Best Web Hosting Provider In India 2024
Gunde Ninda Gudi Gantalu Today Episode: మీనాతో షాప్ పెట్టించిన బాలు- ఒక్క దెబ్బకు 2 పిట్టలు- తలదించుకున్న తల్లి, శ్రుతి
Gunde Ninda Gudi Gantalu Serial February 19th Episode: గుండె నిండా గుడి గంటలు ఫిబ్రవరి 19 ఎపిసోడ్‌లో మీనా ఉతకడానికి బట్టలు చాలా ఉంటాయి. అది చూసిన శ్రుతి ప్రభావతిని నిలదీస్తుంది. కానీ, చివరిలో మీనాకు డబ్బులిచ్చి అవమానిస్తుంది. అది తెలిసి మీనాతో షాప్ పెట్టించి ఓనర్‌ను చేస్తాడు బాలు.
Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో పొట్టి బట్టలు వేసుకోవడంపై శ్రుతికి నచ్చజెబుతుంది మీనా. దాంతో శ్రుతి వెళ్లిపోతుంది. ఇదేంటీ ఆంటీ మీనా ఇలా చెప్పగానే శ్రుతి అలా వెళ్లిపోయింది అని ప్రభావతితో రోహిణి అంటుంది. అదే నాకు అర్థం కానిది. అసలు ఈ పూలు అమ్ముకునేదానికి ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చి చచ్చాయి అని ప్రభావతి అంటుంది.
బట్టలు చూసి
నిజం చెప్పాలంటే శ్రుతి చెప్పేది కూడా నిజమే డ్రెస్ అనేది వేసుకునేవాళ్ల మీద ఉంటుంది. చూసేవాళ్ల మీద కాదు అని రోహిణి అంటుంది. కాసేపటి తర్వాత ఫుల్ కవర్‌డ్ బ్లాక్ డ్రెస్సులో శ్రుతి వచ్చి అందరిని ఓకేనా అని అడుగుతుంది. నువ్ ఏ డ్రెస్ వేసుకున్నా అందంగా ఉంటావ్ అని మీనా అంటుంది. మరుసటి రోజు ఉదయం ఉతకడానికి బట్టలు చూసి నిట్టూరూస్తుంది. ఏంటీ అత్తయ్య అన్ని ఒకేసారి వేశారు. ఏరోజుకు ఆరోజుకు వేస్తే నాకు సులభంగా ఉంటుంది కదా అని మీనా అంటుంది.
ఏంటే నీ పర్మిషన్ తీసుకుని వేయాలా అని అంటుంది ప్రభావతి. ఇంతలో రోహిణి వస్తుంది. ఏంటీ రోహిణి ఇవి నువ్ ఉతుకుతావా అని అంటుంది మీనా. లేదు నాకు అర్జంట్‌గా రమ్మని క్లైంట్ నుంచి కాల్ వచ్చింది. నా బట్టలు వాష్ చేసుకున్నాను. ఇవి మనోజ్‌వి. రేపు కంపెనీకి డీలర్స్ వస్తారంటా. కొంచెం వాష్ చేసి పెడతావా అని రోహిణి అంటుంది. వచ్చేవాళ్లు కారులు చూసేందుకు వస్తున్నారా లేకపోతే మీ ఆయన బట్టలు చూడటానికి వస్తున్నారా అని మీనా అంటుంది.
మా ఆయన కారు షోరూమ్ ఎగ్జిగ్యూటివ్. కారు తోలడానికి కాదు అని రోహిణి అంటుంది. సొంత కారు నడిపేవాళ్లు మంచి బట్టలు వేసుకోవద్దని ఉందా. మా ఆయన తన కారులో వెళ్తున్నాడు. వేరే కారులు అమ్మడానికి కాదు అని మాటకు మాట అంటుంది మీనా. ఏంటీ మాటకు మాట సమాధానం చెబుతున్నావ్. నీకన్న పెద్దది. తోడి కోడలు ఒక పని చెబితే చేయవా అని ప్రభావతి అంటుంది. రోహిణి నేను ఎప్పుడు చెప్పిన చేశాను. వాళ్ల ఆయన బట్టలు నేను ఉతకను అని మీనా అంటుంది.
ఆంటీ ఏం చేస్తుంది
ఆ బట్టలు ఇక్కడ పెట్టు వాళ్ల కొడుకు బట్టలు తనే ఉతుక్కుంటుంది అని మీనా తన పని తాను చేసుకుంటుంది. ఏంటే నాకే పని చెబుతున్నావా అని ప్రభావతి అంటుంది. ఉతక్కుంటే ఊకోండి. అంతేకానీ, ఆ మనిషి బట్టలు నేను చచ్చినా ఉతకను అని మీనా తెగేసి చెబుతుంది. దాంతో ఇద్దరు షాక్ అవుతారు. ఇంతలో శ్రుతి వచ్చి నావి కొన్ని టాప్స్ ఉన్నాయి. వాష్ చేసి ఇస్తావా అని అడిగిన శ్రుతి బట్టలన్నీ చూస్తుంది. ఏంటీ ఇవన్ని ఒక్కదానివే ఉతుకుతావా మరి ఆంటీ ఏం చేస్తుంది అని అడుగుతుంది శ్రుతి.
ఇన్ని బట్టలు ఉతకమని ఒక్కదానికి ఎలా చెబుతారు. మనిషి అనుకున్నారా మెషిన్ అనుకున్నారా అని శ్రుతి నిలదీస్తుంది. చూసి చూడనట్లు వదిలేస్తుంటే ఇది నన్ను పని మనిషిని చేసేలా ఉందే అని ప్రభావతి మనసులో అనుకుంటుంది. నా పెళ్లి అయినప్పటి నుంచి నేను ఉతకలేదమ్మా అని ప్రభావతి అంటుంది. మీనాకు పెళ్లి కాకముందు ఎవరు ఉతికారు అని మాటకు మాట నిలదీస్తుంది శ్రుతి. ఇద్దరు ఉన్నారు షేర్ చేసుకుంటే బర్డెన్ తగ్గుతుంది కదా. నువ్వైనా చేయొచ్చు కదా రోహిణి అని శ్రుతి అంటుంది.
నేను పని పాట లేక ఇంట్లో ఉంటున్నానా. నువ్ కూడా డబ్బింగ్ చెప్పి అలసిపోయి రావట్లేదా అని రోహిణి అంటుంది. మనం ఒక్క పనే చేస్తున్నాం కానీ, మీనా అన్ని పనులు చేస్తుంది. ఆంటీ అయితే అది కూడా లేదు. ఇదంతా తెలియక నా బట్టలు కూడా తీసుకొచ్చాను. నేను లాండ్రికి వేస్తాను అని శ్రుతి అంటుంది. పర్లేదు శ్రుతి నేను ఉతుకుతాను అని మీనా తీసుకుంటుంది. ఇవేం ఆలోచించకుండా నువ్ వెళ్లి రెడీ అవ్వమ్మా. ఇదంతా ఏం పెద్ద పని అని ప్రభావతి అంటుంది.
నిలువెల్లా పొగరు
మీరు చేస్తే తెలుస్తుంది పెద్ద పనా చిన్న పనా అని. కనీసం సింపతీ కూడా లేదు. మా పనికి డబ్బులు వస్తాయి. బాగా పనిచేస్తే మెచ్చుకునే వారుంటారు. మాకన్న నాలుగు రెట్ల పని మీనా ఇంట్లో చేస్తుంది. అందుకు ఒక్క రూపాయి కూడా రాదు. పనిచేస్తుందన్న గుర్తింపు కూడా రాదు అని శ్రుతి అంటుంది. మన ఇంటి మనుషులకు పని చేస్తే తప్పేం కాదని మీనా అంటుంది. మనోజ్ కూడా ఇంట్లో మనిషే కదా ఎందుకు చేయవు అని రోహిణి అంటుంది.
నిలువెల్లా పొగరు అని ప్రభావతి అంటే.. స్టాప్ ఇట్ ఆంటీ. ఇవే నాకు బట్టలు ఇస్తే మీ ఇల్లు వద్దు మీ కొడుకు వద్దు అని పారిపోయేదాన్ని అని శ్రుతి అంటుంది. తర్వాత ఉండు అని శ్రుతి వెళ్తుంది. మీనాపై అరుస్తుంటుంది ప్రభావతి. ఇంతలో వచ్చిన శ్రుతి రెండు వేలు ఉంచు. నువ్వే రోజంతా పని చేస్తున్నావ్. బయటి నుంచి సర్వెంట్ వస్తే ఇంతకంటే ఎక్కవే తీసుకుంటారు. నువ్ ఫ్రీగా చేస్తున్నావ్. అందుకే నేను ఇస్తున్నాను అని శ్రుతి అంటుంది.
ఏంటీ శ్రుతి నీకు తెలిసే ఇస్తున్నావా. తెలియక ఇస్తున్నావా. డబ్బు ఇచ్చి పనిమనిషిని చేస్తున్నావా అని మీనా అంటుంది. అలా ఎందుకు అనుకుంటావ్ మీనా. రోహిణి ఐదు వేలు తీసుకొచ్చి ఆంటికి ఇచ్చింది. అది ఆంటీ సంతోషంగా అందరికి చెప్పుకున్నారు. ఇప్పుడు ఆంటీని రోహిణి పని మనిషిని చేసినట్టా. ఏం ఆంటీ మీరు పని మనిషిలా తీసుకున్నారా అని శ్రుతి అడుగుతుంది. ఆంటీ నాకు అమ్మలా అనిపిస్తారు. అందుకే ఇచ్చాను అని రోహిణి అంటుంది.
బాలు రూపాయి ఇవ్వడు కదా
నేను కూడా మీనాను ఒక అక్కలా అనుకునే ఇచ్చాను అని శ్రుతి అంటుంది. నాకు ఇవేం వద్దు అని మీనా అంటుంది. నా బట్టలు కూడా వేసాను కదా. ఊరికే వీరిలా వేయలేను. నేను ఇస్తాను. ఇస్తే తీసుకోవాల్సిందే. లేకుంటే ఊరుకోను అని శ్రుతి అనేసి వెళ్లిపోతుంది. పొగరు బాగా అణగినట్టుంది. గుండెలు పిండేసినట్లుందా అని ప్రభావతి అంటుంది. మనోజ్ బట్టలు ఉతకకుండా శ్రుతి బట్టలు ఎందుకు ఉతుకుతుందో. అప్పుడప్పుడు డబ్బులు ఇస్తుందేమో. పాపం బాలు రూపాయి కూడా ఇవ్వడు కదా. నేను కూడా మనోజ్ బట్టలకు డబ్బులు ఇచ్చేదాన్ని కదా అని రోహిణి అంటుంది.
నీ పనే బాగుందే. ఇంట్లో కూడా డబ్బులు సంపాదిస్తున్నావ్. మా పనులు మాత్రం ఊరికే చేయాలి. తిండి పెడుతున్నాం కదా అని వెళ్లిపోతుంది ప్రభావతి. దాంతో అవమానంతో కుమిలిపోతుంది మీనా. తర్వాత రవి వస్తే శ్రుతి బాగా పలకరిస్తుంది. నీ స్టైల్‌లో టీ పెట్టుకొస్తావా అని అడుగుతుంది. పెట్టుకొస్తాను. మరి నాకెంత కూలీ ఇస్తావ్ అని రవి అంటాడు. ఓయ్.. ఎందుకంత కోపం అని శ్రుతి అంటుంది. టీ పెట్టిస్తా ఎంత డబ్బు ఇస్తావ్, ఎంత కూలి ఇస్తావ్ అని రవి అంటాడు.
ఏదైనా చేసేటప్పుడు ఆలోచించి చేయమని చెప్పాను. నీకు మా వదినా పనిమనిషిలా కనిపిస్తుందా. చెప్పు ఏం మాట్లాడవేంటీ అని రవి అంటాడు. నువ్వే కదా ఆగి మాట్లాడమన్నావ్ అని శ్రుతి అంటుంది. ఇరిటేట్ చేయకు అని రవి అంటాడు. మీ బాలు అన్నయ్యకు జిరాక్స్ కాపీలా మాట్లాడుతావేంటీ. నేనేం ఇరిటేట్ చేశాను. మీనాను పనిమనిషిలా చూశాను అని ఎవరన్నారు అని శ్రుతి అంటుంది. మీనాకు రెండు వేలు ఎందుకు ఇచ్చావ్ అని నిలదీస్తాడు రవి.
సొంత అక్క అయితే వేరు
రెండు వేలు ఇచ్చి ఇన్సల్ట్ చేశావ్ అని రవి అంటాడు. ఇంట్లో మీనాను మనిషిలా గుర్తించింది నేనే. మాకన్న ఎక్కువ పని చేసే మీనాకు ఎవరు ఏం ఇవ్వరు. అందుకే నేను ఇచ్చాను. నువ్ మెచ్చుకుంటావంటే ఇలా తిడతావేంటీ. వంట చేసి వడ్డిస్తే డబ్బు ఇవ్వాలి. నా ఓన్ సిస్టర్ అయితే పాకెట్ మనీ ఇవ్వనా అని శ్రుతి అంటుంది. సొంత సిస్టర్ అయితే వేరు అని రవి అంటాడు. చూశావా నువ్వే మమ్మల్ని వేరు చేస్తున్నావ్ అని శ్రుతి అంటుంది.
ఇలాగే ఇద్దరు గొడవపడుతుంటారు. నాకు తల నొప్పిగా ఉంది పడుకుంటాను అని లైట్ ఆఫ్ చేస్తాడు రవి. నెయిల్ పాలిష్ పెట్టుకోవాలని లైట్ ఆన్ చేస్తుంది శ్రుతి. ఇద్దరు లైట్ ఆఫ్ ఆన్ చేసుకుంటూ పోటీ పడతారు. శ్రుతి, రోహిణి, ప్రభావతి మాటలు తలుచుకుని బాధపడుతుంది మీనా. ఇంతలో బాలు వస్తాడు. ఏమైంది అని అడుగుతాడు బాలు. మొదటి జీతం అందుకున్నందుకు సంతోషంగా ఉంది. బట్టలు ఉతికినందుకు అని డబ్బు చూపిస్తుంది మీనా.
ఈ డబ్బు ఎక్కడిది అని బాలు అంటాడు. జీతం డబ్బు. కూలి డబ్బులు. పని చేస్తే వచ్చిన కూలి. ఎవరిచ్చారన్నది ముఖ్యం కాదు. ఎందుకు ఇచ్చారన్నదే ముఖ్యం. ఇంట్లో ఆస్తులు ఉన్న కోడళ్లు ఉన్నారు. కానీ నాకేముందు సూది దారం. నన్ను మనిషిలా చూడటం మానేసి పని మనిషిలా చూడటం మొదలుపెట్టారు. మీరు చెప్పింది నిజమే. పనులు చేస్తే పని మనిషిలానే చూస్తారు అని ఆలస్యంగా తెలుసుకున్నా అని మీనా అంటుంది.
ఈ మాత్రం కూడు కూడా పెట్టరు
డబ్బులు ఎవరిచ్చారు అని గొడవకు వెళ్లబోతుంటే శ్రుతి ఇచ్చిందని ఆపుతుంది మీనా. శ్రుతి మీ తమ్ముడి భార్య ఆ విలువ కాపాడుకోండి అని మీనా అంటుంది. వాళ్లను ఇంట్లోకి రానివ్వంది. ఎదిరించి మాట్లాడటం తెలియదా అని బాలు అంటాడు. ఎదిరిస్తే ఇంట్లో ఉండనిస్తారా. ఆ ఇద్దరు కోడళ్లు బాగా డబ్బున్నవాళ్లు. బాగా చదువుకున్నవాళ్లు, పని చేస్తున్నారు. నాకేం ఆస్తి ఉంది. డబ్బు ఉంది. కనీసం ఇంటి పని చేయకపోతే ఈ మాత్రం కూడు కూడా పెట్టరు. నేను ఒక్కదాన్నే కదా ఖాళీగా ఉండేది అని మీనా అల్లాడిపోయేలా మాట్లాడుతుంది.
ఆ డబ్బు శ్రుతికే తిరిగి ఇవ్వాలని అనుకున్నాను. కానీ, మొహం మీదే మాట్లాడటం ఎప్పుడో మానేశాను. వెళ్లి రవికి ఇవ్వండి. కానీ, తిట్టకండి. అతనికేం తెలియదు అని మీనా అంటుంది. ఏమైనా తిన్నావా అంటే కడుపు నిండిపోయిందని మీనా చెబుతుంది. తర్వాత ప్రభావతి ఇంటి ముంది పూల షాప్ పెట్టిస్తాడు బాలు. దానికి ప్రభావతి పూల కొట్టు ప్రొపైటర్ మీనా అని రాసి ఉంటుంది.
ఇక నువ్ ఈ షాప్‌కు ఓనర్‌వి అని బాలు అంటే మీనా అందంగా నవ్వుతుంది. తర్వాత శ్రుతితో రిబ్బన్ కట్ చేయించి ఓపెన్ చేయిస్తాడు బాలు. అందుకు శ్రుతికి డబ్బులు ఇప్పిస్తాడు బాలు. ఇది డబ్బుడమ్మ దగ్గరే నేర్చుకున్నా అని ఒక్క దెబ్బకు రెండు పిట్టులు అనేలా బదులిస్తాడు బాలు. అటు షాప్ పెట్టించి, ఇటు శ్రుతికి డబ్బులు ఇప్పించి అందరి నోళ్లు మూయిస్తాడు బాలు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్