‍ను తమకు ఇస్తే నష్టాల నుంచి లాభాల్లోకి తెస్తానని సత్యరాజ్‍తో కార్తీక్ చెబుతాడు. అంటే నాకు ఆఫర్ ఇస్తున్నారా అని సత్యరాజ్ అంటాడు. తాము అవకాశం కోసం వచ్చామని కార్తీక్ అంటాడు. మాకు నడిపించడం చేతకాదని చెబుతున్నావా అని సత్యరాజ్ కోప్పడతాడు. ఎలా నమ్మాలని చెబుతాడు. నమ్ముకున్న వారి కోసం కార్తీక్ ప్రాణాలైనా అడ్డుపెడతారని, పడిపోతే పట్టుకుంటారని, ఓడిపోతే గెలిపిస్తారని, కావాల్సిందల్లా అవకాశం అంటూ కార్తీక్ గురించి దీప చెబుతుంది. మీ రెస్టారెంట్‍ను నంబర్ వన్ పొజిషన్‍కు తీసుకొస్తారని అంటుంది.

ఇవ్వలేను.. వెళ్లిపోవచ్చు

చెరో లక్ష జీతం ఇమ్మంటారా అని కార్తీక్‍ను సత్యరాజ్ అడుగుతాడు. తాము ఫ్రీగా వర్క్ చేస్తామని కార్తీక్ అంటాడు. అయితే, బిజినెస్‍లో 25 సాతం వాటా కావాలని అడుగుతాడు. రూపాయి వచ్చేలా చేస్తే 25 పైసలు నాకు ఇవ్వండని కార్తీక్ ఆఫర్ ఇస్తాడు. రెస్టారెంట్‍ను తాను రన్ చేయలేనని సత్యరాజ్ అంటాడు. జ్యోత్స్న బ్రహ్మాండమైన ఆఫర్ ఇచ్చిందని చెబుతాడు. అది వదిలేసి మీకు ఎలా ఇస్తానంటాడు. మీరు ఇవ్వలేనని, వెళ్లిపోవాలని చెబుతాడు.

 

కన్నీళ్లతో ప్రాధేయపడిన దీప

మీ రెస్టారెంట్‍ను కార్తీక్ బాబు కావాలని దివాళా తీయించలేదని దీప చెబుతుంది. ఇప్పుడు మీ రెస్టారెంట్ కోసం కష్టపడతారని, నంబర్ వన్ చేస్తారని, ఒక్క అవకాశం ఇవ్వండి సర్ అని సత్యరాజ్‍ను దీప అడుగుతుంది. చేతులు జోడించి.. దండం పెడతాను ఒక్క అవకాశం ఇవ్వండని ప్రాధేయపడుతుంది. నా కోసం నువ్వు చేతులు జోడించవద్దని కార్తీక్ అంటాడు. కంపెనీని మీరు అభివృద్ధి చేయగలరని, అది ఆయనకు కూడా తెలుసునని దీప అంటుంది. ఒక్క అవకాశం ఇవ్వాలని అడుగుతుంది.

బయట వేచిచూస్తానని కార్తీక్ అంటాడు. అవసరం లేదని, వెళ్లిపోవచ్చని సత్యరాజ్ అంటాడు. దీంతో అవకాశం చేజారిపోయిందని దీప కన్నీరు పెడుతుంది. బయట వేచి చూస్తామని, నమ్మకం ఉంటే ఆలోచించి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని సత్యరాజ్‍తో కార్తీక్ అంటాడు.

పొగరుగా జ్యోత్స్న మాటలు

లోపల ఎంత సేపు ఉన్నారు.. ఏం మాట్లాడారని కార్తీక్‍ను జ్యోత్స్న అడుగుతుంది. ఇంక బయలుదేరాలని అంటుంది. తాను రేట్ మాట్లాడానని, అంతా అయిపోయిందని చెబుతుంది. సత్యరాజ్ రెస్టారెంట్ ఇక తనదే అన్నట్టు పొగరుగా మాట్లాడుతుంది. రెస్టారెంట్ జ్యోత్స్నకే ఇస్తున్నానని సత్యరాజ్ చెబుతారని, మీరు కంగ్రాట్స్ చెబుతూ బాధగా వెళ్లాల్సి వస్తుందని అంటుంది.

 

కార్తీక్ కౌంటర్లు

అహంకారం మీద ఆత్మాభిమానం గెలుస్తాందా అని ఆలోచిస్తున్నానని కార్తీక్ అంటాడు. ఆలోచించొద్దు బావా.. ఆత్మాభిమానం అడుక్కుతినేందుకు కూడా పనికి రాదని జ్యోత్స్న అంటుంది. అహంకారం అనేది ఒక అలంకారం అని చెబుతుంది. “అవును అలంకారమే.. గెేదె మెడలో గుదిబండ కట్టినట్టు అహంకారం కూడా అలంకారమే” అని కౌంటర్ ఇస్తాడు కార్తీక్.

దరిద్రం అనుభవించాల్సిందే

నువ్వేంటి.. నీ రేంజ్ ఏంటి.. నీకు రెస్టారెంట్ ఏంటి అని దీపను మాటలు అంటుంది జ్యోత్స్న. ఆఫీస్ బాయ్ కూడా నిన్ను చూసి గ్లాస్ వాటర్ ఇవ్వడు అని పొగరుగా మాట్లాడుతుంది. వచ్చిన పని చూసుకుంటే బాగుంటుందని, తిట్టాలన్నా చిరాకుగా ఉందని కార్తీక్ అంటాడు. దీపపై చిరాకు పడే రోజు కూడా త్వరలోనే వస్తుందని జ్యోత్స్న అంటుంది. బయలుదేరాలని జ్యోత్స్న అంటే.. మా మీద మాకు నమ్మకం ఉందని దీప అంటుంది. దీప అంటేనే ఓటమి అని, ఆమెతో ఉంటే ఇలాగే దరిద్రం అనుభవించాల్సిందేనని జ్యోత్స్న మాటలు అంటుంది. కోపాన్ని కార్తీక్, దీప అపుకుంటూ ఉంటారు.

కార్తీక్‍కే ఇస్తున్నాం.. జ్యోత్స్నకు షాక్

సత్యరాజ్ బయటికి వస్తాడు. అగ్రిమెంట్ రెండు రోజుల్లో అరేంజ్ చేస్తే ఒకే కదా అని జ్యోత్స్న అంటుంది. తన నిర్ణయాన్ని అందరికీ చెప్పనివ్వాలని సత్యరాజ్ చెబుతాడు. “సత్యరాజ్ రెస్టారెంట్‍ను జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ మాజీ సీఈవో కార్తీక్‍కే ఇస్తున్నాం” అని సత్యరాజ్ చెబుతాడు. దీంతో అనుకోని ఎదురుదెబ్బతో జ్యోత్స్న షాక్ అవుతుంది. దీప, కార్తీక్ సంతోషిస్తారు. మనమే గెలిచాం కార్తీక్ బాబు అని దీప అంటుంది.

 

చీట్ చేశారు

తనను ఎందుకు చీట్ చేశారని సత్యరాజ్‍ను జ్యోత్స్న అడుగుతుంది. చీట్ చేయడమేంటి.. నీకు ప్రపోజల్ నువ్వు చెప్పావ్.. నేను ఎవరికి ఇవ్వాలనేది నా ఇష్టమని అంటాడు. తాను రెస్టారెంట్‍ను డెపలప్‍మెంట్ కోసం కార్తీక్ ఇస్తున్నానని చెబుతాడు. దీప అడుగుపెడితే.. సర్వనాశనమే అని జ్యోత్స్న అక్కసు వెళ్లగక్కుతుంది. జ్యోత్స్న మొండిగా మాట్లాడుతుడటంతో వెళ్లిపోవాలని సత్యరాజ్ అంటాడు.

దీప గతంలో చేసిన పని వల్లే.

రెస్టారెంట్ కొంటాననే వారిని వదిలేసి, ఇవ్వనని చెప్పిన మాకే ఎందుకు రెస్టారెంట్ ఇస్తున్నారని సత్యరాజ్‍ను కార్తీక్ అడుగుతాడు. ఇంతలో తాతయ్య అంటూ ఓ పిల్లాడు.. సత్యరాజ్ దగ్గరికి వస్తాడు. గతంలో రౌడీలతో పోరాడి.. సాహసం చేసి ఆ పిల్లాడిని కిడ్నాప్‍ను దీప అడ్డుకుంటుంది. ఆ పిల్లాడే.. సత్యరాజ్ మనవడే. ఈ పిల్లాడిని ఎప్పుడైనా చూశావా అని దీపను సత్యరాజ్ అడుగుతాడు. ఈ బాబు అంటూ దీప తడబడుతుంది. ఇంతలో ఆ పిల్లాడి తండ్రి వస్తాడు. మా బాబే అని సత్యరాజ్ కొడుకు అంటాడు. మీరా అని దీప పలుకరిస్తుంది. దీప వీళ్లు మీకెలా తెలుసని కార్తీక్ అడుగుతాడు.

నా కొడుకు బతికుండేందుకు కారణం దీపే

నా కొడుకు బతికి ఉన్నాడంటే దాని కారణం మీ భార్యే అని కార్తీక్‍తో ఆ పిల్లాడి తండ్రి చెబుతాడు. రౌడీలతో పోరాడి తన కొడుకును దీప ఎలా కాపాడిందో వివరిస్తాడు. మా సొంత బంధువులే ఆస్తి కోసం తన బిడ్డను చంపాలనుకుంటే.. ధైర్యం చేసి తన బిడ్డను కాపాడిందని అంటాడు. ఆ విషయం ఇందాకా చెప్పాడని, గుర్తుపట్టి నాకు చెప్పాడని సత్యరాజ్ చెబుతాడు. ఇక ఆలోచించకుండా రెస్టారెంట్ మీకే ఇవ్వాలని నిర్ణయించుకున్నానని అంటాడు.

 

ఆ రెస్టారెంట్ ఇక మీదే

అలాగని జాలి పడి ఇవ్వడం లేదని, దీప వంట, నీ టాలెంట్, నీపై దీపకు ఉన్న ప్రేమ, తాపత్రం చూసి రెస్టారెంట్ ఇస్తున్నానని సత్యరాజ్ చెబుతాడు. నన్ను నిలబెట్టాలని చూశారని, అందుకే రెస్టారెంట్ మీకు ఇవ్వడమే న్యాయం అని చెబుతాడు. ఇక నుంచి ఆ రెస్టారెంట్ మీదేనని, ముందుడి నడిపించి లాభాలా బాట పట్టించాలని చెబుతాడు. మంచి రోజు చూసి రెస్టారెంట్ బాధ్యతను చేపట్టాలని అంటాడు. 25 శాతం వాటాకు కూడా ఓకే చెబుతాడు. దీంతో దీప, కార్తీక్ సంతోషిస్తారు. ఈ రకంగా అయినా రుణం తీర్చుకున్నందుకు నాకు సంతోషంగా ఉందని సత్యరాజ్ కొడుకు చెబుతాడు. తొలుత అవమానించేలా ప్రవర్తించిన మేనేజర్.. దీప, కార్తీక్‍కు మర్యాద ఇస్తాడు. సారీ చెబుతాడు. వేషాలు చూసి ఎవరినీ అంచనా వేయవద్దని కార్తీక్ అంటాడు.

తాత ఇంటికి కార్తీక్

ముందుకు ఇంటికి వెళ్లి ఈ శుభవార్తను చెప్పాలని దీప అంటుంది. అయితే, అంతకంటే ముందు ఓ చోటికి వెళ్లాలని, చేయాల్సిన పని ఒకటి ఉందని కార్తీక్ అంటాడు. సత్యరాజ్ రెస్టారెంట్ బాధ్యతలు కార్తీక్‍కు దక్కాయా అని జ్యోత్స్న శివన్నారాయణ ప్రశ్నిస్తాడు. ఇంతలో తన తాత శివన్నారాయణ ఇంటికి దీపను తీసుకొని వస్తాడు కార్తీక్. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని దీప అడిగితే.. కాస్త వేచి ఉండాలని కార్తీక్ చెబుతాడు. శివన్నారాయణ గారు.. పారిజాతం గారు అని కార్తీక్ పిలుస్తాడు. దయచేసి ఒకసారి బయటికి రావాలంటాడు. వాడి సంగతి చెబుదాం పదా అని బయటికి వస్తాడు శివన్నారాయణ. గొడవ అవసరమా అని దీప అంటుంది. గొడవ పడేందుకు రాలేదని కార్తీక్.. అంటే ఎందుకొచ్చావంటూ ఎంట్రీ ఇస్తాడు శివన్నారాయణ.

 

తిట్లే నిచ్చెనలు

గెలిచానని చెప్పేందుకు పెళ్లాన్ని వెంటబెట్టుకొని ఇక్కడికి వచ్చావా అని కార్తీక్‍ను శివన్నారాయణ అడుగుతాడు. ఇల్లు అలకగానే పండుగ కాదని, రెస్టారెంట్‍ను వీళ్ల చేతుల్లో పెట్టి సత్యరాజ్ చాలా పెద్ద పొరపాటు చేశాడంటాడు. వీళ్లు ఇంకా భ్రష్టు పట్టిస్తారని మాటలు అంటాడు. నీ తిట్లే నా గెలుపుకు నిచ్చెనలు తాత అని కార్తీక్ చెబుతాడు.

దిగజారడం గురించి నువ్వు మాట్లాడొద్దు

అలా అనుకుంటూ రోజురోజుకూ దిగజారుతున్నావ్ రా అని పారిజాతం అంటుంది. దిగజారడం గురించి నువ్వు మాట్లాడొద్దు పారు. అది నీ అంత గొప్పగా ఎవరూ చేయలేరు” అని కార్తీక్ అంటాడు. నా ముందే నా భార్యను అంటావా అని శివన్నారాయణ కోప్పడతాడు. కార్తీక్‍ను పారిజాతం అన్ని మాటలు అనొచ్చా తాతయ్య అని దీప అడుగుతుంది. కార్తీక్‍ను రెచ్చగొట్టి తీసుకొచ్చావ్ కదా అని దీపను జ్యోత్స్న అంటుంది. బర్త్ డే ఫంక్షన్‍లో మీరు చేసింది గొడవ అని కార్తీక్ అంటాడు.

మనం వెళ్లిపోదాం అని దీప అంటుంది. ఎందుకు వచ్చారో చెప్పాలని శివన్నారాయణ అడుగుతాడు. బయటికి గెంటేయాలని పారిజాతం అనడంతో సుమిత్ర ఆగ్రహిస్తుంది. వాడు నా మేనల్లుడు అని అంటుంది. కార్తీక్‍ను తమ నుంచి విడదీశావని, గొడవలు పెడుతున్నావని దీపను నానా మాటలు అంటుంది జ్యోత్స్న. మా మమ్మీడాడీ కూడా నీ కోసం మా తాతతో విడిపోయేలా ఉన్నారని చెబుతుంది. అర్థం చేసుకునే మనసు ఉంటే బంధాలు, బంధుత్వాలని ఎవరూ విడగొట్టలేరని కార్తీక్ చెబుతాడు.

 

తాత మనవళ్ల మాటల హోరు

బంధాల గురించి నువ్వే చెప్పాలన్నట్టు హేళనగా శివన్నారాయణ మాట్లాడతాడు. “రెండు పెళ్లిళ్లు చేసుకున్న మీ నాన్నకు, రెండో పెళ్లి దాన్ని చూసుకున్న నీకు బాగా తెలుసు” అంటూ వెకరిస్తాడు శివన్నారాయణ. మాట సమ్మెట దెబ్బలా తరిగిందా అని అంటాడు. మాటలతో కొట్టి మనసులను చంపేయడం మీ అంత గొప్పగా మాకు రాదని కార్తీక్ బదులిస్తాడు. ఇలా తాత మనవళ్లు మాటలు అనుకుంటారు. తండ్రి మాట వినే వాడిని పితృవాక్య పరిపాలకుడు అంటారు.. మరి భార్య మాట వినేవాడిని ఏమంటారు గ్రానీ అని జ్యోత్స్న అడుగుతుంది. పత్నీవాక్య పరిపాలకుడు అంటారు అని పారు అంటుంది. దీంతో కార్తీక దీపం 2 నేటి (ఫిబ్రవరి 19) ఎపిసోడ్ ముగిసింది.

 
Whats_app_banner
 

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024