Best Web Hosting Provider In India 2024

Sleep and Money: కొత్త అధ్యయనం ప్రకారం ధనవంతులు నిద్రపోయే భంగిమలు ఇలా ఉంటాయిట
యూకేలో నిర్వహించిన ఒక పరిశోధనలో నిద్రా స్థితికి, ఆర్థిక స్థితికి మధ్య చాలా ఆసక్తికరమైన సంబంధం ఉన్నట్లు కనుగొన్నారు. బాడీ లాంగ్వేజ్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీ నిద్ర విధానం మీ ఆర్థిక సామర్థ్యం గురించి చాలా చెబుతుందట. ఆ అధ్యయనం వివరాలు తెలుసుకోండి.
రోజంతా అలసిపోయిన తర్వాత హాయిగా నిద్రపోవాలనిపిస్తుంది. నిద్రపోతే శరీరానికి, మనసుకు కూడా విశ్రాంతి దక్కుతుంది. ఎవరైనా తమకు సౌకర్యవంతమైన నిద్రభంగిమలోనే పడుకుంటారు. ప్రతి ఒక్కరి నిద్రపోయే భంగిమలు చాలా భిన్నంగా ఉంటాయి. కొంతమంది వెల్లకిలా పొట్ట మీద పడుకుంటే, మరికొందరు పక్కకు తిరిగి నిద్రపోతారు.
మీరు ఎప్పుడైనా మీ నిద్ర స్థితిని గమనించారా? బాడీ లాంగ్వేజ్ నిపుణుల ప్రకారం, మీ నిద్రా భంగిమ మీ గురించి చాలా చెబుతుంది. దీనిపై తాజాగా ఒక పరిశోధన కూడా జరిగింది. దీని ప్రకారం మీరు నిద్రపోయే భంగిమ మీ ఆర్ధిక స్థితిని తెలియజేస్తుంది. ధనవంతులు నిద్రపోయే విధానం భిన్నంగా ఉంటుంది. ధనవంతులు నిద్రపోయే భంగిమను గోల్డ్ పొజిషన్ అంటారు. అంటే మీరు జీవితంలో ఎంత సక్సెస్ అయ్యారో, ఎంత సంపాదిస్తున్నారో మీరు నిద్రపోయే గోల్డ్ పొజిషన్ చూసి అంచనా వేయవచ్చు.
ధనవంతులు ఎలా నిద్రపోతారు?
కొన్ని నెలల క్రితం బ్రిటన్ లో 5,438 మందిపై ఈ పరిశోధన చేశారు. ఈ పరిశోధనలో, బాడీ లాంగ్వేజ్ నిపుణులు మన నిద్రా స్థితికి, ఆర్థిక సామర్థ్యానికి మధ్య చాలా ఆసక్తికరమైన సంబంధం ఉందని కనుగొన్నారు. ఎక్కువ డబ్బు సంపాదించి, కెరీర్ లో ఎక్కువ విజయాలు సాధించిన వారు ‘ఫ్రీ ఫాల్ పొజిషన్ ‘లో నిద్రపోతున్నారని పరిశోధనలో తేలింది. అంటే, ఈ వ్యక్తులు తరచుగా పొట్టను కిందవైపు ఉంచి పడుకుంటారు. వారి తల ఒక వైపుకి, చేతులు దిండును పట్టుకుని ఉంటాయి. అయితే, ఈ నిద్ర భంగిమ మెడలో తీవ్రమైన నొప్పిని కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు. దీన్నే గోల్డ్ పొజిషన్ అంటారు. ధనవంతులు అధికంగా ఇదే భంగిమలో నిద్రపోతారట.
నిద్రపోయే సమయం
నిద్ర భంగిమలతో పాటు, నిద్ర సమయం గురించి పరిశోధన చాలా ఆసక్తికరమైన విషయాన్ని కూడా వెల్లడించింది. ఈ అధ్యయనం ప్రకారం, సమూహంలో ఎక్కువ సంపాదించే వ్యక్తులు సగటున 6 గంటల 55 నిమిషాల నిద్ర తీసుకుంటారు. ఇది తక్కువ సంపాదించే వారి కంటే 22 నిమిషాలు ఎక్కువ. అయితే, అధిక సంపాదన ఉన్నవారు ఉదయం 6:42 గంటలకు, తక్కువ సంపాదన ఉన్నవారు ఉదయం 7:06 గంటలకు మేల్కొంటారని అధ్యయనం తెలిపింది.
ఈ అధ్యయనం ద్వారా, పరిశోధకులు సరైన నిద్ర భంగిమను కనుగొనడానికి కూడా ప్రయత్నించారు. మీ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా మీ నిద్ర భంగిమ ఉండాలని ఆయన చెప్పారు. ఉదాహరణకు, మీరు మీ దిగువ వీపులో ఇబ్బంది ఉంటే, పక్కకు తిరిగి నిద్రపోవడం, వీపు కిందకు పెట్టి నిద్రపోవడం ఉత్తమం. మీకు యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు ఉంటే ఎడమ వైపుకి తిరిగి నిద్రపోవడం ఉత్తమమైన పద్ధతి.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం
టాపిక్